నయా లవ్

వచ్చే పోయే ప్రయాణికులతో హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ హడావుడిగా ఉంది. ఎక్కే వాళ్ళు, దిగే వాళ్ళు లగేజీలతో, చిన్న పిల్లలతోనూ రోజు డ్యూటీలకు వెళ్లే వారితోనూ హడావుడిగా కనిపించింది. నేను రోజూ చూసేదే అయినా ఈరోజు ఎందుకో ఇంకా ఎక్కువ కొత్తగా కనిపించింది. నా బస్సు రావడానికి ఇంకా సమయం ఉండటంతో నేను రోజు కూర్చునే కుర్చీలో కూర్చొడానికి వెళ్లాను.

కానీ నా స్థలంలో వేరే ఒక అమ్మాయి కూర్చుని ఉంది. సరేలే అమ్మాయి కదా పాపం కాళ్లు లాగుతున్నాయి ఏమో ఎంత సేపట్లో వెళ్తుందిలే అని అనుకున్నా, ఆమె ఎదురుగా ఉన్న ఇంకో కుర్చీలో కూర్చుని అందర్నీ గమనించడం మొదలు పెట్టాను. విచిత్రంగా ఉంది రోజు అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని చూడడం నాకు కనిపించే వారందరూ నా ఎదురుగా వస్తూ కనిపించేవారు నేనిప్పుడు వారి కథలను వారిని చూస్తూ ఉండేవాడిని. నా వెనుక ఏం జరుగుతుందో తెలిసేది కాదు. మన వీపు మనకు కనిపించనట్టుగానే, అయితే నేను కుర్చీ చుట్టూ చూస్తూ ఉండగా..

నా కుర్చీలో ( అది నేను ఇంటి నుండి తెచ్చుకోలేదుగా) కూర్చున్న అమ్మాయి తదేకంగా ఎవరినో చూడటం చూసి నేను వైపు చూశాను. ఎవరా అని అక్కడ ఒక నవయవ్వన యువకుడు నిలబడి పిల్ల వైపు దొంగ చూపులు చూస్తున్నాడు. ఆమె అతన్ని అతడు ఆమెని చూసుకోవడంతో నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇంత హడావిడిలో గందరగోళంలో వీరి చూపులు ఎలా కలిసాయో అని. అమ్మాయి వైపు చూసా పర్లేదు కనుముక్కు తీరు బాగానే ఉంది. చామనఛాయ అయినా కథ కోలముఖం, నొక్కుల జుట్టు, హైట్, పర్సనాలిటీ కూడా బాగానే ఉంది.

తిరిగి అబ్బాయి వైపు చూపు మరచాను నెమ్మదిగా. నేను చూస్తున్నానని పసిగడితే వారు భయపడే అవకాశం కనిపించడంతో పేపరు అడ్డుపెట్టుకుని వారిని గమనించసాగాను.. ఆమెకు ఎదురుగా ఉన్న అబ్బాయి కూడా చుట్టూ చూసుకుంటూ పిల్ల వైపు దొంగ చూపులు చూస్తూ క్రాపు సరి చేసుకుంటున్నాడు. చూపులు మార్చుకొని ఫోన్లో చూస్తూ నవ్వుతోంది. ఫోన్ చూడగానే అతని నెంబర్ కావాలి అన్నట్టు సైగ చేసాడు కానీ అమ్మాయి ఇవ్వలేను అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది.

చూసిన అతను కోపంగా మొహం పెట్టి ఆమె వైపు వీపు చేశాడు. ఆమె కొద్దిగా మెత్తబడినట్లుగా కనిపించింది రెండు నిమిషాలు కాకముందే మళ్లీ అబ్బాయి అమ్మాయి వైపు తిరిగి నవ్వాడు. ఆమె సారీ అన్నట్టుగా చూస్తోంది అతను తల ఎగరేశాడు. ఇంతలో నా పక్కన ఎవరో కూర్చోవడం నాకు పని లేకపోవడంతో ఆపేశాను వ్యక్తి హి హి హెడ్ లైన్స్ చూసి ఇస్తా అంటూ లాక్కున్నాడు నేను ఏమీ మాట్లాడకుండా సర్దుకుని కూర్చొని అబ్బాయి వైపు చూశాను కానీ అతను అక్కడ కనిపించలేదు.

అమ్మాయి రియాక్షన్ ఏంటా అని ఓరచూపులు చూశా ఆమె తన కళ్ళతో అతని వెతకడం నా దృష్టిలో పడింది. అబ్బాయి కోసం చుట్టూ చూసాడు అతను రెండు నిమిషాల తర్వాత నవ్వుతూ అమ్మాయి ముందు నుండి వెళ్తూ ఒక కాగితాన్ని ఆమె ఒళ్లోకి విసిరేసి నవ్వుకుంటూ ముందుకు వెళ్ళాడు. 

అమ్మాయి కాగితాన్ని తీసుకుని జాకెట్ లోకి తోసింది ఎవరైనా గమనించరెమోనని నేను కళ్ళు తిప్పేసుకుని బ్యాగ్ తీసుకుని లేచా నా బస్సు రావడంతో. తర్వాత ఏమైందో నాకు మాత్రం తెలియదు అంతా గందరగోళంలోనూ ఒక ప్రేమకథని చూసాను అనే తృప్తి నాకు కలిగింది. నాకు రాయడానికి ఒక కథ దొరికింది అనే సంతోషంలో నేను బస్సు ఎక్కాను...

Related Posts