మా అమ్మెప్పుడూ అనలేదు
మా నాన్నేపుడూ తిట్టలేదు
ఎవరు రాయించారు నా చేత
నేను నష్ట జాతుకురాలినని…
బదులివ్వండి బ్రతికిలేను నేను
చదువు జెప్పినవారా మాటనలేదు
ఆడి పాడిన మిత్రులెవ్వరూ
నవ్వుకుంటన్నా అనలేదు
మరి ఎవరు రాయించారు నా చేత
నేను నష్ట జాతకురాలినని…
దుఃఖమాగుతలేదు బదులివ్వండి
భయపడకండి నేను బ్రతికిలేను
ఇంకెన్ని రోజులీ ఎదురుచూపులన్న వేదనుంది
కానీ నౌకరీ పోటీ రందిలో
నా మనస్సన్నా పల్లెత్తు మాటనలేదు
మరి ఎవరు రాయించారు నా చేత
నేనొక నష్ట జాతకురాలినని
బదులివ్వండి వేధించకండి
మిత్రులారా చివరి సాయమాడుగుతున్న
నా మరణవార్తను సర్కారుకు వినిపించండి
దానికి చెవుడు గట్టిగా చెప్పండి
నా అమ్మ కడుపుకోత నా చావు ఉసురు
తప్పక తగుల్తదని బిగ్గరగా చెప్పండి
ప్రవల్లిక కి నివాళి చెప్తూ…
అమృతరాజ్