నర్మద ( 5 రహస్య స్నేహితురాలు)

నర్మద

 

చిన్నప్పటి నుండి నాకు కవితలు , కథలు రాయడం అంటే చాలా ఇష్టం దాంతో నేను కథలు కవితలు రాయాలని అనుకునేవాడిని అయితే నా చదువు, బాధ్యతల్లో పడి సమయమే ఉండేది కాదు కానీ రాయాలనే కోరిక చాలా బలంగా ఉండేది దాంతో అప్పుడప్పుడు సమయం దొరికితే రాస్తూ ఉండేవాడిని . అయితే నాకప్పుడు పత్రికలకు పంపాలనే ఆలోచన లేదు ఒకవేళ  వచ్చినా ఆ.. మనవి ఎవరు వేసుకుంటారు అని అనుకునే వాడిని.

అలాంటి సమయం లో నాకొక యాప్ గురించి తెలిసి దాన్ని ఇంస్టాల్ చేసుకునీ అందులో రాయడం మొదలు పెట్టాను అయితే నాకు తెలియకుండానే నేను అందులో చాలా రాసాను దానివల్ల  చాలా మంది నా రచనలు చదివి సమీక్షించి నన్ను ముందుకు నడిచేలా చేసారు . అందులో చాలా వరకు ఆడవారే అవడం యాదృచ్చికంగా మారింది.

అయితే నేను నా రచనలు చదివి సమీక్షించిన అందరికి జవాబు ఇచ్చేవాడిని అలాంటి సమయం లోనే ఆ యాప్ వాళ్ళు కొంత మంది కొత్తవారిని ప్రోత్సహిస్తూ బహుమతులు ఇవ్వడానికి ఫంక్షన్ కు పిలిచారు అలా నేను మొదటిసారిగా అక్కడికి వెళ్ళినప్పుడు నా రచనలు చదివిన ఒకావిడ వచ్చి తనని తాను పరిచయం చేసుకుంది.

తన పేరు నర్మద అని నాకు పెద్ద అభిమాని ని అంటూ పరిచయం చేసుకుని తను కూడా రాయాలని అనుకుంటున్నా అని దానికి అవసరమైన సలహాలు ఇవ్వమని కోరింది. నేను సరే అనడం తో తాను తన నెంబర్ ఇచ్చి, నా నెంబర్ అడిగింది అయితే నాకు నెంబర్ ఇవ్వడం ఇష్టం లేదు. కానీ ఏదోలే ఇవ్వకపోతే పొగరని అనుకుంటుందేమో అనుకుని నెంబర్ ఇచ్చాను ఇక అదయ్యాక మళ్ళి నేను నా పని లో పడిపోయాను.

ఇక వారం రోజులకు మెల్లిగా మెసేజి చేయడం మొదలు పెట్టింది దాంతో నేను కూడా రిప్లై ఇచ్చాను ఆ తర్వాత తన మాయలో పడిపోయి నా స్వ విషయాలు అన్ని తనతో పంచుకున్నా, మగాడు తనతో ఒక అమ్మాయి మాట్లాడుతుంది అంటే కాస్త గర్వంగా ఫీల్ అవుతూ కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు చెప్పుకుంటాడు అలాగే నేను కూడా చెప్పుకున్నాను.

ఆ తర్వాత తను తన విషయాలు కూడా అన్ని వివరంగా చెప్పింది. తాను చాలా కష్టాల్లో ఉన్నాను అని కనీసం తిండి కూడా ఉండదు అని ఇలా ఎన్నో రకాలుగా చెప్పేది నేను అయ్యో పాపం అనుకుంటూ నా దగ్గర ఉన్న డబ్బులను అప్పుడప్పుడు తన ఫోన్ కు పంపేవాడిని. అయితే ఒక రోజు తన స్నేహితురాలు తనకు డబ్బులు పంపిస్తా అందని దాని కోసం నా బ్యాంకు అక్కౌంట్ నెంబర్ అడిగింది.

ఆ డబ్బును తాను అడిగినప్పుడు పంపమని అప్పటి వరకు నా దగ్గరే ఉంచమని అంది. తన అక్కౌంట్ లో ఉంటె తన వాళ్ళు తీసుకుంటారు అని అనడం తో సరే పాపం అని నా అక్కౌంట్ వివరాలన్నీ చెప్పి, పిన్ నెంబర్ కూడా చెప్పాను దాంతో నా అక్కౌంట్ లో పదివేలు పడినట్టుగా మెసేజి వచ్చింది నేనూ నమ్మాను అలా  కొన్ని రోజులు గడిచాయి.

ఇలా గడుస్తూ ఉండగా ఒక రోజు ఆఫీస్ నుండి బైక్ పై ఇంటికి వెళ్తుండగా నర్మద ఫోన్ చేసి ఎదో పిన్ వస్తుంది చెప్పండి అని అనడం తో పిన్ చెప్పి ఇంటికి బయలుదేరాను. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఫోన్ చేస్తుందేమో అని చేస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం వల్ల ఫోన్ సైలెంట్ లో పెట్టి ఫ్రెష్ అయ్యిపోయి, కాస్త మా ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పి కాసేపు అయ్యాక తిరిగి ఫోన్ తీసి చూసేసరికి అన్ని బ్యాంకు మెసేజి లు వచ్చి ఉన్నాయి.

అయితే అవన్నీ చూసేసరికి గుండెల్లో రాయి పడింది . అదేంటంటే నా అక్కౌంట్ లో ఉన్న డబ్బులన్నీ డ్రా చేసినట్టుగా ఉంది. అది చూసి షాక్ అయ్యి నర్మదకు ఫోన్ చేసాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కనీసం బ్యాంకుకు వెళ్లి కంప్లైంట్ ఇద్దామన్నా సమయం ఏడూ దాటింది దాంతో ఏం చేయాలో తెలియక నెత్తి పై చేతులు వేసుకున్నా.

నర్మద ఇలా చేసిందంటే అస్సలు నమ్మలేదు నేను దాదాపు ఒక సంవత్సరo పరిచయం కానీ తానిలా చేసిందంటే నమ్మకం కలగలేదు రేపు చేస్తుందేమో ఫోన్ ఆఫ్ అయ్యిందేమో అనుకున్నా కానీ ఆ రోజే కాదు ఎప్పుడూ తననుండి ఫోన్ రాలేదు దాంతో నాకు అర్ధం అయ్యింది తను నన్ను మోసం చేసిందని.

నన్ను నమ్మించి మోసం చేసిందని తెలిసి బాధ పడినా ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల రూపాయలు నా యాడాది సంపాదన కొడుకు ఫీజు కోసం దాచిన డబ్బు పోవడం తో ఆమె గురించి తెలుసుకుందాం అని ఆ యాప్ మేనేజర్ కు ఫోన్ చేసి తన వివరాలు అడిగాను. కానీ అతను అలాంటి పేరుతో ఇంత వరకు ఎవరూ రాయలేదని అంటూ నా ముందే వెతికారు కానీ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఫోన్ నెంబర్ కు కూడా చాలా ట్రై చేసాను కానీ కుదరలేదు. పొలిసు కంప్లైంట్ ఇద్దామన్నా పరువు పోతుందని భయపడ్డా నా వాళ్ళకు నేను ఎంతో మంచివాడిని అని పేరుంది ఆ పేరు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు దాంతో నోరుతో పాటూ అన్ని మూసుకున్నా .

మరి ఆ రోజు వచ్చిందని చెప్తే కనీసం కెమెరాలో అయినా ఉంటుంది కదా చూద్దాం అనుకుంటే అక్కడ కెమెరాలు లేవు మీరు ఫోటోలు తీసారు కదా అని అందులో వెతికితే అందులో కూడా లేదు అయితే తాను కావాలనే ఇలా ఫంక్షన్ లకు వచ్చి నాలాంటి వారిని బుట్టలో వేసుకుని మోసం చేస్తుందని తెలిసి అవాక్కయ్యాను.

నేను సమాజాన్ని ఉద్దరిద్దామనుకుoటే  ఆమె నన్ను ఉద్దరించింది ఇక ఇంట్లో చెప్తే దేప్పుతారని ఆ డబ్బు స్నేహితుడికి అప్పుగా ఇచ్చాను అని అబ్బద్దo చెప్పి ఇప్పటికి ఆమెని గుర్తు చేసుకొని రోజు లేదంటే నమ్మండి.

ఇక ఆ యాప్ లోంచి మొత్తానికి బయటకు వచ్చేసాను, ఆ రోజు వాళ్ళు నన్ను చూసిన జాలి చూపులు ఇప్పటికి నా వీపుకు గుచ్చుకుంటూనేఉన్నాయి.ఇకజీవితంలోరాయకూడదు,ఆడవాళ్ళను అసలే నమ్మకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా.

అదండీ నర్మద నా(రహస్య) స్నేహితురాలు అనుకున్న మోసగత్తె తో నా  అనుభవం. ఇంతకీ నా పేరు ఏంటంటే ఎందుకు లెండి మా వాళ్ళు చదివితే నరకం మొదలు అందుకే నా పేరు చెప్పడం లేదు. కొందరైనా ఇలాంటి వాళ్ళను నమ్మకుండా జాగ్రత్త పడాలని మీతో పంచుకుంటున్నా, మరీ జాగ్రత్త పడతారు కదూ….

 

 

 

                                  మీ అజ్ఞాత రచయిత  (బాధితుడు)

Related Posts

2 Comments

  1. ఇప్పుడంతా ఇలాగే జరుగుతోంది.
    అప్రమత్తంగా ఉండకపోతే కష్టాలు
    పడవలసి వస్తుంది.

  2. Hmm.. ఎదుటి వారు ఎంత చనువుగా ఉన్నా కొన్ని విషయాలు గోప్యంగానే ఉంచాలి

Comments are closed.