ధైర్యం

 

రోడ్డు మిద ట్రాఫీక్ చాలా ఎక్కువగా ఉంది.అందరూ ఆఫీస్ కి వెళ్ళాలి. అన్న తొందరలో ఉన్నారు.నేను కూడా లేట్ అవుతుంది అనే ఉద్దేశ్యం  తో నా బైక్ హరన్ కొడుతున్నా విసుగ్గాఅక్కడ తొందరగా వెళ్ళకపోతే లేట్ మార్క్ పడి జీతం లోంచి వంద రూపాయలు కట్ అవుతాయి.అందుకే తొందరగా వెళ్ళాలి అని ఎంత ముందుగా బయలు దేరినా కూడా ఇదిగో ఇలాగె లేట్ అవుతుంది.చాలా చిరాగ్గా ఉంటుoదిఈ హైదరాబాద్ లో ఇంత మంది ఎందుకు ఉన్నారోఎక్కడెక్కడి నుండి వచ్చారోపాపం వాళ్ళు మాత్రం ఇంట్లో గడవక పొట్ట చేత పట్టుకుని ఇక్కడ కంపెనీల లో పని చేసుకోవడానికి వచ్చి ఉంటారు.

ఇలా ఆలోచనలో పడిన నేను నా ముందు కార్ వెళ్ళిన సంగతి గుర్తించనే లేదునా బండి స్టార్టింగ్ లోనే ఉంది వెనక ఉన్న వ్యాన్ అతను నా ముందు ఖాళి అయినా నేను కదలక పోవడం వల్ల నా బండిని వాడి బండి తో గట్టిగా  డాష్ ఇచ్చాడు.

ఆ డాష్ కి నేను నా బండి తో పాటుగా ముందుకు ఉరికాను. అప్పుడే ఎడమ వైపున ఉన్న బస్ ముందుకు రావడం తో బస్ టైర్ నా ఎడమచేతి మిద నుండి వెళ్ళింది.ఇది అనుకోని ఒక సంఘటన ఇలా జరుగుతుంది అని అసలు అనుకోలేదు ప్రొద్దున  లేచినప్పుడు కూడా నా ఈ రోజు అంతా మంచిగా ఉండాలి అని అనుకునే లేచాను మరెంటో ఇలా జరిగింది.నాకు డాష్ ఇవ్వగానే అ వ్యాన్ అతను వ్యాన్ దిగి పరుగెత్తడం ఒక్కటే చూసాను నేను అన్ని ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి బస్ లు బైక్ లు చిన్న ఆటో లు కారులు అన్ని ఆగిపోయి ట్రాఫీక్ స్తoభించింది.

ఇలా ఎవరికైనా జరిగితే షాక్ తోనోలేదా భయం తోనే వాళ్ళు సృహ తప్పడమోలేదా షాక్ కి ప్రాణాలే పోవడమో జరుగుతుందికానీ మనది మొండి ప్రాణం కదానాకు కనీసం సృహ కూడా తప్పలేదుకాదు నేను అలా తప్పకుండ ఈ ఆలోచనలు చేస్తున్నా అని అనుకోవచ్చుట్రాఫ్ఫిక్ ఆగిపోయినందుకుమిగతా వాళ్ళుఆఫీస్ లకు లేట్ అవుతుంది అని అనుకున్నవాళ్ళుఈయాక్సిడెంటునినన్నువ్యాన్డ్రైవరునిఎంతగాతిట్టుకుoటున్నారోకదాఅని అనిపించింది.ఎందుకంటే చాలా సార్లు నేను అలా తిట్టుకున్న వాణ్ణీ కాబట్టి.

లేట్ గా వెళ్తే వంద రూపాయలు కట్ అవుతాయి  అని అనుకున్నా కానీ ఈ రోజు ఇలా జరిగిందిఅలా అని రోజు లేట్ గా వెళ్తే రోజు వంద రూపాయలు కట్ అవుతుంటేఇక బతకడం ఎలామరి మిగత వాళ్ళు అంటే ఇలా ఇప్పుడు నా గురించి ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి.?నన్నునా భార్య పిల్లలని ఇంకా మా అమ్మని మా అమ్మ అమ్మ ని కూడా తిట్టుకుంటూ ఉంటారు కావచ్చుఅలా తిట్టుకుంటూ ఉంటె హమ్మో వాళ్ళ తిట్లు వింటూ నేను ఉండగలనా లేదు ఉండలేను అని అనుకుంటూ ఉండగా ఉన్నాడా పోయాడా అనే మాటలు వినిపించాయి నాకు. ఆ మాటలు వినడం తోనే నేను ఆలోచనలోంచి బయటకు వచ్చిఅవును నేను ఉన్నానా పోయానా అని నాకు నేనే ప్రశ్నించుకున్నా ఓసారినాలో నేను మధన పడడం మొదలయ్యింది.

అవును నేను ఇలా అర్ధంతరంగా చనిపోతే నా భార్యపిల్లలు నా తల్లి వీరందరినీ ఎవరూ చూసుకుంటారుపాపం మా అమ్మ తనకు మైసూర్ పాక్ తెమ్మని అంది.నా భార్య సాయంత్రం నేను మల్లె పువ్వులు తెస్తాను అని ఎదురు చూస్తూ ఉంటుంది.నా ఇద్దరూ పిల్లలు నేను తెచ్చే చాక్లెట్స్ కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు.పాపం వీళ్ళు నేను తెచ్చే జీతం డబ్బుల మీదనే ఆధార పడి ఉన్నారు.

ఎప్పుడో తాత ల కాలం నాటి పెంకుటిల్లు లో ఉంటున్నాము మేము.చాలా మంది అలా హైదరాబాద్ లో స్వంత ఇల్లు ఉందని మా ఆఫీస్ లో అందరి ఏడుపు చూపు నా వయిపే ఉంటుంది. ఈ అంబులెన్సు రావడానికి చాలా సమయం పడుతుంది బాడీ ని పక్కకు జరిపి వెళ్ళిపోదాం అని అంటున్నారు ఎవరో నాకు మళ్ళి అయ్యో నేను ఇక్కడే ఉన్నా కదా ఏవేవో ఆలోచనలు చేస్తున్నా వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటూ ఒక్కసారిగా నా అవయవాలు అన్ని నా స్వాధీనంలోకి తెచ్చుకుని గబుక్కున లేచి కూర్చున్నా నేను లేవడం చూసి చుట్టుపక్కన ఉన్నా వాళ్ళు అందరూ భయం తో పరుగులు తీసారు.

అయ్యో పాపం జనాలు ఎందుకు భయపడుతున్నారో నాకు యక్సిడేoటు జరిగిన ఇంత సేపటికి నేను అలా లేవడం చూసి భయపడినట్లు ఉన్నారు అందుకే పారిపోతున్నారు అని నాలో నేనే నవ్వుకుని లేచి చుట్టూ చూసాను నా ఎడమ చెయ్యి సగం వరకు తెగిపోయి కొంచం దూరం లో పడి ఉంది.రక్త కారి కారి గడ్డ కట్టింది.అమ్మో ఎడమ చెయ్యి లేకుంటే ఎలా అనే ఆలోచన తో నేను  మెల్లిగా లేచి వెళ్ళి నా ఎడమచేయిని పట్టుకుని చుట్టూ చూసాను చుట్టుపక్కల ఉన్న జనాలు చాలా వరకు వెళ్ళిపోయారు.

ఉన్న కొందరు కూడా నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు.నేను చచ్చిదయ్యం అయ్యాను అని అనుకుంటున్నారేమో సరే నేను నా జేబులో ఉన్న పర్సు ని చూసుకున్నా అందులో నా బ్యాంకు డెబిట్ కార్డులు అవి అన్ని ఉన్నాయి.వాటన్నిటిని సరి చూసుకుని అక్కడ నుండి వెళ్తున్న ఒక ఆటోని ఆపాను.

వాడు నన్ను భయంగా చూసాడు తమ్మి నా చేయి విరిగింది జల్ది దావాఖనకు తోల్కపో అని వంద నోటు చేతిలో పెట్టా జేబులో నుండి తీసి పక్కనే ఉన్న ఆసుపత్రికి వంద అని అనగానే మొఖం వెలిగిపోయి బండి స్టార్ట్ చేసాడు అతను ఆసుపత్రిలోకి వెళ్ళగానే పాపం డాక్టర్ ని పిలిచి నన్ను చూపించాడు వాళ్ళు నా చేతిలో ఉన్న చెయ్యిని నన్ను చూసి కేసు పోలీసులు అని అనకుండా అపరెషన్ దియేటర్ లోకి తీసుకుని వెళ్ళారు.

రెండు గంటల తర్వాత విజయవంతంగా నా చేతిని అతికించిన డాక్టర్ లు నా ఫోన్ తీసుకుని మా వాళ్ళకు సమాచారం ఇచ్చారు వాళ్ళు ఏడుస్తూ వచ్చారు కానీ వాళ్ళకు డాక్టర్ నా గురించి చెప్తూ అతనికి  దైర్యం బతకాలన్నా కోరిక ఉండబట్టి ఇంతా వరకు రాగలిగాడు.మీరు ఏడ్చి అతని దైర్యన్ని చంపవద్దు అతన్ని అదైర్య పరచకండి అతనికి కావాలంటే దైర్యాన్ని నూరి పోయండి  అని నా దైర్యాన్ని మెచ్చుకున్నారు.మిరే చెప్పండి వంద రూపాయల కోసం చూసే నేను దైర్యవంతున్నా…..     

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts