నవ్వుల రాజు

అక్షర హాస్య సాహితీ పోటీ కొరకు
అంశం – చిత్ర కవిత
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – నవ్వుల రాజు

నవ్వులు పండిస్తాడు
ఎక్కడ ఉన్నా అక్కడ
నవ్వులే కురిపిస్తాడు
చూడగానే ఆకర్షిస్తాడు!

చెంపల పై ఎరుపు
అతని ముక్కు చెర్రీ
పండు కళ్లు చురుకు
గా పెదవుల పై నవ్వు!

జోకర్ గా వెలుగుతున్న
అతని అంతరంగం లో
ఎన్ని బాధలో అవేవీ
తెలియకుండా నవ్వులే
ముఖం నిండా!

నవ్వుల రా రాజతడు
ఎల్లప్పుడు నవ్వుతుండు
ఇతరులను నవ్విస్తు ఉండు
మది లోపల వ్యధలెన్నో
రగులుతు ఉండు!

మనసున్న మహారాజు
మమతల నే పంచు రాజు
పది మందితో చెలిమి ఉండు
అతడెక్కడ ఉంటే అక్కడే
నవ్వుల పంట పండుచుండు!

ఇది నా స్వీయ రచన..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *