"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

దీపావళి రోజు ధరలు ఆకాశాన్నంటాయి.

శీర్షిక
ధరలు ఆకాశాన్నంటాయి.

దీపావళి రోజు మిఠాయిలు,
టపాకాయలు, కొత్త బట్టలు
కొనాలంటే చాలా ఖర్చుతో
కూడిన పని. ఆనందంగా
పండుగ చేసుకోవాలి అని
అందరూ అనుకుంటారు.
దానిలో ఏమాత్రం సందేహం
లేదు. అయితే మిఠాయిల
ధరలు, టపాసుల ధరలు,
బట్టల ధరలు ఆకాశాన్ని
అంటుతున్నాయి. అలా
అని ఏమీ కొనకుండా
ఉండలేము. దానికి తోడు
బంగారం కొనుక్కుంటే
అదృష్టం అని ప్రకటనలు
గుప్పించేస్తూ ఉన్నారు
బంగారం దుకాణాల వారు.
ఏదీ కొనేటట్లు లేదు. ఏదీ
తినేటట్లు లేదు. ఎప్పుడో
పురాణకాలంలో శ్రీకృష్ణుడు
నరకాసురుడిని చంపినందుకు
ఇప్పుడు మనం దీపావళి
చేసుకుంటున్నాము. చాలా
సంతోషించతగ్గ విషయం.
అయితే పండగకు కావలసిన
వస్తువులు కొనాలంటేనే
చలికాలంలో కూడా చెమటలు
పడుతున్నాయి. నలుగురు
ఉండే కుటుంబంలో అందరికీ
బట్టలు కొనాలన్నా తక్కువలో
తక్కువ పదివేలు అవుతుంది.
మిఠాయిలైతే పిండి కొద్దీ రొట్టె
అన్నట్లు మన తాహతుకు తగ్గట్టుగా కొనవలసిందే. మరి
టపాసులు కొనటం తగ్గిస్తే
పిల్లలతో పేచీ. ఈ ధరల
నరకాసురుడిని అంతం
చేసే కృష్ణుడి కోసం మన
మధ్యతరగతి వారు ఎదురు
చూస్తున్నారు. అప్పటి వరకు
అప్పో-సొప్పో చేసి పబ్బం
గడుపుకోవాల్సిందే. తగ్గామో
చుట్టుపక్కల వాళ్ళు మనల్ని
మోసేస్తారు.

ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *