ధ్యేయం

 

ఒసేయ్ నీకేమైనా బుద్దుందా అసలే అంతంత మాత్రం ఉన్న కుటుంబం మనది. నువ్వు కాక ఇంకా నలుగురూ ఉన్నారు ఎదిగొచ్చిన్న పిల్లలు. మీ నాన్న సంపాదన ఏంతో తెలిసి, అద్దె ఇల్లు అని మర్చిపోయి, ఈ చిన్న గదిలోనే ఆరుగురం మగ్గుతున్నామని మర్చిపోయి ఏడ్చినట్టు ఏడవ వాడిని తెస్తావా నీకు అసలు తెలివి ఉండే చేశావా ఈ పని ఏదైనా దయ్యం పట్టిందా నీకు అసలే అన్నమో రామచంద్రా అనే స్థితిలో ఉంటే గంజి అయినా కడుపునిండా తినలేని మనం ఇంకొకరితో గంజిని పంచుకోమని తెచ్చావా ఉన్నదేదో తిని కాళ్ళు కడుపులో పెట్టుకుని ముడుచుకు పడుకుంటున్నాము.

అయినా నేను మొత్తుకుంటూనే ఉన్నాను పట్టి లేనట్టు ఎలా వెళ్తుందో అసలు నా మాటలు వినిపిస్తున్నాయా నీకు వద్దు వాడిని ఎక్కడున్నా తెచ్చావో అక్కడికే పంపించు నువ్వు ఇప్పుడు చేసే పనులు ఏమీ లేవులే ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టావా  ఏంటి  తీసుకెళ్ళే వాణ్ని ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పు ఇంతగా అరుస్తున్నా నా మాటలు నీకు వినిపించడం లేదా అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే తల్లికి అబ్బా అమ్మ ప్లీజ్ నేను చెప్పేది విను నువ్వు అన్నది నిజమే మనకు తినడానికి తిండి లేదు ఉన్న ఇల్లు అద్దె ఇల్లు అని తెలుసు నాన్న జీతం బెత్తెడు అని తెలుసు ఆరుగురం ఇంట్లో ఉన్నావని తెలుసు.

అన్నీ తెలిసే నేను వాడిని తెచ్చాను ఏమవుతుందో అమ్మ తెస్తే వాడు మనతో పాటు కలో గంజో తింటాడు ఇక్కడే ఉంటాడు ఇంట్లోకి నీకు సహాయం చేస్తాడు నేను ఉద్యోగంలో చేరి పోతున్నాను నా డిగ్రీ అయిందిగా చదువులు చదవకుండా ఇక్కడ చిన్న స్కూల్లో చూసుకున్నా, ప్రొద్దుట స్కూలుకు వెళ్లి వచ్చి రాత్రులు చదువుకుంటాను సరేనా వాడికి ఇంత అన్నం పెడితే చాలు వాడు ఓ మూలకు పడి ఉంటాడు అంటున్న కూతుర్ని విచిత్రంగా చూస్తూ ఉండిపోయింది శారద. తన కూతురేనా ఇలా మాట్లాడేది నిన్న మొన్నటి వరకు నోట్లోంచి ఒక్క మాట కూడా రాకుండా ఉండి అలాగే తిరుగుతూ మూగ దానిలా కనిపించే సుష్మనే నా ఇన్ని మాటలు మాట్లాడుతుంది. .

ఇంతలో ఎంత మార్పు వచ్చింది పొద్దున ఏదో పని ఉందని స్నేహితురాల్ని కలవడానికి వెళ్లిన వస్తూ వస్తూ ఒక మూడేళ్ల బాబు ని ఇంటికి తీసుకు రావడం చూసి అడిగింది శారదదాంతో సుష్మా వాడు ఇక మనతోనే ఉంటాడు అని చెప్పేసరికి అతనికి చాలా కోపం వచ్చింది అసలే నలుగురు ఆడపిల్లలు అని దెప్పుతూ ఉంటాడు ఇప్పటికీ కూడా అలాంటిది ఈ నలుగురు ఇక వచ్చిపోయే బంధువులు స్నేహితులు అటు చూస్తే భర్త జీతం ఎందుకు సరిపోదు నాలుగు జాకెట్లు కుట్టి తానే సంపాదిస్తుంది

మిగిలిన అమ్మాయిలు స్కాలర్ షిప్పు తో చదువుకుంటున్నారు. సుష్మ మొన్ననే డిగ్రీ అయింది ఎంబీఏ చేయించాలని అనుకున్నాడు భర్త కానీ డబ్బు లేకపోవడంతో ఆ మాట అటకెక్కింది ఇక చేసేది లేక ఇంట్లోనే జాకెట్లు కుట్టడం నేర్చుకుంటుంది ఇలాంటి సమయంలో ఇంకొక ప్రాణిని అంటే మాటలు కాదు తిండి బట్ట చదువే కాదు లోపలి అవసరాలు ఇంకా చాలా ఉంటాయి

ఏదో ఒకటి కావాల్సి ఉంటుంది.సబ్బు దువ్వెనలు పౌడర్ లు కావాలి అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో కావాలి ఈరోజుల్లో ఒకరిని సాగడం అంటే ఇబ్బంది అదీగాక వారికి కడుపునిండా తిండి పెట్టాలి అంటే మనం ఒక పూట తిండి మానేయాలి ఇలా సాగుతున్నాయి శారద ఆలోచనలు అది కనిపెట్టిన సుష్మా దయచేసి ఎక్కువ ఆలోచించి ఆవేశం తెచ్చుకోకు వాడు ఇక్కడ ఉంటాడు మనతోనే బతుకుతాడు

కానీ వాడిని మాత్రం బయటకు పంపించాలని చూడకు ఎంత కష్టమైనా వాడిని మనమే ఉంచుకుందాం. నాన్నని ఒప్పించే బాధ్యత నీదే అంటున్న కూతుర్ని అనుమానంగా చూస్తూ ఏంటే అంత ఖచ్చితంగా అంటున్నావు ఏంటి కొంపదీసి ఏదైనా  అఘాయిత్యం చేసావా ఏంటి దాని ఫలితం ఇదేనా అసలు వాడెవడో చెప్పు ముందు వాడికి నీకు ఏంటి సంబంధం ఎందుకు ఇక్కడే ఉంచాలని పట్టుబడుతున్నారు

ఏంటి కథ అంటూ అడిగింది తల్లి. తల్లి మాటలు సుష్మాకు అర్థం అయి అంటే ఏంటమ్మా నేను కాలు జారాను అని అనుకుంటున్నావా దాని ఫలితమే వీడని నీవు అనుమాన పడుతున్నావా అమ్మ తల్లి కన్న తల్లివి నువ్వే నీ కూతుర్ని నమ్మకపోతే ఎలా నేను ఏమి తప్పు చేయలేదు నేను తప్పు చేయను నేను వాడి గురించి చెప్పాను అంటే అర్థం . తర్వాత చెప్తాను అని నువ్వు వేరే ఏదో అనుకోకు అయినా చెప్తున్నా విను.నేను నా స్నేహితురాలు ఇంటి నుండి వస్తున్న సమయంలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది అక్కడికక్కడే అతను చనిపోయాడు. అతను బిచ్చగాడు కావచ్చు పాపం వీడు ఏడుస్తూ అక్కడ కనిపించే సరికి నాకు పాపం అనిపించి తీసుకొచ్చాను పైగా అక్కడే ఉంచేస్తే వేరే బిచ్చగాళ్ళు లేదా ఇంకెవరైనా వచ్చి తీసుకుని వెళ్ళేవారు తర్వాత వీడిని ఎవరికైనా అమ్మడమో లేకపోతే అవిటి వాడిని చేయడం చేస్తారు.

ఒకసారి వాడిని చూడు ఎంత ముద్దుగా ఉన్నాడు పాపం ఏ తల్లి కన్న బిడ్డనో తల్లిదండ్రులు లేని అనాధ గా వాడు అలా బ్రతకాలి అమ్మ మాకు ఎలాగ తమ్ముడు లేడు తమ్ముడు అనుకుంటాం అందుకేనమ్మ తెచ్చాను కానీ నేను ఏ తప్పు చేయలేదు అంటూ తల్లి గుండెల్లో దాచుకుంది ఇదంతా  ఏమీ తెలియని బాబు దిక్కులు చూస్తున్నాడు.అమ్మ సుష్మా నువ్వు ఏ తప్పు చేయలేదని తెలుసు కానీ వీడు ఎవరని అడిగితే ఏం చెప్పాలి చుట్టుప్రక్కల వాళ్ళు ఏదో అంటారు ఏదేదో ఊహించుకుంటారు అందర్నీ చులకనగా చూస్తారు రేపు కోసం ఎవరైనా వస్తే ఎలా తీశారు వచ్చిన వాడు నా బిడ్డ అని చెప్తాను

వేరే ఎక్కడో బతికాడు అని చెబుదాం లేదా మీ తమ్ముడు కొడుకు ని నీ తమ్ముడు చనిపోతే నీకు ఇచ్చి చనిపోయాడని చెబుదాం లేదా దత్తత తెచ్చుకున్నాం  అని చెప్పొచ్చు అది కూడా కాదు అనుకుంటే నేనే ఎవరినో ఉంచుకొని అనుకుంటే  దానికి కన్నాను అని అది చనిపోవడం వల్ల ఇక్కడికి తెచ్చానని చెప్తానులే ఎక్కువ ఆలోచించకు శారద అందివచ్చిన కొడుకు ఉంటే అదో తృప్తి నాకు ఎలాగో కానీ శక్తి లేకపోయింది ఇప్పుడు నా కూతురు తెచ్చిన ఈ పాపడిని ఎందుకు కాదనాలి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు ఇది ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియదు ఏది జరిగినా మన మంచికే  ఒక మనిషి ఎక్కువ అవుతాడు ఇంట్లో నేను ఎక్కువ సంపాదిస్తాను. నాతో పాటు నా కూతురు సంపాదిస్తుంది  వాడి కోసం.

ఇక లోకులు అంటావా నాలుగు రోజులు మాట్లాడుకుని మర్చిపోతారు కానీ మనతో ఉండరు కష్టమైనా సుఖమైన ఏదైనా మనమే అనుభవించాలి నా కూతురు జాలిగుండె ని చూసి నేను గర్వపడుతున్నా తన స్వార్థం ఏంటో అని చూసుకోకుండా ఒక పసివాడి గురించి ఆలోచించింది అంటే ఎంత మంచి పని ఆలోచించు నేను వారికి మంచి  తిండి ఇవ్వక పోవచ్చు బట్ట ఇవ్వకపోవచ్చు కానీ నాకు నా కూతురు గుణాలు గొప్పవి వారి ఆలోచనా విధానం గొప్పది అమ్మ నీ లాంటి మంచి కూతురు నాకు  ఉండడం చాలా ఆనందంగా ఉందమ్మా మనం ఎలా బతికామన్నది ముఖ్యం కాదు ఎవరికి ఎంత సహాయం చేశామన్నది ముఖ్యం చిన్నదానివే పెద్దగా ఆలోచించావు .

ఒక అనాధ కి తల్లిదండ్రులని ఇచ్చావు నువ్వు చాలా గొప్ప దానివి నువ్వు ఎవరికీ సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం లేదు తల్లి అంటూ గుండెలకు హత్తుకున్నాడు రఘురాం. తండ్రీ తన నిర్ణయాన్ని మెచ్చుకోవడం తనని సమర్థించడం చూసిన సుష్మా కళ్ళు ఆనందంతో మెరిసాయి ఇవేవీ తెలియని బాబు మాత్రం నవ్వుతున్నాడు తన  బోసి  నోటితో   …….

 

Related Posts