దూరమైన ఒకనాటి బంధం.

దూరమైన ఒకనాటి బంధం…..!!

నా ప్రతి అక్షరం నిన్నే తలపిస్తున్నాయి
వెన్నెల సముద్రంలో దోబూచులాటలు ఆడిన తొలినాళ్ళు ………..
నీవు నేను ఒకరి భుజంపై ఒకరకం చేతులు వేసుకుని తిరిగిన చిన్నతనం……….
ఆ వినీలఆకాశం కాలం గొడుగు కింద మన మధ్య దూరం పెరుగుతూ వెళ్లింది……….
కాలం మనిద్దరిని దూరంగా విసిరేసి విడదీసింది……..
మనం కట్టుకున్న బొమ్మరిల్లు ,గజ్జెనగూళ్ళు కాలం విధిరాతకు బలియై పోయాయి………
మనం నాటిన పూల మొక్కలు రాబంధుల పాలయ్యాయి ……..
వడివడిగా ఏళ్లకు ఏళ్లు గడిచి పోతున్నాయి దూరం మరీ దూరంగా……….
ఇప్పుడు నన్ను నీవు చూడలేనంతగా మారిపోయాను వృద్దాప్యం చేరువలో నెరిసిన జుట్టుతో,కీళ్ల నొప్పులతో నేను తలపోసినవన్ని కూలిపోయిన పాతగోడలు ………..
నేను నిన్ను ఆమధ్య చూశాను కన్నీరిడాను అయినా నీవు వ్యవసాయ పనుల్లో నీ భర్తతో కష్టిస్తూ కనిపించావు నిజంగా నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావు సంతోషం అనిపించింది………..
మన తలరాతలు అంతే మనం మనం విడిపోయినా విడదీయరాని బంధం……….

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *