మూసిన కళ్ల వెనక దాగిన దుఃఖం
నాతో పంచుకుంటే సగం బాద తీరినట్టే
ఒక్కసారి తనివి తీరా చూడవా
ముసుగుల్లేని నీ చూపు ఇవ్వవా
దాచిన నీ గాయం నా కళ్ల్లో పెట్టవా
నీవు గోడ అయితే దూకి వస్తా
కళ్ల లోపల మంటని చదివేస్తా
నిన్ను నువ్వుగా నీకు చేరుస్తా
ఒక్కసారి లోనికి రానివ్వు
నీ బాధంతా నాలో కలిపేయ్….నీ
కన్నీళ్ల బరువంతా నా మీద పెట్టు
మనసులో మాటలన్నీ నెమ్మదిగా తెరచి పెట్టు
తడిగా జారే శ్వాసల మధ్య
చెప్పలేని భయం నాకిచ్చెయ్య్
చీకటి అంచు నడుస్తున్న ఆలోచనను
చేతి వేళ్లతో తుడిచేస్తా
నీవు మోసిన ఒంటరితనం
నా ఒడిలో కొంచెం వాలనివ్వు
కన్ను మూసుకుని నిశ్శబ్దాన్ని చేధించవే…
-బర్రె సత్యనారాయణ