నవ్వోస్తేనే నవ్వండి

అనగనగనగ ఒక ఊరు ఉంది.
ఆ ఊరులో ఎవరు ఉండేవారు కాదు.
అసలు ఆ ఊరు ఉందని ఈ ప్రపంచం కి కూడా తెలియదు.

ఎందుకంటె ఆ ఊరుని ఇప్పుడేగా
నేను కని పెడుతుంది.


ఓకే మీ అందరి కోసం ఒక ఊరు ఉందని
నా కథ లో రాసుకుంటున్నాను.
దానిలో ప్రజలు ఎంత మంది ఉండాలి.
వారిలో ఎంత మందిని మన కథ లో భాగం చెయ్యాలి కూడా కామెంట్ లలో పెడితే నింపాదిగా కథ రాసుకుంటా అన్నమాట…..

ఓకే మీకు అంత ఓపిక తీరిక ఉండదు కాబట్టి
ఆ సక్కనైన కథ ఏదో నేనే రాసేస్తాను.
ఓపికతో చదవండి చాలు.

ఇంతకు ఇది హాస్య కథ అని చెప్పాను
కాబట్టి కథ లో హాస్యం ఉండాలి.
లేకుంటే మీకు నచ్చదు.కాబట్టి ఇరికిస్తాను.
ఒకవేళ నేను ఎంత కోషిష్ చేసిన కుడ్కా హాస్యం ఇరకాలేదు అని మీకనిపిస్తే
మీ అందరి అంగీకారంతో టైటిల్ చేంజ్ చేసి ప్రింట్ చేసుకుంటాను.ఓకే నా డోంట్ వర్రీ.

ఇక కథ లో పోతే ఒక ఊరు.
ఆ ఊరు ఉత్తర భారతం లోనిది అంటే దక్షిణం వారికీ నచ్చదు
దక్షిణ భారతం లోనిది అంటే ఉత్తరం వారికీ నచ్చదు కాబట్టి, పోనీ వేరే దేశం లోనిది అంటే అక్కడి పరిస్థితులు నాకూ అంతగా తెలియవు కాబట్టి
ఆ ఊరు ఎక్కడిది అన్నది మీ ఊహ కే వదిలేస్తున్నాను.

(ముఖ్య గమనిక) ఇక్కడ నాకూ భారతం దేశం గురించి మొత్తం తెలుసు అని మీరు అపోహ పడి
నా కథ లో అంచనాలు పెంచుకోవడం గట్రా చెయ్యకండి.
నిఝము గా చెప్పాలంటే నేనున్న గల్లీ గురించి కూడా నాకూ అంతగా తెలియదు.

ఇక కథ ఎందుకు రాయాల్సి వస్తుంది అన్న విషయం చెప్పితే దానికే సగం ఫేస్బుక్ నిండిపోతాది కాబట్టి నేరుగా కథ లోకే వెళ్తున్నాను.

అనగనగా ఒక ఊరు ఆ ఊరు చాలా గొప్ప గా ఉంటుంది (అని అనుకోవాలి.ఎందుకంటె నేను రాస్తుంది హాస్యం కథ కాబట్టి).

ఇక ఆ ఊరు అందాలు, ప్రజల మంచితనం, పంటపొలాలు, మన కథ లో హీరో హీరోయిన్స్ లు వారి కుటుంబాలు వారి నేపథ్యం వగైరా వగైరా ఇలా పాయింట్ టూ పాయింట్ చెప్పే ముందు అసలు కథ అంశం ఏంటో మీ అందరికి చెప్పితే మీరు కూడా కథ లో భాగం అయిపోతారు కాబట్టి నేరుగా పాయింట్ కి వస్తున్నానండి.

అసలు కథ లో అంశం అంటూ ఏమీ లేదు
ఎందుకంటె నేనేమి అనుకోలేదు గదా.
ఏదో
ఏమీ మనసుల పట్టక,
ఏదో రాయాలి అనిపించి ఫేస్బుక్ లో ఏదో రాసేస్తే నాలాంటి వారే చదివి పెడుతారుగా అని రాయడం తప్పించి,
ఆ రోజు మరి మా తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారు కొత్త గా నవలలు రాసే వారు కరువయ్యారు అని అందరిని నిందించాడు అన్న కోపం తో మాత్రం కానే కాదు తెలియచేసుకుంటున్నాను.

మీరేం భయపడకండి.
నేనేం నవల రాయబోవటం లేదు.ఇదివరకు ఇలాగే కరోనా సమయం లో నవల అని టైటిల్ పెట్టి రాయాలని చూస్తే
“నవల నా వల్ల “కాలేదండి.
అందుకే ఈసారి కథ అని మాత్రమే పెట్టాను.
ఆ తరువాత నా ప్రాప్తం
చదివే వారి ఖర్మ అంతే.

ఇక మరి ఆనాడు రాయలేక పోవడం కూడా
నా రచనా వైఫల్యం కాదు సుమీ
అందరూ కరొనతో చచ్చి పోతుంటే నువ్వు ఇట్లా తీరిగ్గా “లాక్ డౌన్ లో ఆడపిల్ల” అని
నవల రాస్తున్నావ్ రా వేదవన్నార వెదవ అని
నా అంతరాత్మ ఘోషించడం మూలాన అలా అఘోరించవలసి వచ్చింది.

ఏమిటో ఏదేదో చెప్పేస్తున్నాను.
కానీ యే మాట కా మాటే చెప్పుకోవాలి.
ఏదైనా సినిమా లేదా నవల లేదా కథ రాయాలి అంటే కొంచం ఓపికా, సహనం, లౌక్యం,
పరిస్థితులను చూసి చూడనట్టు వదిలేయగల మనస్తత్వం ఉండి తీరాలి.
డబ్బులు వచ్చేది ఉంటే అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనుకోండి.
ఇక సోషల్ మీడియా ద్వారా డబ్బులు రాకున్నా
పేరు వస్తుంది అని కూడా రాసేస్తారు కొందరు.
కానీ ఎందుకు ఆరోజు అలా జరిగిపోయింది.

ఇక కథ లో ముఖ్య విషయం అనుకోవాలి కాబట్టి అనుకుంటున్నాను. లేకుంటే కథ అష్ట వంకరలు తిరిగితే అసలుకే మోసం కాబట్టి ఒక విషయం అనుకుందాం.
అసలు హాస్యం నవలకు యే అంశం అయినా సరిపోతుంది కాకుంటే హాస్యం మాత్రమే ఎక్కువ గా రాస్తూ వెళ్ళాలి. అలా కాకుండా మిగితా అంశాల పైన శ్రద్ధ పెడితె అసలు కే ఎసరు వస్తుంది.

ఒక ప్రేమ కథాంశం తీసుకోవచ్చు లేదా రాజకీయ వ్యంగ్యం రాయవచ్చు లేదూ బారిస్టర్ పార్వతీశం, గణపతి లాగా లాగా జీవిత కథ నో మరొకటో ఏదో ఒక అంశం తీసుకొని రాసెయ్యవచ్చు.
అదేమంత పేద్ద కష్టం అయినా విషయం కాదు కానీ
మనము రాసే అంశం కి తగ్గట్టు కొంచం ఎక్కువ ఆలోచిస్తూ కథ ను నడిపించాలి.

ఏమిటీ కథ చెప్పకుండా కథ ఎలా రాయాలో చెప్తున్నాడు అనుకుంటున్నారా.
అంటే ఒకవేళ నేను రాసిన ఈ హాస్య కథ మీకు నచ్చేసి బాగా ప్రభావితులు అయిపోయి,
మీకు నాలాగే (నా అంత గొప్ప గా కాకపోయినా)
కథ నో నవల నో
లేదు మీ స్థాయి కి తగ్గట్టు యే గల్పిక నో రాయాలి అనుకుంటే
మికప్పుడు కథ ఎలా రాయాలి అన్న ప్రశ్న ఎదురవుతుంది కదా. అందుకని ముందే చెప్పేస్తున్నా అన్నమాట.

ఇక ఇప్పటికే ఈ పేజీ A4ను క్రాస్ చేసి A44సైజ్ కి చేరింది కాబట్టి
ఇంతకన్నా లాగితే అసలు ఈ పేజీ మొకం చూసే నాథుడే వుండరు కాబట్టి. మిమ్మల్ని ఇంతటితో వదిలేస్తున్నాను.
మీ నుండి వచ్చే స్పందన, లైక్ లు బట్టి
నా ఈ కథ ను పొడిగించాలో ముగింపు పలకాలో ఆలోచిస్తాను. ధన్యవాదములు.

నోట్.:
ఇందులో ప్రేక్షకులు అని చెప్పబడింది మీ గురించి కాదు. కేవలం హాస్యం కోసం రాసిన పదం మాత్రమే.
దయచేసి ఎక్కడ అయినా తప్పు గా రాసి ఉంటే క్షమించగలరు.

—-వంశీ కృష్ణ

Related Posts

1 Comment

Comments are closed.