నల్ల పిల్ల

మా ఇంటి పక్కన కొత్తగా ఒక ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, అప్పుడు నా వయస్సు పదిహేనేళ్ళు నేను ఇప్పుడు ఇదంతా చెప్పడానికి చాలా పెద్ద కథ ఉంది వాళ్ళ కుటుంబం లో నాకు కనిపించిన ఒకే ఒక్క అమ్మాయి ఉంది అది కూడా పట్టించుకునే వాడిని కాదు కానీ నాకు మా ఇంటి పక్కన స్నేహితులు ఎవరూ లేకపోవడంతో .

వేసవిలో కురిసిన వర్షం లా నాకు దొరికిన ఒకే ఒక్క స్నేహితురాలు పిల్ల అందుకే నేను పిల్లని నా స్నేహితురాలుగా చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డానో నాకు తెలుసు ఇక నా కథ వినాల్సిందే మీరు ..మరి మా ఇల్లేమో ఉరవతల ఉండేది.అలా ఎందుకంటే మరి అక్కడైతే కిరాయి తక్కువ అని మా అమ్మ ,నాయన తీసుకున్నారు.

మా ఇల్లు పెద్దగా ,చుట్టూ కొబ్బరి చెట్ల తో ,పక్కనే చెరువు ఉండేది ,పొద్దంతా బట్టలు ఉతికేవాళ్ళు,బర్లు కడిగే వారు ఉన్నా,మిగతా సమయం లో చాలా నిశబ్దంగా,ప్రశాంతంగా ఎంతో ఉల్లాసంగా అనిపించేది.కొంత వయస్సు వచ్చాక నేను నా ఉహలలో ఉన్న ఉహసుందరిని ఉహిస్తూ, తన కోసం కవితలు ,కథలు రాసుకోవడానికి స్థలం నాకు చాలా అనువుగా ఉండేది.

అక్కడే నేను పిల్ల ఆడుకునే వాళ్ళం అంటే స్నేహితులం అయ్యాకే లెండి,అయితే పిల్ల మహా మొండి ఘటం ఒక పట్టానా నాకు లొంగలేదు ,అదే అదే ఒప్పుకోలేదు నాతో జత కట్టడానికి,ఇక నా పాట్లు చూడండి. వాళ్ళు మా ఇంటి పక్కనే దిగారు అని చెప్పినా కదా,దిగిన మరుసటి రోజు వాళ్ళ అమ్మ మా ఇంటికి పోద్దునీ వచ్చింది ,నేను పడుకునే ఉన్నా,వచ్చి మా యమ్మాని పాల గురించి అనుకుంటా .

అప్పుడప్పుడే  పరిచయం పెంచుకుని వాళ్ళిద్దరూ వదినా ,వదినా అని అనుకుంటున్నారు వరుసలు కలుపుకుని, మా అమ్మ తో మా పిల్ల కూ కొంచం సిగ్గు ఎక్కువ,కాస్త మీ వాడిని స్నేహం చేసుకుని మా పాపతో కలిసి ఆడుకొమ్మని చెప్పు వదినా అని ఆమె అడగడం, నన్ను అడగకుండానే అలాగే అని మాట కూడా ఇచ్చేయడం ఇవ్వని జరిగాయి ,మంచం లో ఉన్న నేను లేకకుండానే, ఇక మా అమ్మ నన్ను రోజు అమ్మాయితో మాట్లాడమని చెప్పడం నేను వెళ్ళి తనని ఆడుకోవడానికి పిలవడం . 

పిల్ల ఏమో నన్ను చూడగానే సిగ్గు తో లోపలి పరుగెత్తడం చేస్తూ ఉండేది. దాంతో నేను రోజు పిల్ల ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉండడమే నా పని గా మారింది ,ఒక నెల రోజులు అలా నన్ను చూడగానే లోనికి పరుగెత్తడం,నేను పిలవడం,ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడడమే నా పనిగా మారింది.

బళ్ళు తెరుస్తారు ఇక మళ్ళి ఆడుకోవడానికి సమయం ఉండదు అని నా బాధ ,బడి తెరిస్తే నన్ను మా అమ్మ బయటకు కూడా పంపాడు, పిల్లతో ఆడుకుందాం అంటే పిల్లనేమో తప్పుకు పోతుంది ,ఇక ఇలా కాదని పిల్ల రావడానికి నాతో ఆడుకోవడానికి అన్ని రకాల తినుబండారాలు తెచ్చి ,ఆమె కూ ఆశ చూపించడం మొదలు పెట్టాను అయినా పిల్ల రాలేదు.

అయితే ఒక రోజు ఏమయింది అంటే మా ఎదురుగ ఉన్న ఒక ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు వాళ్ళింట్లో కట్టిన ఉయాల లో కుర్చుని ఉగుతూ ఉన్నారు,అది చూస్తూ నల్ల పిల్ల నిలబడి ఉంది ,చాల సేపటి నుండి చూస్తునట్టుగా  ఆ పిల్ల నిలబడిన తిరు చెప్తుంది.

దాంతో నాకు ఒక్క విషయం అర్ధం అయ్యి ,నేను వెంటనే వెళ్ళి పెద్ద కొబ్బరి తాడు తీసుకొచ్చి రెండు కొబ్బరి చెట్లు ను అతి కష్టం మిద ఎక్కి ,వాటికీ కొబ్బరి తాడు తో మంచి ఉయాల కట్టాను గట్టిగా ,నేను కష్టపడడం చూసిన మా నాయన కూడా వచ్చి ,నాకు సహాయo చేసాడు ,దాంతో మాకు ఉగడానికి మంచి ఊయాల తయారయ్యింది,ఇక పిల్లను పిలవడమే తరువాయి.

కానీ నేను పిలవగానే లోపలికి పరుగెత్తుతుంది అందుకే ఏమి చెయ్యలా అని అనుకున్నా,దానికి నాకు వెంటనే ఒక ఆలోచన తట్టింది ,నేను రోజు పలకరిస్తుంటే పిల్ల సిగ్గు పడుతుంది అందుకే నేను కనిపించకుండా ఉండాలి అని అనుకున్నా ,మా ఇంటికి వెళ్ళి మా అమ్మ కుంపట్లో కాల్చినా మక్క బుట్టలు నాలుగు తీసుకుని వచ్చి పిల్ల వచ్చే తోవలో పెట్టి ,వాటి తర్వాత గన్నేరు పువ్వులు,మందార పువ్వులు కూడా ఉయాల వరకు పోసుకుంటూ వచ్చి,నేను ఉయాల్లో కుర్చుని ఉగుతూ మక్కా బుట్ట తింటున్నాను,కాసేపు అయ్యాక పిల్ల నేను రాలేదని నా కోసం చూస్తూ వైపుగావచ్చి మక్కబుట్టాలు పువ్వులు చూసి ఉయాల వరకు వచ్చింది.

పిల్ల వచ్చినా నేను ఆమె వైపు చూడకుండా నా మనన నేను బుట్టని నములుతూ ఉయాల ఉగుతున్నా , పిల్ల మెల్లిగా నేను కూడా ఉగుతా అంది,అన్ని రోజులకు పిల్ల గొంతు విని నేను సంతోషపడినా ,మళ్ళి ఉగనియ్యక పొతే నెల కూడా మాట్లాడదు ,ఇగ సెలవులు కూడా అయిపోతున్నాయి అని ,సరే దా కూర్చో అని ,ఇది నీ కోసమే అని అన్నాను , అవునా నా కోసమా,నేను ఇందులో ఎప్పుడైనా,ఎంత సేపు అయినా ఉగావచ్చా అని అడిగింది .

చక్రల్లాంటి కళ్ళు తిప్పుతూ ,హా అవును ఇది నిదె ,నువ్వు నిద్రపోయేటప్పుడు తప్పితే మొత్తంగా ఇందులోనే ఉండవచ్చు,నేనే నీ కోసం కష్టపడి చేశా, మరి నువ్వు నాతో అడుకున్తవా అని అడిగాను ఆశగా, ఆడుకుంటా అని అంది.ఇక అప్పటి నుండి మా ఆటలు ,పాటలు అన్ని అక్కడే అయ్యాయి,ఒక తినడం ,పడుకోవడం తప్పితే మిగతా సమయం అంతా అక్కడే ఉండే వాళ్ళం మేము.

పదిహేనేళ్ళ అబ్బాయి,పదేళ్ళ అమ్మాయితో ఆటలు ఏంటి అని అడగకండి ,మా ఇల్లు దూరంగా ఉందని మా స్నేహితులు ఎవరూ రాకపోయేవారు అని ముందే చెప్పను కదా,సెలవులు లో మేము ఆడుకున్న తర్వాత,అదే ఊర్లో అమంయి కూడా నాతో పాటే చదువుకోవడానికి వచ్చేది.

ఇద్దరం కలిసెళ్ళి వచ్చేవాళ్ళం.పిల్ల నల్లగా ఉన్న చాలా కళ గా ఉండేది,చక్రాల లాంటి  కళ్ళు తిప్పుతూ బాగా మాట్లాడేది కూడా,ఇలా కొన్నాళ్ళు అయ్యాక తనని వదిలి ఉండలేని పరిస్థితి కూడా కలిగింది నాకు, పిల్ల వయసు కు వచ్చాక మా మధ్య ఇంకా ఎడం పెరిగిoది.

పిల్ల నాకు కనిపించని అన్ని రోజులు నేను అదే ఉయాల్లో కుర్చుని ,అదే స్థలం లో కవితలు,కథలు రాస్తూ ప్రకృతిని నా ప్రేయసిని పంపించు ,చూపించు అని అడుగుతూ ఉండే వాడిని,నేను కోరుకున్న కోరిక న్యాయమో,మరి దేవుని నిర్ణయమో కానీ పిల్ల వయస్సుకు వచ్చాక కొన్ని రోజులకే ఆమె తల్లి ఎదో జబ్బు చేసి చనిపోతు నల్ల పిల్లని మా అమ్మ చేతిలో పెట్టి చనిపోయింది.

మరి మా అమ్మకు ముందు నుండే కోరిక ఉందో,లేక అలా చెయ్యాలి అని అనుకుందో కానీ నల్ల పిల్ల తండ్రిని అడిగేసింది,అలా నల్ల పిల్ల నా జీవితం లోకి వచ్చింది.పాపం పిల్ల తండ్రి కూడా భార్య పోయిన దుఖం లో కొన్ని రోజులకే కన్ను మూసాడు దిగులుతో,అప్పుడా పిల్ల బేలగా నా గుండెల మిద తలవాల్చి ఏడవడం నాకు బాగా గుర్తు,అప్పుడు మా వయస్సు తక్కువే అయిన ఆమె బాధ నాకు అర్ధం అయ్యి,నేను ఆమెని నా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నా, పిల్లని ఎప్పుడూ బాధ పెట్టలేదు,అసలు ఆలోచన కూడా నాకు రాలేదు.

ఇక నా తల్లిదండ్రులు కూడా పిల్లని ప్రేమగా ,నా కంటే ఎక్కువగా చూసుకున్నారు అని చెప్పవచ్చు,ఇప్పుడు ఇన్నేళ్ళు అయినా మాకు నలుగురు  మగ పిల్లలు,ఇద్దరు ఆడ పిల్లలు,పుట్టినా  వాళ్ళకి పెళ్ళిళ్ళు  అయ్యి పిల్లలు  కూడా పుట్టిన  తర్వాత కూడా ఇప్పటికి నేను తనని ఒక్క మాట కూడా అనకుండా చాలా బాగా చూసుకున్నా అని అంటుంది తను .

కానీ నాకు మాత్రం ఇంకా బాగా చూసుకుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది మా నల్ల పిల్ల ని ,ఇంతకీ నా నల్ల పిల్ల పేరేంటో మీకు చెప్పనే లేదు కదా నా నల్ల పిల్ల పేర చంద్ర కళ అండి బాగుంది కదా పేరు తన నల్లని కళ్ళను చక్రాల్లా తిప్పుతూనే నన్ను ప్రేమలోకి దించిన నల్ల కలువ ని నా నేస్తాన్ని హేసుకుని,నా జీవిత బాగాస్వమిని చేసుకునే వరకు వదల లేదు నేను మరి మీ సహచరి, సహచరుడి గురించి కూడా నాకు చెప్పండే ,మర్చిపోకుండా ….

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts