నగనగా ఒక ఊరిలో శ్రీదేవి అనే ఒక అమ్మాయి

కథాంశం :ఆరోగ్యమే మహాభాగ్యం
రచన :యడ్ల శ్రీనివాసరావు
ఊరు : విజయనగరం

నగనగా ఒక ఊరిలో శ్రీదేవి అనే ఒక అమ్మాయి ఉండేది.ఆ అమ్మాయి సినిమా యాక్టర్.అయితే ఆ అమ్మాయి నిరంతరం ఆరోగ్య జాగ్రత్తలు పాటించక సాగుతూ ఉండేది.ఒకరోజు తను క్రిస్టియన్ అయితే తను చర్చికి వెళితే చర్చి వద్ద పాస్టర్ పాల్ గారు శ్రీదేవి బాగున్నావా అని అడిగారు . దానికి శ్రీదేవి పాస్టర్ గారు నాకు తెల్ల మచ్చలు వస్తుందని ఎందుకో తెలియటం మరియు స్పర్శ జ్ఞానం లేదు అని పలికింది . దానికి పాస్టర్ గారు ప్రార్థన చేశారు .కానీ ప్రతిరోజు ప్రార్ధన అవుతున్నాయి కానీ మచ్చలు పోవడం లేదు. దానికి తాను వ్యతిరేకయ్యి ఒకరోజు సినిమా షూటింగ్ తీస్తూ ఉంటే ఆ షూటింగ్లో హీరో నీకు తెల్ల మచ్చలు ఉన్నాయి నీకు ఏమి జబ్బు ఏమో నీతో ఆక్ట్ చేయను అని హీరో రామ్ అన్నాడు.

దానికి శ్రీదేవి చాలా చిన్న పోయింది.మొఖం తెల్లబారింది.

వెంటనే శ్రీదేవి అమ్మ నాన్నతో చెప్పి రహస్యంగా ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నది. అక్కడ తనకు టెస్టుల్లో తేలింది ఏమంటే తనకు లేప్రోసి అనే వ్యాధి వచ్చిందని .అది ప్రారంభిస్తూ మొదలై ఇంకా ముదురుడం వరకు వస్తుందని తెలిసింది , వెంటనే ఏడ్చింది. దానికి డాక్టర్ ప్రవీణ్ గారు శ్రీదేవి నీకేం భయం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేకపోతే ఏంటి సాధించగలం కాబట్టి మేము ఇచ్చిన మందులు ఏం డి టి మల్టీ డ్రగ్ తెరపి డ్రగ్ ప్రతిరోజు వాడు, మందులు అయిపోగానే రా.అలాగా ఒక ఆరు నెలలు కంటిన్యూ చెయ్, ఇవి చేయగానే నీ ముఖం మీద ఉన్న మచ్చలు మొత్తం పోతాయి.స్పర్శ జ్ఞానం వస్తుంది. మీకు అంతా పరవాలేదు .అని చెప్పగానే తను తల్లిదండ్రులు చెప్పకుండా మందులు వాడడం మొదలుపెట్టింది ఇలా ఆరు నెలలు గడిచింది. దాంతో తన వద్దనున్న లెప్రసీ జబ్బు మొత్తం నయం అయిపోయింది. దానితో ఆరు నెలలు సినిమా షూటింగ్ల ఆపి మరలా జాయినింగ్ అయింది .హీరో రామ్ ఆ మచ్చలు లేకపోవడం చూసి అడిగాడు నేను ఊరు చివరన హాస్పిటల్ కి పెద్ద ఆసుపత్రికి వెళ్లి మందులు వాడడం వల్ల తగ్గిపోయింది. నాకు చెప్పు డాక్టర్ అయినా యాక్టర్ అయినా జబ్బు చెప్పి రాదు. అది వచ్చిందంటే మందులు వాడాల్సిందే , అని పనికింది . షూటింగ్ మొదలయ్యే ఆ రోజు నుంచి ప్రతిరోజు తనకు సందడే సందడి పండగే పండగ.

—————————————-
హామీ పత్రం
ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఈ కథ నా సొంత రచన
ఇట్లు
యడ్ల శ్రీనివాసరావు విజయనగరం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *