దేశ పౌరుడిగా..ఓటు విలువ…నిరూపించుకో

అంశం:⁠- ఓటు విలువ
శీర్షిక:⁠- దేశ పౌరుడిగా నిరూపించుకో
          
     


                      ఎలక్షన్స్ కి డేట్ ఖరారు చేశారు. ఊరు ఊరంతా ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. మా పార్టీకి ఓటేయండి ఈ గుర్తుకే ఓటు వేయండి అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
ఎలక్షన్స్ టైం ఉంది. ప్రచారాలు గట్టిగా జరుగుతున్నాయి. ఎవరు ఎక్కడ తగ్గడం లేదు.
ఎలక్షన్స్ కి రెండు వారాల ముందు ఆ పార్టీకి ఓటేయండి అని ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున ఎన్ని ఓట్లు ఉంటే అన్ని వేలు ఇచ్చి మాకే ఓటు వేయండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు.
ఇలా డబ్బులు ఇచ్చి వాళ్ల ఓట్లు కొనుక్కొని ఓట్లు వేయించుకోవడం గెలవడం ప్రజల్ని మర్చిపోవడం కానీ ఒకటి మాత్రం నిజం ఓటుకు ఉన్న విలువ నోటు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు.
అలాగే బాలకృష్ణ వాళ్ళ ఇంటికి కూడా ఒక పార్టీ వారు వచ్చి నాలుగు ఓట్లు నాలుగు వేలు ఇచ్చి వెళ్లిపోయారు.
మరొక పార్టీ వాళ్ళు వచ్చి 4000 తీసుకుంటుండగా నవీన అది చూసి ,
“ఏంటిది! అంకుల్ మీ పార్టీకి ఓట్లు ఎక్కువ రావాలి అని మా ఓటుని మీరు నోటుతో కొనేసుకుంటున్నారు. అలాగైతే ఓటుకున్న విలువ పోతుంది కదా అంకుల్.
భవిష్యత్తులో కూడా ఓటుకి విలువ ఇవ్వరు ఓటుకి నోటు ఇవ్వాలి అంటారు. నిజాయితీపరులు ఎవరో తెలుసుకొని వాళ్లకి మేము ఓటు వేస్తాం మీ డబ్బులు మాకు ఏమి అక్కర్లేదు అని తెగేసి చెప్పి పంపించింది.
ఏంటి నాన్న మీరు కూడానా చదువుకున్న వారే కదా చదువులేని వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే అర్థం ఉంది. ఇప్పటికైనా తెలుసుకోండి” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.
బాలకృష్ణ , నవీన చెప్పిన దాన్ని గురించి ఆలోచించి తను చేస్తుంది తప్పు అని అర్థం అయింది.
ఇది ఒక్క బాలకృష్ణ వాళ్ళ ఇంట్లోనే కాదు,
అందరి ఇంట్లోనూ ఇలాగే జరుగుతుంది కానీ ఇది తప్పు అని ఒక్కరు చెప్పట్లేదు అదే చేస్తున్న అదే చేస్తున్న మనం తప్పు అది తెలుసుకుంటే ఓటుకి విలువ ఉంటుంది.
ఓటు విలువ తెలుసుకొని ఒక నిజాయితీపరుడికి ఓటు వేసి ఒక దేశ పౌరుడిగా నిరూపించుకో..
అది నీకు నువ్వు వేసిన ఓటుకు విలువ.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                     ఈ కథ నా సొంతమని హామీ ఇస్తున్నాను..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *