చెదిరిపోనీ మా స్నేహం

దోస్తులం మేము (కవిత)

దోస్తులం మేము (కవిత)

దోస్తులం మేము చెట్టు మీద కోతులం
మేము ఆడుతాం పాడుతాం కొట్టుకుంటాం
తిట్టుకుంటాం కలిసిపోతాం అలసిపోతాం
దోస్తులం మేము చెట్టు మీద కోతులం
మేము ఆటల్లో పాటల్లో ముందుంటాం
ఒకరికి ఒకరై సాగిపోతాం మేము
సమస్యలు వస్తే సర్ది చెప్పుకుంటాం
గొడవలు వస్తే మేము ఒకటై పోతాం
పిట్టగోడలే మా కబుర్లకు నిలయం
మొదటి రోజ సినిమాకు పోతాం
ఒక్క సిగరెట్ నీ ముగ్గురం షేర్ చేసుకుంటాం
ఒక్క బీర్ నీ కలిసే తాగుతాం
దోస్తులం మేము చెట్టు మీద కోతులం
అమ్మాయిలను బనాయిస్తాం
వాళ్ళు తిడుతుంటే ముసి ముసి నవ్వులు నవ్వుతాం
మా దోస్తు ప్రేమించిన అమ్మాయి కోసం కొట్లాడతాము
దోస్తులం మేము చెట్టు మీద కోతులం
కాలేజ్ లో క్లాసులు ఎగ్గోడతం
సినిమా పోస్టర్లు అత్తికిస్తాం
ఇష్టమైన హీరోలకు పాలాభిషేకాలు చేస్తాం
డబ్బులు లేకుంటే ఒక్క చాయ్ షేర్ చేసుకుంటాం
దోస్తులం మేము చెట్టు మీద కోతులం

భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *