నా ప్రేమ కథ

నా ప్రేమ కథ

నా ప్రేమ కథ
నా ప్రేమ కథ

అవి నేను  ఇంటర్ మొదటి సంవత్సరo లో జాయిన్ అయిన మొదటి రోజులు నేను బస్ లో రొజూ కాలేజికి వెళ్తూ వస్తుండే వాడిని, అలా కొని రోజులు వెళ్ళిన తర్వాత అప్పట్లో కాలేజిలో మొదట్లో ఏమి చెప్పేవారు కాదు, ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారేమో అని నెల చివరి వరకు చూసేవారు.

ఎందుకంటే క్లాస్ లు మిస్ అవుతారు అని, ఇక మనం పూర్తిగా ఖాళీ కాబట్టి అందర్నీ గమనిస్తూ ఉండేవాడిని, పైగా మనకు కవిత్వ ధోరణి ఉండేది దాంతో నేను ఎక్కువగా మనుషులను, ప్రకృతిని గమనించే వాడిని.

అలా గమనించిన వాటిని నేను కవితలు రాస్తూ ఉండేవాడిని అలాంటి సమయం లో నాకు ఒక అమ్మాయి కనిపించింది.

తను చాలా అందంగా ఉండేది పెద్ద కళ్ళు, వాలుజడ ఇవ్వన్ని మాములే కదా, కాకపోతే ఆమె దానికి విరుద్దంగా నల్లగా, పొట్టిగా, చిన్న పిలక లాంటి జడ తో ఉండేది పైగా ఆ జడను ఎప్పుడూ నూనే పెట్టుకుని గట్టిగా జడ వేసుకుని కనిపించేది కానీ నాకు ఆమె ఎంతో అందంగా కనిపించింది.

ఇక మనం ఉరుకుంటామా ఆమె మీద ఎన్నో కవితలు, ఎన్నో కథలు అల్లుకుంటూ రకరకాలుగా ఆమె ను వర్ణిస్తూ నా నోట్స్ మొత్తం నింపేవాడిని, అలా రాయడం నేను క్లాస్ లు మొదలై పరిక్షలు వరకు కొనసాగుతూనే ఉండేది.

అయితే అలా రాసి రాసి రోజు ఆమెను చూస్తూ ఆమె ప్రేమలో పడిపోయాను, ఇక అప్పుడు నా అటన్డేన్స్ ఫుల్ గా ఉండేది, విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి కూడా ప్రతిరొజూ కాలేజికి వచ్చేది.

నా ప్రేమ కథ

నా ప్రేమ కథ
నా ప్రేమ కథ

అది చూసి నేను నా కోసమే అలా వస్తుంది అని అనుకునే వాడిని మనకు ఉహాలు ఎక్కువ కదా, ఇక నా కాలేజి అయిపోయే లోపు తనని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకున్నా, ఇక కాలేజి చివరి రోజు రానే వచ్చింది.

అప్పుడు మేమందరం కలిసి డబ్బులు వేసుకుని పార్టీ చేసుకున్నాం, ఇక అందరం విడిపోతామని తెలిసి ఎలాగైనా నేను నా ప్రేమ విషయం తనకు చెప్పాలని అనుకుని వెళ్ళిపోతున్న ఆమె దగ్గరికి వెళ్లాను ధైర్యం చేసి, ఎంతైనా అమ్మాయి కదా ఆ మాత్రం భయం ఉంటుంది. తన పేరు తెలియదు కాబట్టి ఏమండి అని పిలిచాను.

వాళ్ళు ఆగి వెనక్కి తిరిగి చూసారు, నేను మిమల్నే అన్నాను, ఏంటి అని అడిగిందా అమ్మాయి, మీతో మాట్లాడాలి అన్నాను పక్కన ఉన్న అమ్మాయిని ఇబ్బందిగా చూస్తూ, ఏంటో చెప్పండి పర్లేదు అందా అమ్మాయి…

ఇక నాకు దొరికిందే ఛాన్స్ అనుకుంటూ అది అది మీరంటే నాకు ఇష్టం అండి, నేను మిమల్ని పెళ్ళి చేసుకుందాం అని అనుకుంటున్నా అన్నాను వణుకుతున్న గొంతుతో, ఒక్కసారిగా వాళ్ళు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు, వెంటనే నా కలల సుందరి నవ్వుతూ “ఎప్పుడైనా నీ మొహం అద్దం లో చూసుకున్నావా, వెళ్లి చూసుకో అంది”.

నా ప్రేమ కథ

నా ప్రేమ కథ
నా ప్రేమ కథ

అలాగే తన చేతిలో ఉన్న ఫెయిర్ అండ్ లవ్లీ నా చేతి లో పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్తూ అంటున్న మాటలు గాల్లో నాకు తెలివచ్చాయి.

“పెద్ద అందగాడిని అనుకుంటున్నాడు కాబోలు వెధవ మొహం వాడునూ” నేను పిచ్చెత్తిపోయి, బిత్తరపోయి షాక్ తో అలా నిలబడిపోయాను ఒక నాలుగేళ్ళ వరకు ఆ షాక్ లోంచి తెరుకోలేదంటే నమ్మండి…

Related Posts

1 Comment

  1. అంతేగా మరి. లేకపోతే ఆ వయసులో పెళ్ళి ప్రస్తావన ఏంటి?కధ బాగుంది.

Comments are closed.