దేవతలు ( పెద్ద కథ )

దేవతలు

అది 1990 వ రోజులు నేను ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను గవర్నమెంటు ఉద్యోగం కాబట్టి సుఖంగా ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ ఆ ఉద్యోగం కంటే దరిద్రమైన ఉద్యోగం అలాగే మంచి ఉద్యోగం మరొకటి ఉండదు. దరిద్రం అని ఎందుకు అన్నానంటే ప్రభుత్వం ఏ పథకాలు కానీ ఏదైనా పని కానీ ఎలక్షన్లు కానీ ఇలా ఏది పెట్టిన ముందుగా గుర్తొచ్చేది వారికి మేమే అన్నిటికీ మాకు డ్యూటీలు వేస్తారు మరి దానికి డబ్బు తీసుకోరా మీరు అని అనకండి తీసుకుంటాం కానీ ఇచ్చేది తక్కువ గొడ్డు చాకిరీ చేయించుకుంటారు.

ఎందుకు అన్నానంటే ఉద్యోగం పేరు చెప్తే చాలు ఎంత అప్పు అయినా పుడుతుంది ఏ వస్తువైనా ఇంటికి వచ్చి పడుతుంది ఇదే కాకుండా ఊరిలో కనిపించిన ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. నమస్కారాలు పెడతారు అలాంటి సమయంలో ఛాతి రెండు అంగుళాలు పెరుగుతుంది గర్వంతో ఇదిలా ఉంటే నాకు ఉన్న ఊరు లో కాకుండా వేరే ఊరిలో పోస్టింగ్ వచ్చింది దాంతో నేను ప్రతిరోజు వెళ్ళి వస్తూండేవాడు ఆటోలు నాకు చిన్నప్పట్నుండి సైకిల్ బైక్ రావు  దానికో కారణం ఉంది. చిన్నప్పుడు ఒకసారి సైకిల్ నేర్చుకుందామని కిరాయి సైకిల్ తీసుకుని నేర్చుకునే క్రమంలో సైకిల్ మీద నుండి పడి పోయి చేయి విరగొట్టుకున్న దాంతో సైకిల్ నేర్చుకోవడాన్ని పక్కన పెట్టేసి చదువు పైన దృష్టి పెట్టాను.

ఇక ఇంటర్లో స్నేహితులంతా బైక్ నేర్చుకుని కాలేజీకి వస్తుంటే మనం ఎందుకు నేర్చుకోకూడదు అంటూ ఓ స్నేహితుని బండి తీసుకుని ఊరవతల ఉన్న ఖాళీ స్థలంలో వెళ్లి అక్కడ కాసేపు నేర్చుకున్న తర్వాత నా స్నేహితుడు ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు నన్ను ఒంటరిగా వదిలేసి సరే నేను నేర్చుకోవడం మొదలు పెట్టాను వాడు నన్ను మొదటి గేర్ లోనే నేర్చుకోమని చెప్పాడు అని నేను రెండో మూడో గేరు వేసి బైక్ ని పోనిచ్చాను. కాసేపయ్యాక బండి బండి తో పాటు నేను పడిపోయాను జరిగింది.

బండి తునాతునకలు ఏమి నాకు కాలు విరిగింది నొప్పితో లేవలేక అలాగే మూడు గంటలు ఉండిపోయా నాకు జీవితంలో బండి ముట్టుకోవద్దు అనే నిర్ణయాన్ని తీసుకునేలా చేసింది అదిగో అలా నేను నేను బండి ఎక్కే యోగం లేక ఇప్పుడు ఆటోలో బడికి వెళుతూ నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు ఏంటి సార్ ఎలక్షన్ డ్యూటీ ఎక్కడ పడింది మీకు అడిగిన వెంకటేశం పిలుపుతో బయటకు వచ్చినా నమస్తే సార్ అని అడిగా మీ దగ్గరికి మా దగ్గర అయిపోయాయి లక్ష్మణ్ సార్ మీ దగ్గరికి పొమ్మన్నాడు సరే అని ఎలక్షన్ డ్యూటీ ఎక్కడ  పడింది అంటూ  అడిగాను.

సార్ చంద్రం సార్ మా స్టాఫ్ కు మాకు కంగ్టి పడింది. మీకు ఇక్కడ అడిగాడు వెంకటేష్ నాకు నారాయణఖేడ్ దగ్గర ఏదో పల్లెటూరు వేశారు అన్న అయితే హెడ్ క్వార్టర్ కి ఎప్పుడు అన్నాడు కూర్చుంటూ ఎల్లుండి మరి మీరు ఎప్పుడు పోతున్నారు మేము కూడా కావచ్చు  మా హెడ్ ఎప్పుడు అంటే అప్పుడు అన్నాడు పోవుడు ఇద్దరం ఆటో దిగి లోకి నడిచాం బడిలోకి నడిచా లోపలికి వెళ్లగానే నర్సయ్య ఎదురై నా బ్యాగు తీసుకున్నాడు అందరూ వచ్చారా అని అడిగా నిశ్శబ్దంగా ఉన్న ఆవరణ ను  చూస్తూ వచ్చారయ్యా.. ప్రార్థన ప్రకాష్ సార్ చేయించారు.

ఈరోజు మీరు ఆలస్యంగా వస్తారని సార్ చెప్పారు అన్నాడు రాత్రి ఒక ఫంక్షన్ నుండి వచ్చేసరికి లేట్ అయింది. అందుకే లేట్ ఇదిగో నరసయ్య రెండు ఛాయి లు తీసుకురా అన్న సరే సార్ అంటూ నరసయ్య బ్యాగును లోన పెట్టి కుర్చీ తుడిచి, టీ తేవడానికి వెళ్ళాడు ఇదిగో వెంకటేశం సార్ ఇదే మా స్కూలు ఎట్లున్నది అన్నాడు చంద్రం సార్ మా స్కూలు కంటే నయం సార్ శుభ్రంగా ఉంది మా ఊర్లోనే ఆయా నాలుగు రోజులు వస్తే నాలుగు రోజులు డుమ్మా కొడితే అది ఏమన్నా అందం అంటే వాళ్లు ఎక్కడ లొల్లికి వస్తారు అనే భయం వల్ల మేము ఏమి మనం అన్నాడు నవ్వుతూ బీరువా తెరిచి అవును సార్ ఈ మధ్య జనం కూడా హుషారై తెలివి మీరి పోయారు  ఏదైనా అంటే ఒక కేసు పెడతారు అంతే ఇక మనకు శ్రీకృష్ణ జన్మ స్థానమే అంటూనే సార్ మా దగ్గర కూడా  ఎక్కువ లేవు ఉన్న దాంట్లోనే కొన్ని ఇస్తున్న మరి మా దగ్గర చార్టులు అయిపోయాక మీ దగ్గరికే పంపిస్తా అప్పటి లోపు మీ లక్ష్మణ్ సార్ ని పోయి ఏం. ఈ.వో దగ్గర తెచ్చుకోమని చెప్పు అన్నాడు.

సరే సరే చెప్తా మీకు తెచ్చే బాధ్యత నాదే అన్నాడు వెంకటేష్ సరే ఇదిగో తీసుకోండి అంటూ ఒక ఒక 20 షిట్లు ఇచ్చాడు వాటిని జాగ్రత్తగా తన బ్యాగ్లో పెట్టుకొని మరి వస్తా సార్ నాకు ఇంకో గంటలో క్లాస్ ఉన్నది అన్నాడు అయ్యో ఇంత దూరం వచ్చి చాయ్ తాగకుండానే పోతారా సార్ ఆగండి అని ఆగో మాటల్లోనే వచ్చిండు నరసయ్య నువ్వు ఇట్లా లేట్  చేస్తే ఎట్లా నర్సయ్య సారు పోతా అనవట్టే అన్నాడు చంద్రం సార్. ఇది మల్ల చేపించిన సార్ కడక్ చాయ్ అంటూ చెరో గ్లాసు ఇచ్చాడు నరసయ్య రెండే రెండు నిమిషాల్లో వేడి టీ తాగేసి ఇక వస్తా సార్ థాంక్యూ అంటూ షేక్హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు వెంకటేశం సార్ ఇది జరిగిన రెండు రోజులకు ఎలక్షన్ డ్యూటీ వల్ల స్కూల్ కి సెలవు ఇచ్చి నాకు వచ్చిన ఆర్డర్ ని తీసుకొని హెడ్ క్వార్టర్ కి వెళ్లాను రెండు రోజుల ట్రైనింగ్ తర్వాత మూడో రోజు బాక్సులు ఇచ్చి నన్ను పోలింగ్ ఆఫీసర్ గా  ఏదో పల్లెటూరికి వేశారు.

ఆ పల్లెటూరి పేరు వినగానే నాతో పాటు వచ్చే నలుగురు ఉలిక్కిపడి భయపడ్డారు. మా ఆపై ఆఫీసర్ దగ్గరికి వెళ్లి వేరే ఏదైనా ఊరికి మార్చమని బతిమాలడం విన్న నేను కానీ నేను వెళ్లి అడగలేక పోయాను నాకున్న మొహమాటం వల్ల ఏం చంద్రం సార్ ఏ ఊరికి అన్నాడు. నేను చెప్పాను ఇంకోసారి  అడిగి అమ్మో అని  అయినా అతను ఇక చేసేదేముంది  వెళ్ళడమే అనగానే ఆ ఊరికి పోవా అంటేనే అందరూ భయపడుతున్నారు ఎందుకు అని అడిగా నెమ్మదిగా అదే అక్కడ గొడవలు ఎక్కువ పైగా నక్సలైట్లు కూడా ఉంటారు వాళ్ళు జన జీవన స్రవంతిలో కలిసిన వారే ఎక్కువ వాళ్లలో వాళ్లు గొడవలు పడుతూనే ఎదురు వచ్చిన వారిని కూడా చంపుతారు లేనిపోని గొడవల్లో కి వెళ్ళకుండా జాగ్రత్తగా మన పని మనం చేసుకొని రావాలి కష్టమే కానీ సరే వెళ్ళండి అంటూ వెళ్ళిపోయాడు రాంబాబు.

వీడిని ఎందుకు అడిగాను రా బాబు నాకసలే భయం ఎక్కువ భయం పెట్టి వెళ్ళాడు అని అనుకుంటూ నేను ఉన్న హాల్ లో కి వెళ్లాను 12 గంటలకు బస్సు వెళుతుంది. ఆ కాసేపైనా నడుము వాద్దామనుకుని వెళ్లి నా భార్య కట్టించిన చపాతీ టమాట కూర తినేసి పడుకున్నాను అప్పట్లో ట్రైనింగ్ సెంటర్లో భోజన ఏర్పాట్లు లేవు ఉన్న మా వరకు రాకపోయేది అందుకే మేము ఇంటి నుండి నిల్వ ఉండేలా కారం పూరీలు చపాతీ టమాట పచ్చడి లాంటివి తెచ్చుకునే వాళ్ళం అందరం ఒక పెద్ద హాల్లో లాంటి దాంట్లో తెచ్చుకున్న లగేజీ తో ఉంటూ ఒకటి బాక్సులు ఒకరం పంచుకునే వాళ్ళం తినేవాళ్ళం మూడు రోజులకనీ కట్టించిన చపాతీ ,కూర రెండు రోజులకే అయిపోయాయి తిని కాసేపు పడుకున్న ఒక అరగంట తర్వాత క మాస్టారు అనే రాంబాబు పిలుపుతో మెలకువ వచ్చి గబగబా నా లగేజ్ సర్దుకుని మా ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళాను అతను అప్పటికే బ్యాలెట్ బాక్సులు పేపర్లు ఇంకో ఓటర్ లిస్ట్ ఇలాంటివన్నీ నాకు అప్పగించి నలుగురిని చూపించి వాళ్ళు మీతో పాటు వస్తారు పోలింగ్ అవగానే వాళ్ళు వెళ్ళిపోతారు మీరు బస్సులో వచ్చేయండి బస్సు ఏ ఊర్లో అవుతుంది అని జాగ్రత్తలు చెప్పాడు.

ఇంతలో మమ్మల్ని తీసుకు వెళ్లే బస్సు వెళ్ళిపోతోంది అంటూ హారన్ వినిపించే సరికి ఆ బాక్సులను పేపర్లను తీసుకొని వెళ్లి బస్సులో కూర్చున్నా,బస్ స్టార్ట్ అయ్యింది దగ్గర ఆగి అక్కడివారిని దింపుతూ తెల్లారి మూడు గంటలకు నన్ను నా డబ్బాలను దింపేసి వెళ్ళిపోయింది బస్సు భారంగా దుమ్ము రేపుతోంది..బస్సు దిగి చుట్టూ చూశాను ఒక మూడువందల  గడపలు కూడా ఉండదేమో ఎదురుగా చిన్న స్కూలు ఒక పెద్ద హాల్ అలాంటిది ఉంది నేను త్వరగా లోపలికి వెళ్లి పెట్టాను ఇంకాసేపట్లో పోలింగ్ స్టార్ట్ అవుతుందని అనుకున్న నాతోపాటు రావాల్సిన నలుగురు ఇంకా రాలేదు ఎందుకు ఖాళి గా ఉండడం అని వారిపని కూడా నేనే చేశాను అక్కడున్న టేబుల్స్ కుర్చీలు విభజించి పనిచేస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చేసి సార్ ఈ పనికి  మీరు ఎందుకు చేస్తున్నారు  మేము ఉన్నాం కదా కొంచం ఆలస్యం అయ్యిందని నొచ్చుకున్నారు కానీ నేను ఏమీ అనలేదుఅందులో పెద్ద వ్యక్తి వాచ్మెన్ అని పరిచయం చేసుకుంటూ నేను ఇక్కడికి వచ్చి  ఇరవై ఏళ్ళు అయ్యింది వీడునా కొడుకు అంటూ చెప్పి నీళ్ళు తెచ్చి పెట్టారు.

రెండు నిమిషాల్లోనే నాకు వేడివేడి టీ వచ్చింది. గబగబా పళ్ళు తోముకుని టీ తాగి పక్కనే ఉన్న చెట్ల లోకి వెళ్లి వచ్చాను నేను వచ్చేసరికి నాతో పాటు రావాల్సిన నలుగురు కూడా బైకుల మీద వచ్చి స్కూల్ వాచ్ మెన్ తో ముచ్చట్లు పెడుతున్నారు అని చూడగానే నమస్తే సార్ కొంచెం లేట్ అయింది అన్నారు నవ్వుతూ లేదులే అన్నట్టుగా చూస్తాను అన్నాడు అక్కడే ఉన్న బండమీద స్నానం చేశాను. వాళ్ళు కుర్చీల్లో కూర్చున్నారు.

స్నానం చేసి సూర్యభగవానుడిని నమస్కరించాను భక్తిగా నేను రావడం చూసి రండి మీకోసం వేడిగా ఉప్మా చేయించి తీసుకొచ్చాను ఇక్కడ దొరుకుతుందో లేదో అని అంటూ ఒక బాక్స్ ఇచ్చారు నలుగురిలో ఒకరైన నరేష్ అనే సార్ అయ్యో మీకు ఎందుకు సార్ అని నేను అంటూనే తీసుకొని తినేసా మరి వాళ్ళు లేటుగా వచ్చినందుకు నాకు ఈ విధంగా లంచం ఇచ్చినా అది నా కడుపు నింపిందిగా అప్పటికి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు కానీ పల్లెల్లో జనాలు అప్పుడప్పుడే లేవడం మొదలుపెట్టాడు అనుకుంటా ఉప్మా తినగానే రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళ మీదికి నిద్రాదేవి వచ్చింది కానీ టైం ఆరు అవ్వబోతుంది సార్ కాసేపు నడుం వాలుస్తారా బస్సు ప్రయాణం కదా అన్నాడు నారాయణ సమాధానం చెప్పేoతలోనే ఎవడయ్య ఎవడు వచ్చింది నా ఇంటికి రాకుండా ఇక్కడ ఎందుకు ఉండాలి అంటూ  ధోతి కట్టుకున్న వ్యక్తి వచ్చాడు ఆ భయానికి నిద్ర ఎగిరిపోయింది.

ఎవరా అంటూ బయటకు వచ్చాం అందరం నన్ను చూస్తూ ఆ వ్యక్తి నువ్వేనా వచ్చింది వచ్చి ఇక్కడ కూర్చుంది నువ్వెందయ్య నా దగ్గరికి రాలే నా ఇంటికి రావాలి కదా అన్నాడతను ,నేను ధైర్యం కూడదీసుకుని అయ్యా నమస్కారం నా పేరు చంద్రం ఇక్కడ నాకు ఆఫీసర్ గా పోస్టింగ్ వేశారు,నాకు ఈ ఊరు కొత్త,మనుషులు కొత్త, ఎవరేమిటొ తెలియదు,తెల్లారి మూడు గంటలకు బస్సు నన్ను వదిలిపోయింది అప్పటికి ఇక్కడ ఎవరు లేరు ఆ రాత్రి మీ ఇళ్లలోకి వస్టే మాట్లాడితే నన్ను దొంగ అని అనుకుంటారేమో అని ఇదిగో ఇక్కడ అవి ఇవి సర్ధుకున్నా,చాలా సేపటి తర్వాత  వాచ్ మెన్ వచ్చాడు,ఇక నేను ఎవరింటికి రావాలి అన్నాను చేతులు జోడించి నమస్కరిస్తూ వినమ్రంగా, ఎందుకంటే నాకు అంతకన్నా మార్గం లేదు మరి ఇంతలో ఇంకో నలుగురితో మరో వ్యక్తి వచ్చాడు. ఎందయ్య రాగానే యూత్ నీ కల్సుకోవాలని తెల్వదా ఏం మనుషులయ్యా మీరు మర్యాద పాడు లేదు అన్నాడతను.

దానికి మొదట వచ్చినాయన ఒసొస్ మర్యాద మీకే తెల్సు గాని ఓ పంతులయ్య మీరు పదండి మా ఇంటికి అన్నాడు కాదు లేదు మా ఇంటికి వస్తాడు అన్నాడు వచ్చినతను నాకు భయం వేసింది ఎక్కడ గొడవ పడుతారో అని దాంతో వారిని చూస్తూ అయ్యా మేము ఎవరిల్లకు రాకూడదు ఈ పోలింగ్ బూతుని వదలొద్దు పెడితే case అవుతుంది అన్నాను నన్ను విచిత్రంగా చూస్తూ ఎంటయ్య ఇదివరకు వచ్చిన సార్లు మా ఇళ్లలోకి వచ్చి తాగి తిని వెళ్ళేవాళ్ళు నువ్వేంటి రానాoటున్నావు అన్నాడు మొదటి ఆయన దానికి నేను అయ్యా నేను మిమల్ని ఏమీ అన లేను కానీ నాకు కొన్ని పరిధులు,ఆంక్షలు ఉంటాయి నేను దానికి లోబడే పని చేయాలి, ప్రభుత్వం ఇచ్చే డబ్బు నాకు సరిపోతుంది.పైగా నాకు తాగుడు అలవాటు లేదు అన్నాను చేతులు జోడిస్తూ నా మాటలో ఉన్న తీక్షణత వారికి అర్ధమయ్యినట్టుగా ఉంది.

ఏమీ మాట్లాడకుండా కాస్త ముందుకు నడిచి  మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చి తాగుడైతే లేదు కానీ  తింటారు కదా అయితే నేను పంపిస్తా అన్నాడు నేను కూడా పంపిస్తా అన్నాడు రెండో వ్యక్తి ..నేను ఇక ఏమీ అనలేక మీ ఇష్టం అన్నాను ఎందుకంటే అక్కడ నాతో ఉన్న నలుగురు తింటారు కదా అని నేను వద్దంటే వాళ్ళు  ఏమంటారో అని అనుకుని వారిద్దరూ వెళ్ళిపోయాక వాచ్మెన్ వచ్చి బాబు రెడ్లు ఇద్దరిని ఆధరగొట్టారు కదా ఇక మిమ్మల్ని వారు మర్చిపోరు అన్నాడు అందులో రెండో వ్యక్తి రాజారెడ్డి ప్రతిపక్షం అతను ,మొదటి వ్యక్తి చలం రెడ్డి అతను అధికార పార్టీ వ్యక్తి ఇప్పుడు ఇద్దరు పోటీలో ఉన్నారు అంటూ ఇద్దరికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమతుంది అంట అలాంటిది ఒక్క మాటతో వారిని నేను మార్చాను అని నన్ను పొగిడాడు వాచమేన్, అదేం పట్టించుకోకుండా పదండి అంటూ నేను పనిలోకి వెళ్ళాను దాదాపు అరగంట తర్వాత వేడి వేడి జొన్న రొట్టెలు, మటన్ వచ్చాయి టిఫిన్ అంటూ ,ఇంకో రెండు నిమిషాలు కూడా అవ్వక ముందే రెండో వైపు నుండి కూడా రాగి సంకటి,సల్ల వచ్చాయి ఎండాకాలం చల్లదనం అంటూరెండు తినలేకపోయాను కానీ తీసుకోకపోతే అదేం గొడవనో అనుకుంటూ ఆదోటి ఇదోటి తినేసి ఇక పోలింగ్ మొదలైందని పనిలో పడిపోయాము. మధ్యాహ్నానికి ఓట్లు సమానంగా ఉన్నాయి మధ్యాహ్నం కూడా లంచ్ అయితే పోటీపడి మరీ పంపించారు చికెన్ మటన్ బాగార అన్నంతో విందు ఏర్పాటుచేశారు ఐదుమందికి ఇంత హంగామా ఎందుకో నాకు అర్థం అయింది అది లంచమనీ అయినా నేను ఏం అనలేదు ఇదంతా మామూలే సార్ ప్రతి ఊరి వాళ్ళు మనకి ఫుడ్ ఏర్పాటు చేయడం కామన్ అన్నారు నాతో వచ్చిన వారు.

నాకు వేరేఅవకాశం లేకపోవడంతో తిన్నాం అయినా ఎంతతింటాం ముందే ఎండాకాలం కావడంతో బగార అన్నం తినలేకపోయా మామూలు కన్నా తక్కువ తినేసాం ఇంక మళ్ళి పోలింగ్ మొదలైంది మూడుగంటలు అప్పుడు మొదలైంది గొడవ కత్తులు కటార్లు పట్టుకొని ఒకరి అనుచరులను ఒకరు కొట్టుకుంటూ అంతకుముందే వారికే పాత పగలు ఉన్నాయంట వాటిని ఈ సందర్భంగా అంటే ఒకరి కంటే ఇంకొకరికి ఓట్లు ఎక్కువగా వస్తున్నాయని ఎవరు చెప్పారో గానీ అది మనసులో పెట్టుకుని అనుచరులు కొట్టుకోవడం మొదలు పెట్టారు దాంతో ఊరంతా అల్లకల్లోలంగా తయారైంది ఓట్లు వేయడానికి వచ్చిన వారు గబగబా వేసి వెళ్ళిపోయారు

మాకున్న ఒకే ఒక వాచ్ మెన్ కూడా గొడవ పెద్దది అయితే తాగిన మత్తులో ఎవరిని ఎవరు నరుకుతారో అంటూ వెళ్ళిపోయాడు మీరు కూడా వెళ్ళిపోoడని హెచ్చరిస్తూ పోలీసులకు చెప్పాలన్నా నేను కానీ వాళ్ళని వీళ్ళు పొలిమేరలకు కూడా రానివ్వరు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు వాచ్ మెన్.

అతను వెళ్ళిపోగానే నాతో వచ్చిన నలుగురు కూడా సార్ మేము వెళ్లిపోతాం సార్ మా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి మాకు చిన్న పిల్లలు ఉన్నారు మా కుటుంబానికి మేమే దిక్కు,డబ్బు లేకున్నా సరేనంటూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు వాళ్లు బతికుంటే చాలంటూ…

ఊరంతా గొడవగొడవగా ఉంది సమయం ఐదు గంటలు అయింది అప్పటి వరకు కాస్త కోలాహలంగా ఉన్న పోలింగ్ బూత్ నిశ్శబ్దంగా తయారైంది అంత నిశ్శబ్దంలో నేనెప్పుడూ ఉండలేదు చూడలేదు నేనొక్కడినే ఉన్నాను నాతోపాటు బ్యాలెట్ డబ్బాలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత నామీద ఉంది కాబట్టి నేను వెళ్ళడానికి లేదు ప్రాణాలు మీద తీపిఉన్నా ప్రభుత్వం నన్నునమ్మి పంపించింది నావిధి నేనునిర్వర్తించాలి కదా నాకు అప్పుడు అనిపించింది ఈ గొడవంతా బ్యాలెట్ బాక్సులు కొట్టేయడానికి అని నా ఊహనిజమే అని సమయం ఉన్నా ఓట్లు వేయడానికి ఎవరూ రాలేదు.

ఐదు గంటల తర్వాత నాకు విషయం అర్ధమయ్యి  వాటిని ప్యాక్ చేసి సీలు కూడా వేశాను అదంతా అయ్యేసరికి ఏడూ గంటలు అయింది ఇంకా నయం కరెంటుపోలేదు లేదంటే నా పని కష్టమయ్యేది వాటిని  జాగ్రత్త గా ఒకదగ్గర చేర్చి కర్చిపు తో  మొహం తుడుచుకొని వాచ్ మెన్ పొద్దున్న  పట్టిపెట్టిన కుండలో నీళ్లుతాగి అక్కడున్న కుర్చీలో కూర్చున్నా ఏడుగంటల ఇరవై నిమిషాలు ఊర్లో మాటలు గాలిలో తేలివస్తూ వినిపిస్తున్నాయి..

పట్టుకోండి రా నరకండిరా అంటూ నాకు భయంతో చెమటలు కారిపోతున్నాయి.ఏడుగంటలకె ఊరంతా తినేసి పడుకున్నారు తలుపులు బిడాయించుకుని ఎండాకాలమైనా ఆరుబయట ఒక్కపురుగులేదు.నేను ఒక్కడినేఉన్నా బడిలో చిక్కుకుపోయి  ఎనిమిది గంటలు అయ్యేసరికి కడుపులో ఆకలి మొదలైంది ఇంతలో మూసిన కిటికీల మీద రాళ్ల వర్షం మొదలైంది బ్యాలెట్ బాక్సులు దక్కవు ఏమో అని అనుకున్నా రాళ్ల వర్షం అరగంటకు పైగా సాగింది అవి పగిలి పోయి నా మీద ఎక్కడ వచ్చి పడతాయో అనే  భయంతో బిక్కచచ్చిపోయా అరగంట తర్వాత ఎవరూ లేరు అనుకున్నారో ఏమోకానీ రాళ్ళ పడడం తగ్గిపోయింది భయం, బెదురు కడుపులో ఆకలి ఇంతలో పులి మీద పుట్రలా ఉన్న ఒక్క లైట్ పోయింది కరెంటు పోయింది ఏదో వాళ్లే తీసేసారు తెలియక ఇంకా ఒదిగి కూర్చున్నా అనవసరంగా ఇక్కడ వేశారు ఇలాంటి ఊరు అని తెలిసిన ఆఫీసర్లు పోలీసులని పంపించలేదు ఎందుకు అయినా ఆ ఊరివారంతా పోలీసులని ఊర్లోకి రానివ్వరు అని పొద్దున వాచ్ మెన్  చెప్పింది గుర్తొచ్చి నిట్టూర్చాను కడుపులో ఆకలికి పేగులు మేలి తిరిగి పోతున్నాయి మధ్యాహ్నం  ఒంటి గంటకు  తిన్న అన్నం అరిగిపోయింది ఎప్పుడో ఎండలో సరిగ్గా తినలేక పోయా ఇప్పుడేమో ఆకలి పెరిగి పోతుంది కళ్ళు తెలిపోతున్నాయి గాలి లేకపోవడం వల్ల  షర్టు చెమటతో తడిసిపోయింది. కరెంట్ ఇంకా రాలేదు దాహంతో నాలుక పిడచ కట్టుకు పోతుంది వెళ్ళి కుండలో నీళ్లు తాగాలి అన్నా నాకు భయం తో  ముచ్చెమటలు పడుతున్నాయి.

అయినా భయం దాహాన్ని జయించింది ఏ చెల్లి మెల్లగా గ్లాస్ తో నీళ్ళు ముంచుకుని తాగొచ్చి మళ్లీ కూర్చున్న టైం  చూద్దాం అనుకుంటే చీకట్లో కనిపించలేదు సరిగ్గా భగవంతుడా ఇక్కడకు వచ్చి చిక్కి పోయాను అవతల నా భార్య పిల్లలు ముసలి తల్లిని ఎన్ని ఆశలు కోరికలు పిల్లల్ని బాగా చదివించాలని వారికి మంచి భవిష్యత్తు అందించాలని సొంత ఇల్లు కట్టుకోవాలని తల్లి కి యాత్రలు చేయించాలని, భార్యకి ఒక్క నగ అయినా అయినా కొని పెట్టాలనే కోరికలు ఆశ లు  ఈ రోజుతో అయిపోయినట్లే ఇక ఈ ఊరిలోనే నేను నా ప్రాణాలు పోతాయి ఇలా ఆలోచిస్తున్నా నాకు కిటికీలను కొడుతున్న శబ్దం కాస్త ఆలస్యంగా వినబడింది అయిపోయింది అంతా అయిపోయింది వచ్చారు వాళ్లు వచ్చేసారు నన్ను చంపి బ్యాలెట్ బాక్సులు తీసుకొని వెళ్తారు అనే పిచ్చి భయంతో పిచ్చిగా కెవ్వు మంటూ కేక  పెట్టి పడిపోయాను.

******************

నేను దాదాపు గంట తర్వాత కళ్ళు తెరిచి చూసాను నా మొహం లోకి ఆత్రంగా చూస్తున్నా ఒక మహిళ కనిపించింది కళ్ళు బాగా విప్పి ఆ ముఖాన్ని చూడగానే అది ఒక స్త్రీ ముఖం అని అర్థం అయ్యి తెలివి లోకి వచ్చి చుట్టూ పరికించి చూశాను

ఒక చిన్న ఒక వైపు బట్టలు ఇంకో వైపు పోయి మరోవైపు నేను నా ఎదురుగా 30 ఏళ్ల స్త్రీ ఒక నలభై ఏళ్ల వ్యక్తి చిన్న బాబు పడుకుని నిద్ర పోతున్నారు నేను అయోమయంగా చూడడంతో ఆమె మాట్లాడుతూ భయపడకు సార్ ఇది మా ఇల్లే నీకేం భయం లేదు నువ్వు క్షేమంగానే ఉన్నావు అంది నేను నా బాక్సులు అని అన్నా మెల్లగా మీ బాక్సులు కూడా క్షేమంగానే ఉన్నాయి అంటూ ఒక గ్లాసులో నీళ్ళు ఇచ్చింది. వాటిని గడగడా తాగేసి లేచి కూర్చున్నా ఇంతలో ఆమె వెళ్లి కట్టెల పొయ్యి నిప్పుల మీద పెట్టిన ఉంచిన రాగి సంకటిని సత్తు గిన్నె లో పెట్టుకొని పక్కన ఏదో పచ్చడి వేసుకుని నా చేతిలో పెట్టింది దాన్ని చూడగానే నా ఆకలి  గుర్తొచ్చి అంతవరకు ఉన్న  భయం ,టెన్షన్, తగ్గాయని ఆకలితో ఉన్న నాకు అదే అమృతం అనిపించి తినేసా ఆమె కూడా  మళ్ళి తెచ్చి పెట్టింది నీళ్లు తాగి తృప్తిగా తెన్చాను .

అప్పుడు వచ్చింది నాకు అనుమానం నేను పడిపోయాను కదా మరి ఇక్కడికి ఎలా తీసుకు వచ్చారు అన్నాను ఆమె భర్తను చూస్తూ ఆమె ఇలా అంది మేము ఈ నాలుగేళ్ల క్రిందట ఇలాగే గొడవల్లో నా భర్త కాలు పోయింది దానితో నేనే అన్ని పనులు చేస్తాను నా భర్త ప్రభుత్వం ఇచ్చిన సైకిల్ తోను లోన్ తో పక్క ఉరిలో  ఎస్టిడి బూత్  పెట్టాం  రోజు మేము వెళ్లి వస్తాను అక్కడికి ఈ రోజు కూడా అలాగే వెళ్లి వస్తూ ఉండగా ఎవరో బడి కిటికీలను రాళ్లతో కొడుతున్నారు ఎలక్షన్లు కదా అని గుర్తొచ్చింది మాకు వాళ్లు మమ్మల్ని చూడగానే వెళ్లిపోయారు నేను అనుమానంతో కిటికీ మీద కొడుతూ ఎవరైనా ఉన్నారా అని అడిగాను కానీ సమాధానం లేదు దాంతో ఉన్నవారిని ఏమైనా చేస్తారేమోనని నా భర్త దగ్గర ఉన్న సుత్తితో కిటికీలు పగలగొట్టి లోపలికి వచ్చాను.

మీరు సృహ తప్పి ఉన్నారు శ్వాస ఆడుతుంది మిమ్మల్ని  మీ బాక్సులని బయటకు తీసుకొచ్చి అతి కష్టం మీద మిమల్ని మీ పెట్టలని మా ఇంటి లోకి చేర్చాం నా భర్త మిమ్మల్ని తన సైకిల్ మీద అ ఇంటికి తీసుకు వచ్చారు అదిగో సార్ మీ పెట్టెలు అంటూ మంచం కింద ఉన్న పెట్టెలను చూపించింది ఒక వ్యక్తి అతని భార్య ఎంతో కష్టపడి నన్ను కాపాడారు అనే కృతజ్ఞత నా మనసంతా నిండిపోయింది రాకపోయి ఉంటే ఉంటే నా పరిస్థితి ఏమిటి, గాలి లేక నేను అందులోనే చనిపోయి ఉంటే నా కుటుంబం రోడ్డున పడి ఉండేది కదా ఈ ఆలోచనలతో వారి దగ్గర సెలవు తీసుకున్న నేను తెల్లవారి ఆమె తమ్ముడు సహాయంతో ఊరికి వెళ్లి నా బాధ్యత తీర్చుకున్నాను.

**********

రెండు నెలల తర్వాత నా ప్రాణాలు కాపాడిన వారికి నాకు తోచిన సహాయం చేద్దామని ఆ ఊరికి వెళ్లాను నా స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళాక తెలిసింది అసలు నిజం నేను వెళ్లిపోయిన తర్వాత రోజు గొడవల్లో వారి ఇల్లు మొత్తం తగలబడి పోయిందని అందులో వారు సజీవ సమాధి అయ్యారు అని తెలిసి బాధతో గుండెలు బరువెక్కాయి అక్కడికి వెళ్లి నాకు శిధిలమైన గుడిసె ఆనవాలు కూడా కనిపించలేదు ఒకానొక రాత్రి నా ఆకలి తీర్చిన ఇల్లు నా ప్రాణాలు కాపాడి నాకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు ఇప్పుడు కాలుతున్న కాష్టం లా  కనిపించింది నేను వెనుదిరిగిన నా జీవితాంతం వారికి రుణపడి ఉంటా నాకు సహాయం చేసిన అందువల్లే వారిని సజీవ సమాధి చేశారన్న నిజాన్ని ఎప్పటికీ మర్చిపోను ఎవరో తెలియని వ్యక్తి కోసం వారి ప్రాణాలు కోల్పోయారు అలాంటి వారు నా దృష్టిలో దేవతలుగా మిగిలిపోయారు…..

 

 

Related Posts

2 Comments

  1. కధ బాగుంది. తెలియని వారికి కూడా సాయం చేసే వారు ధన్యులు

Comments are closed.