నాలో ఊపిరి మొత్తం

 

నువ్వెళ్ళిపోయాక
నాలో ఊపిరి మొత్తం
వెచ్చని కన్నీటితో కలిసిపోయి..
కళ్ళను హత్తుకుపోయింది!
మనసు చితికిపోయింది!
ప్రాణం బరువైపోయింది!
దేహం నీరసించిపోయింది!
నిగూడంగా నిద్రాణమైపోయింది!! నిశిధిలో నక్కింది..!!
విశ్వాంతరాళంలో లీనమైపోయింది!
మొత్తానికి శూన్యమైపోయింది!
నా బతుకు చిత్రం ఓ విచిత్రం !
నా మనసు గాయం ఓ అగ్నిపర్వతం!!

——–గాయత్రీభాస్కర్ ✍️

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *