దేవి అభయం

 

దేవి ఒక అందమైన అమ్మాయి తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు ఆమె తర్వాత  ఒక తమ్ముడు. పేద కుటుంబం పరువు మర్యాదలున్న కుటుంబం తండ్రి వ్యవసాయ కూలి.తల్లి ఇంట్లోనే చిన్న కిరణా షాప్ నడిపిస్తూ ఉంది.పట్టణానికి కాస్త దూరం లో ఉన్న పల్లె అది దేవి తల్లి సామనుకు వెళ్ళినప్పుడల్లా షాప్ లో కూర్చునేది.ఉన్న ఊర్లో పదో తరగతి వరకు చదువుకుంది ఆపైన ఇక చదివించే స్తోమత లేక పోవడం తో ఆమె ఇంట్లోనే ఉండసాగింది.దేవి స్కూల్ కి వెళ్ళి వస్తున్నాప్పుడు ఆ ఊర్లో బైక్ రిపేరు షాప్ పెట్టుకున్న రాజు తో పరిచయం పెరిగి అది ప్రేమ గా మారింది 

అది యవ్వనం వస్తున్న సమయం కాబట్టి ముందు రాజు కూడా ఆకర్షణ అని అనుకున్నాడు కానీ దేవి చదువు అయిపోయి ఇంట్లో ఉంటున్నాప్పుడు కనిపించనప్పుడు అతనికి అర్ధం అయ్యింది తనది ఆకర్షణ కాదని ప్రేమని.రాజు పదో తరగతి ఆ ఊర్లోనే చదవి బైక్ రిపేరింగ్ నేర్చుకుని .అటూ వ్యవసాయం కూడా చేస్తూ ఉండేవాడు.అతనిది బాగా కష్ట పడే మనస్తత్వం.ఏదైనా చుసిన వెంటనే నేర్చుకునే ఏక సంథా గ్రహీ నలుగురు అన్నదముల్లో ఆఖరి వాడు అయినా రాజు జులాయి గా తిరగకుండా బాధ్యతగా ఉండే వాడు.అవన్నీ దేవి కి బాగా నచ్చాయి చదివింది పదో తరగతే అయినా ఆమెకి తెలివి తేటలు బాగా అబ్బాయి. 

రాజు దేవి కళ్ళకు ఒక హీరోలా కనిపించాడు ఆమె కళ్ళకి అతన్ని ప్రాణానికి అంటే ఎక్కువగా ప్రేమించింది వారి ప్రేమ మూడేళ్ళు సాగింది. కేవలం చూసుకోవడం ఉత్తరాల్లో రాసుకోవడం.చూడకుండా ఉండలేక పోవడం వారి ప్రేమ ఇలా సాగుతున్నది.ఇలా ఇంకా ఎన్నేళ్ళు సాగేదో దేవి తండ్రి వారిని చూడక పోయి ఉంటె.కానీ ఒక రోజు   ఆమె తండ్రికి ఉత్తారాలు దొరికాయి తనకొచ్చిన చదువుతో అవి చదివాడు దేవి తండ్రి కృష్ణ అవి చదివిన ఏ తండ్రి అయిన ఎలా స్పందిస్తాడో అలా స్పందించి కోపం లో ఆవేశం లో కూతుర్ని నాలుగు దెబ్బలు వేసి .ఇంట్లో నుండి బయటకు రాకుండా కట్టడి చేసాడు. 

భార్యని కూడా కొప్పడి.పిల్లని ఆ మాత్రం చూసుకోవా అని తనని కూడా నాలుగు దెబ్బలు వేసి.దేవితో పేరుకే పేద వాళ్ళం.కానీ పరువుకు కాదని చెప్పి.ఒకవేళ నీకు వాడె కావాలి అంటే వెళ్లిపోవచ్చు అని కూడా చెప్పాడు కానీ తర్వాత నువ్వు మా గడప తోక్కొద్దు.నువ్వు చనిపోయావు అని అనుకుంటాం అని చాలా ఆవేశంగా చెప్పి.వెళ్ళిపోయాడు కృష్ణ.దేవి సంకట స్థితి లో పడింది .అటూ ప్రేమించిన వాడా.ఇటూ కన్నవారా ఏది తేల్చుకోలేని పరిస్థితి లో

ఒక అర్ద రాత్రి పిల్లిలా తన కోసం తెగించి వచ్చిన రాజే ముఖ్యం అనుకుని జీవితాంతం అతనితో కలిసి జీవించాలనే ఆశ తో.నిండునూరేళ్ళ జీవితాన్ని అతనితో పంచుకోవాలనే కోరికతో.కష్టమైనా.సుఖమైనా అతనితోనే అని స్థిరమైన నిర్ణయం తీసుకోని అతని చేయి అందుకొని ఇంటిలో నుండి కాలు బయట పెట్టింది దేవి.

అప్పటికే స్నేహితుల సహాయంతో అన్ని సిద్దం చేసుకున్న రాజు తెల్లారి వారి సమక్షం లోనే పెళ్లి చేసుకుని ఒకింటి వారు అయ్యారు.రాజు తనకోసం చేసిన ఏర్పాట్లకు మురిసి పొయింది దేవి.అలా వారి పెళ్లి కాపురం పట్నంలో మొదలైంది.దేవి చేసిన పనికి తండ్రి ఏమి అనలేదు కానీ తనకి ఇక ఒకేకొడుకు అని అన్నాడు భార్యతో.తల్లిదండ్రులు దూరమైనా బాధ పడి.కోరుకున్నవాడిని కట్టుకున్నoదుకు సంతృప్తిపడింది.

రాజు ఇంట్లోకూడా అదేపరిస్థితి కావడంతో ఎవరి అండా.ఆదరణ లేకున్నా స్నేహితుల సహకారం తో పట్నంలో చిన్నగా బైక్ రిపేరు షాప్ పెట్టాడు.కొత్త కాపురం సంతోషంగా.ఆనందంగా సాగుతుంది.అలా కాలగర్భంలో అయిదేళ్ళు గడిచిపోయాయి.దేవి ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది.దేవి తండ్రి చనిపోయాడు గుండెపోటుతో.ఉన్నఒక్కతల్లి దేవిని దగ్గరకు తీసినా తమ్ముడు మరదలు మాయలో పడి అక్కని పట్టించుకోలేదు.

దాంతో ఇక పుట్టింటికి రాకూడదు అని అనుకుంది దేవి.రాజు బైక్ రిపేరు నుండి రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి మారాడు దేవి జీవితం కూడా ఒక గాడిలో పడింది ఈ బిజినెస్ వల్ల కష్టాలు తొలగి పోయాయి అని అనుకుంటున్న సమయంలో రాజు తాగుడుకు.స్నేహితుల బలవంతమో.లేదా అతని బలహినతో కానీ దాంతో పాటూ అమ్మాయిల అలవాటు కూడా అయింది.

తాగి వస్తున్న భర్తను బతిమాలి.బామాలి దేవి తాగుడును మాన్పించింది.కానీ రాజు అమ్మాయిల బలహినతని మాత్రం మార్చలేక పొయింది.పిల్లలకు ఒక సారి తీపిని అలవాటు చేస్తే ఎలా మానరో రాజు కూడా ప్రేమించిపెళ్లి చేసుకున్న భార్యను అగ్ని సాక్షిగా తాళి కట్టి అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకున్న దేవిని వదిలి ఒక చిలకమ్మని పట్టుకుని ఆమెతో సహజీవనం చేయసాగాడు ఇద్దరు పిల్లల తల్లి అయిన దేవి లో లేనిదీ ఆ జాణలో ఉన్నది ఎదో రాజుకు నచ్చిoదో కానీ దేవి ని నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు.

కొన్ని రోజుల వరకు దేవికి ఏమి తెలియలేదు కానీ రాత్రుళ్ళు కూడా రాకపోవడం అతను అంటే గిట్టని వారో.దేవికి మంచి చేయాలనీ అనుకున్న వారో దేవి చెవి లో వేసారు యా విషయాన్నీ వినగానే దేవి నమ్మలేక పొయింది.తన భర్త తనని మోసం చేయడు అని తానంటే చాలా ప్రేమ అని చెప్పిన వారితో వాదించింది అయ్యో పిచ్చితల్లి ఇంకా ఎక్కడఉన్నావు ఒకసారి నీకళ్ళతో చూడు.

నీ అనుకున్న నీ భర్త.నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు.నువ్వు వాడిని నమ్మినంత కాలం వాడు ఇలా నిన్ను ముంచేస్తునే ఉంటాడు.రా నీకు చూపిస్తా నీ కళ్ళతో చూస్తేనే నువ్వు నమ్ముతావు అని తీసుకుని వెళ్ళి మరి చూపించారు వాళ్ళు.అది చూసి దేవి గుండె పగిలింది.

తన భర్త అలా ఇంకొకరి తో ఉంటాడని కల్లో కూడా ఉహించలేదు.ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు నట్టేట్లో ముంచుతాడని అనుకోలేదు.దేవికి ఏం చేయాలో అర్ధం కాలేదు అయోమయంగా చూసింది శ్రేయోభిలాషి వైపు.వాళ్ళు మీ అత్తా మామలకు చెప్పి చూడమని సలహా ఇచ్చారు.

ఇంటికి తిరిగి వచ్చిన దేవి ఇద్దరు చిన్న పిలల్లని పట్టుకుని బోరుమంటూ ఏడ్చి.కర్తవ్యం గుర్తొచ్చి.అత్తమామల దగ్గరికి పరుగెత్తుకుని వెళ్ళి విషయం చెప్పింది దాంతో వారు కోడలు.మనుమళ్ళ మొహాలు చూసి.జాలిపడి వచ్చి రాజుని నిలదియ్యడం తో రాజు ఇక నుండి బాగానే ఉంటాను అవ్వన్నీ ఏమి లేవని వారికీ నచ్చ చెప్పి తన భార్య తనని అపార్దం చేసుకుందని వారిని నమ్మించాడు అది నమ్మి వాళ్ళు మీరు ఇక ముందు మంచిగా ఉండండి అని చెప్పి వెళ్ళి పోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత రాజుకు దేవి మిద విపరీతమైన కోపం వచ్చింది

 ఇన్నాళ్ళు తన వారి ముందు తన పరువు మర్యాదలు దక్కించుకుంటూ వస్తున్న తన పరువుని వారి ముందు తీసిందని.తన బలహీనతలను వారికీ చెప్పిందనే కోపంలో దేవిని బాగాకొట్టి.ఇక నుండి నేను దాని ఇంట్లోనే ఉంటాను .నీకు ఇష్టమున్న చోట చెప్పుకో.లేదా నా ఇంట్లో నుండి వెళ్ళిపో.నా పరువును తీసిన నువ్వు ఉన్నా లేకున్నా ఒకటే అని బయటకు వెళ్ళగొట్టాడు.భర్త ఇంకో ఆడదానితో ఉంటె ఉన్న పరువు ఏంటో అది వద్దు అన్నందుకు తను తీసేసిన పరువెంటో తెలియని దేవి ముందు బిత్తర పోయి.ఆ తర్వాత పిల్లలని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియక.ఒక వేళ వెళ్ళినా ఎక్కడికని వెళ్తుంది.ఎవరు రానిస్తారు.తల్లి ఒక్కతే.తమ్ముడు మరదలు మాట వింటాడు.ఇద్దరు పిల్లలను నన్ను ఎవరు సాకుతారు.మాకు తిండి.బట్ట.రేపు పిల్ల పెద్దది అయితే దాని ముద్దు ముచ్చట్లు.చదువు సంధ్యలు.ఆ తర్వాత పెళ్లి ఎవరు చేసుకుంటారు

మొగడు వదిలేసిన నా పిల్లను ఎవరు పెళ్లి చేసుకోరు.ఇప్పుడు వెళ్ళి పొమ్మని అంటే ఎక్కడికని పోతుంది అత్తగారింటికి వెళ్ళినా అక్కడ తగిన గౌరవం ఉంటుందో లేదో.తనని ఆదరిస్తారో లేదో అనే లక్ష ఆలోచనలు చేసిన దేవి ఇక ఆలోచించలేక.భర్తని వదిలి ఉండలేక రాజుని బతిమాలింది వద్దండి మీరు లేకుండా నేనెక్కడికి వెళ్ళాలి.మీరు కాదంటే నేనేమైపోవాలి అంటూ పిల్లల మొహం అయినా చూడామని అంది.

పిల్లలు అనేసరికి రాజు  కాస్త మెత్తబడి  నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అంటే నా గురించి ఏమి అడగొద్దు.ఎవరికీ చెప్పొద్దూ నేనునీకు సామాను తెచ్చి ఇస్తా.వండుకుని తిను.పిల్లలని చూసుకో కానీ నా నుండి ఇంకేం ఆశించకు అని గట్టిగా వార్నింగు లాంటిది ఇచ్చాడు.అతను మాత్రం ఆ చిలకమ్మ ఇంట్లో కాపురం పెట్టాడు ఇల్లు వాకిలి పిల్లలను భార్యను వదిలి చిలక దగ్గర సెటిల్ అయ్యాడు.

బంగారు గుడ్లు పెట్టె బాతు రాజుని ఆ చిలకమ్మా చాలా మర్యాదగా చూసేది. నువ్వే నా లోకం అని నువ్వే నా దేవుడివి అని కొలిచేది అతను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాబట్టి అతని దగ్గర డబ్బు కూడా ఎక్కువగానే ఉండేది.దాంతో అతను దేవికి పిల్లలకు కనీస అవసరాలకు కూడా ఇవ్వకుండా ఒక బియ్యం బస్తా మాత్రం తెచ్చి ఇచ్చేవాడు.కానీ పిల్లలకు.ఆమెకు.పిల్లలకు మాత్రం సరిపోయేవి కావు ఇంటి కిరాయి.పాలు.నీళ్ళు.పిల్లల బట్టలు.స్కూల్ లో వేయడం కరెంట్ బిల్లులకు కూడా సరిపోయేది కాదు.అయినా ఉన్నదాంట్లోనే సర్దుకుపోయేది దేవి.

రాజు ఇచ్చిన డబ్బు సరిపోకపోవడం తో చిన్నగా తనకున్న పరిజ్ఞానంతో షాప్ ఒకటి పెట్టాలని అనుకుంది.తన ఇంటి పక్కనున్న వారితోనే ఆలోచన చేసి. దైర్యం చేసి వారిని తోడూ తీసుకుని వెళ్ళి మార్వాడి షాప్ లో తనకున్నఒకే నగ అయిన  తాళిబొట్టును కుదువ పెట్టి.ఆ డబ్బుతో సామాను తెచ్చి పెట్టి.ఆ కలని లో ఉన్న వారందరి ఇంటికి వెళ్ళి తను షాప్ పెట్టిన సంగతి చెప్పి.వారిని తనషాప్ లోనే కోనాలని బతిమాలడంతో ఆమె మాటతిరు.మన్నన నచ్చి వాళ్ళుకొనడం మొదలు పెట్టారు..

కొద్ది రోజుల్లోనే ఆమె షాప్లో గిరాకి పెరిగి వ్యాపారం పుంజుకుంది..ఇది చూసిన రాజు ఏమి చప్పుడు చేయలేదు తనకు ఏమి సంభందం లేనట్టుగా వెళ్ళి పోయాడు.అతను ప్రొద్దున అంతా ఎక్కడున్నా రాత్రుళ్ళు అది రెండు మూడు గంటలకు ఇంటికి వచ్చేవాడు పిల్లల కోసం అది దేవి బతిమాలడంతో…

ఇక దేవి వ్యాపారం పుంజుకోవడం అటూ రాజు బిజినెస్ తగ్గడం తో ఆ చిలకమ్మ ఇంటికి రావొద్దు అని చెప్పింది రాజుకు ఈచిలకమ్మనే కాకుండా చాలా చిలకలని లైన్లో పెట్టాడు.వాళ్ళంతా అతను డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నప్పుడు వారంతా అతనే లోకం అన్నట్టుగా ప్రవర్తించారు.ఇప్పుడు బిజినెస్ పడిపోయి.డబ్బులేనప్పుడు ఆ చిలకలన్ని  అతన్ని దగ్గరికి కూడా రానివ్వలేకపోవడంతో రాజు దినికంతటికి కారణం దేవేనని భావించి. బాగా తాగి వచ్చి దేవిని కొట్టి ఇంట్లో ఉన్న డబ్బుని అంతా పట్టుకుని వెళ్ళి.తాను ఇన్ని రోజులు తన వారని భావించిన వారు కేవలం తన డబ్బు కోసమే తన మిద ప్రేమ నటించారని తెలిసి.వారి మిద కోపంతోనో.దేవి షాప్ పెట్టడం వల్లే తన బిజినెస్ తగ్గిపొయింది అనే అనుమానం తో విపరీతంగా తాగడం మొదలు పెట్టాడు.

డబ్బు అయ్యేంత వరకు తాగుతూనే ఉన్నాడు.అలా తాగి తాగి తూగుతూ బండి ఎక్కి ఇంటికి బయలు దేరిన రాజు బండి ని అడ్డదిడ్డంగా నడుపుతూ.మత్తు తలకి ఎక్కడంతో ఎదురుగ వస్తున్న లారిని తాకడంతో ఎగిరిపడడo.లారి కాళ్ళ మీదనుండి వెళ్ళడంతో కాళ్ళు రెండు నుజ్జునుజ్జు గా మారాయి.అది చూసిన కొందరు బతికి ఉన్న రాజునూ దగ్గరలోనే ఉన్న హాస్పిటల్ కి చేర్చారు.దేవికి విషయం తెల్సి గోల్లుమంటూ ఇద్దరు పిల్లలతో సహా వచ్చింది ఆసుపత్రికి వచ్చింది.డాక్టర్లు రాజు కాలుకు ఆపరేషన్ చెయ్యాలని దానికి డబ్బు కావాలని చెప్పారు.

అదివిన్న రాజు తనకు అంత శక్తి లేదని.తన దగ్గర డబ్బు లేదని అన్నాడు. కానీ దేవి మాత్రం సర్ ఎంత ఖర్చు అయిన నా భర్తకు కాళ్ళు బాగావ్వాలి మీరు ఆపరేషన్ చేయండి నేను రేపటి లోపు డబ్బుని తీసుకొస్తాను అని అంది ఆమె మాటల్లో నిజాయితి నమ్మకం చూసిన డాక్టర్లు ఆపరేషన్ చేస్తామని చెప్పారు.భర్తని సిస్టర్ ని చూసుకొమ్మని చెప్పి.ఇంటికి వెళ్తున్న దేవిని విచిత్రంగా .అపనమ్మకంగా చూస్తూ ఉండి పోయాడు రాజు.

ఇంటికి వెళ్ళిన దేవి ఇంకొక వ్యక్తికి తన షాప్ ని అమ్మేసింది.షాప్ పెట్టిన తర్వాత వచ్చిన లాభంతో చేయించుకున్న నగలను.ఆఖరికి కూతురి చెవి పోగులను.తన ముక్కు పుడకను కూడా అమ్మేసి.తెలిసిన వారి దగ్గర కొంత డబ్బుని అప్పుగా తీసుకుని.హాస్పిటల్ కి వెళ్ళింది అత్తగారికి చెప్పాలని ఉన్నా.వారి మాట రాజు వినకపోవడంతో తమని పట్టించుకోవడం మానేసారు వాళ్ళు.ఎవరికీ చెప్పినా ఏం లాభం లేదని తెలిసి ఆమె తన పిల్లలతో రాజు వద్దకు చేరుకునే సరికి అతన్ని ఆపరేషన్ చెయ్యడానికి తీసుకుని వెళ్తున్నారు.

దేవి రాజు దగ్గరిగా వెళ్ళి అతని చేతిని పట్టుకొని భయపడకండి.బాధ పడకండి.మీకు ఈ దేవి ఉన్నంత వరకు ఏ అపాయం.ప్రమాదం జరగదు.నా ప్రాణాలు ఉన్నంత వరకు మికే కష్టం రానివ్వను అని తన చేతులని పట్టుకుని దైర్యం చెప్తున్న భార్యని చూస్తూ తానూ ఇన్ని రోజులు దేవిని ఎలా నిర్లక్ష్యం చేసింది.ఎలాకొట్టింది.ఎంతలాహింసించింది.తనవారు ఎవరూ రాకపొయినా.తనని ఇంతలా అభిమానిస్తున్న తన భార్యని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినది గుర్తొచ్చి సిగ్గుతో తల దించుకున్నాడు.అది గమనించిన దేవి రాజు తల నిమురుతూ మీరేమి దిగులు చెందాల్సిన అవసరంలేదు.మీరు మంచిగా ఉండాలనే నేను కోరుకున్నా.మిమల్నిమనసా.వాచా.కర్మణ ప్రేమించి నమ్మి వచ్చిననేను అలాంటిది మీరొక తప్పు చేసారని దాన్ని సాకుగా తీసుకుంటా అని ఎలా అనుకున్నారు.

మిమల్ని పీడించే ఉద్దేశ్యం నాకు లేదు.ఎప్పుడైతే మీ చెయ్యి పట్టుకున్నానో అప్పుడే మిలో సగం అయ్యాను.భార్య భర్తల బందం అంటే కేవలం సుఖమే కాదు కష్టసుఖాలలో తోడూ నీడగా ఉండేది.ఒకరి కాల్లో ముల్లు దిగితే ఇంకకరు ఆ నొప్పిని భరించేది కాబట్టి మీరింకా ఏ అనుమానాలు పెట్టుకోకండి అంటూ అతని చేతిలో చెయ్యివేసి నొక్కింది అభిమానంగా..తానే లోకంగా.తానే ప్రపంచంగా బతికే భార్య తనకు దొరికినందుకు.ఇన్నాళ్ళు అది గుర్తంచని గుడ్డి వాడు అయిన తనని తానూ తిట్టుకుంటూ.తన దేవత తనకు అభయం ఇచ్చినట్టుగా భావించిన రాజు తృప్తిగా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాడు..                           

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts