నవ్వుల పువ్వులు
ఊరు పేరేమో “ఆహా”.
అక్కడివాడే “మహా”. నవ్వేసేవాడు “హాహా”.
అతనికొక తాత.
తాతకి ఇష్టం కోడి
కోడికి ఇష్టం పకోడి.
మహా తెచ్చాడు చకోడి.
కోడికి పెట్టాడు చకోడి.
కోడికి నచ్చలేదు చకోడి.
దానికి కావాలి పకోడి.
పారిపోయిందా కోడి.
తాత కోడేమో పాయే.
తాత తెచ్చాడు బెత్తం
“హాహా” నవ్వు పోయే.
బెత్తానికే భయం వేసేలా
హాహాకి పూజ జరిగింది.
తాత తీర్చాఢు తీట.
కోడి కోసం పిల్లాడిని
చంపేస్తారా అంది అమ్మ
తాత కోపం తగ్గలేదు.
“హాహా” వీపు విమానం
మోత మోగించాడు.
ఇది కల్పిత కవిత.
ఇందులో ఏ పక్షి
హింసింప బడలేదు.
“హహా”కి మాత్రమే
బడిత పూజ జరిగింది.
వెంకట భాను ప్రసాద్