నా (రహస్య) స్నేహితుడు- A Secret Friend 2

నా (రహస్య) స్నేహితుడు

నా (రహస్య ) స్నేహితుడు
నా (రహస్య ) స్నేహితుడు

అవి 1999 సంవత్సర రోజులు అప్పుడే అనుకోకుండా నా జీవితం లోకి రాజు రావడం చాలా విచిత్రంగా జరిగింది. ఏదో .ఎంట్రెన్స్  పరీక్ష ఉండడం తో నేను హైదరాబాద్ బయలుదేరాలి అని అనుకున్నాం అప్పటికే నాకు పెళ్ళి అయ్యి ఒక పాప కూడా ఉంది.

హాయిగా  ఉన్నాం  పెళ్ళి  కాకముందు అప్లై చేసిన పరీక్ష కావడం వల్ల నేను వెళ్తాను అన్నాను మా వారు కూడా  నాకు తోడుగా వస్తా అనుకున్నారు కానీ సరిగ్గా అదే టైం కు ఏదో  అర్జెంట్   పని ఉండడం  వల్ల  రాలేక పోతూ చాలా బాధ పడ్డారు అయినా తప్పదు కాబట్టి మా అమ్మ గారి దగ్గర పాప నీ వదిలేసి నేను బయలుదేరాను .

కానీ అక్కడ మాకు చుట్టాలు  ఎవరూ లేక పోవడం  వల్ల ఒక లేడీస్ హాస్టల్ లో ఉండాలని అనుకుని ఒకరోజు ముందుగా వెళ్ళాను పాపం నేను వెళ్తుంటే మా పాప ఒకటే ఏడుపు నన్ను వదిలి ఎప్పుడు ఉండలేదు అందుకని నాకు బాధగా ఉంది కానీ అదృష్టం బాగుంటే ప్రభుత్వ ఉద్యోగం రావచ్చు అనే కారణం వల్ల వెళ్ళాను.

అలా ఒకరోజు ముందుగానే మధ్యాహ్నం బస్ ఎక్కి సాయంత్రం హైద్రాబాద్ లో దిగాను అంతా కొత్తగా ఉంది ముందే పెద్ద పట్టణం నాకు అంతా కొత్త కాబట్టి ఎక్కడ ఏముందో అసలే తెలియదు పైగా నాకు కాస్త మతిమరుపు కూడా అందువల్ల బస్ దిగి చిన్న బ్యాగ్ పట్టుకుని నిలబడ్డాను.

నిజానికి హాస్టల్ వార్డెన్ తో ముందుగానే మా ఆయన మాట్లాడారు అదెలా జరిగింది అంతే మా వారి ఆఫీస్ కొలీగ్ ఒకతని సిస్టర్ అదే హాస్టల్ లో ఉంటుందని తెలిసి వాళ్లను అడిగితే హాస్టల్ వార్డెన్ తో మాట్లాడించారు తర్వాత ఆమె కూడా నేను బస్టాండ్ కు వస్తాను అని చెప్పడం తో అదే ధైర్యం అంటే ఎవరో ఒకరు తోడుగా ఉన్నారనే ధైర్యం తో నేను హైరాబాద్ లో కాలు పెట్టాను.

బస్ దిగి ఆవిడ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను కానీ ఎంత సేపు గడిచినా ఆమె మాత్రం జాడ లేదు దాంతో ఏం చేయాలో తెలియక కంగారు పడ్డాను బ్యాగ్ లో ఆ హాస్టల్ అడ్రెస్స్ రాసుకున్నది గుర్తొచ్చి వెతకడం మొదలు పెట్టాను కానీ నా మతిమరుపు వల్ల దాన్ని ఇంట్లోనే మరిచిపోయాను ఎంత వెతికినా అడ్రెస్స్ కాగితం మాత్రం దొరకక పోవడం తో చాలా కంగారుగా భయంగా అనిపించింది చూస్తే చీకటి పడుతూ ఉంది.

మా ఆయనకు ఫోన్ చేద్దాo అనుకున్నా  ఇంట్లో ఎప్పటికీ ఫోన్ రాలేదు దాంతో టెన్షన్ పడుతూ ఎందుకొచ్చనురా భగవంతుడా అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకే అర్ధం కాని స్థితి కొత్త ఊరు కొత్త మనుషులు పైగా ఇక్కడ ఆటో వాళ్ళు  ఖతర్నాక్ అని అందరూ అనుకుంటూ ఉంటారు దాంతో ఇక నాకు  ఏడుపు రావడం  ఒక్కటే తక్కువ.

చీకటి కూడా పడబోతుంది ఏం చేయాలో నాకు అసలు తెలియడం లేదు ఇక్కడ మాకు చుట్టాలు లేరని ముందే చెప్పాను గా దాంతో  ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో కూడా తెలియడం లేదు పోనీ హాస్టల్ కు వెళ్దామని అనుకున్నా నాకు అడ్రెస్ గుర్తులేదు.

ఇక ఏంటి నా పరిస్థితి అని అనుకుంటూ చుట్టూ పరిసరాలను చూడడం మొదలు పెట్టాను . నన్ను ఎప్పటినుండి గమనిస్తున్నారో కానీ ఒక ఇద్దరు ఆటో వాళ్ళు నన్ను నా వాలకాన్ని గమనించి నా వద్దకు రావడానికి ఎదురుచూస్తూ ఉన్నారు గుంటనక్కల్లా నాకు చాలా భయం వేసింది గుండెలు జల్లుమన్నాయి అమ్మో వీళ్ళ చేతిలో పడితే నా పరిస్థితి ఏంటో నాకు కనిపించసాగింది. నేను వాళ్ళ నీ గమనించడం చూసి వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు.

నాకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు భయానికి చేతుల్లో చెమట పట్టడం మొదలైంది వస్తున్నారు వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు భగవంతుడా ఉద్యోగం మాట పరీక్షా మాట దేవుడు ఎరుగు ఇప్పుడు నేను వాళ్ళ చేతుల్లో పడకూడదు అంటూ కోటి దేవుళ్ళకు మొక్కుకుంటూ ఎవరైనా తెలిసిన వాళ్ళు  వస్తే బాగుండు అని అనుకుంటూ అలాగే నిలబడ్డాను.

ఇంతలోనే  ఎవరో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఇక్కడున్నావా నేను అటువైపు వెతుకుతున్నా పద చాలా సేపు అయ్యిందా అని అంటూ నా బాగ్ తీసుకుని రెండు అడుగులు ముందుకు వేసాడు నేను అతను ఎవరో తెలియక పోయినా ఆశ్చర్యంగా చూస్తూ అతనితో పాటు అడుగులు వేసాను అది గమనించిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళడం కూడా గమనించాను నేను.

కానీ అతనెవరో తెలియకుండా అలా ఎంత దూరం వేళ్ళలో అర్ధం కాలేదు చాలా దూరమే నడిచాను ముందు అతను వెనక నేను వెళ్ళడం తో పాటు అక్కడ నిలబడడం వల్ల నాకు కాళ్ళు లాగడం మొదలైంది .  దాంతో అక్కడే ఉన్నపుట్ పాత్ మిద కూర్చున్న అతను వెళ్తూనే ఉన్నాడు.

కాసేపటికి ఎందుకో వెనక్కి తిరిగి చూసాడు నేను అతన్నే చూస్తున్న అది గమనించి అతను వెనక్కి వచ్చి ఎంటండి నన్ను కూడా వాళ్ళ లా అనుకున్నారా ఏంటి ? రండి వెళదాం కాస్త టీ తాగుతూ మాట్లాడుకుందాం అని అన్నాడు దాంతో నేను అతని వెనకే వెళ్లాను అతనీ మాటలు మర్యాదగానే ఉండడం గమనించి అలా చిన్న హోటల్ లోకి వెళ్ళాక కొంచం మొహం కడుక్కోండి అన్నాడు.

సరే అని వెళ్లి మొహం కడుక్కుని వచ్చేసరికి ఎదో టిఫిన్ ఆర్డర్ చేసారు . దాన్ని చూడగానే ఆకలి గా అనిపించింది దాంతో కూర్చున్నా మొహమాటంగా తినండి అన్నాడు అతను అనడమే ఆలస్యం అన్నట్టుగా తినడం మొదలు పెట్టాను .

నా (రహస్య) స్నేహితుడు

నా (రహస్య ) స్నేహితుడు
నా (రహస్య ) స్నేహితుడు

నేను తినడం మొదలు పెట్టగానే అతను చిన్నగా నా పేరు రాజు అండి నేను కూడా మీతోపాటు పరీక్ష  కోసమే మీ బస్ లోనే వచ్చాను కానీ దిగిన తర్వాత మీరు అక్కడే ఉండడం చూసి ఎవరైనా వస్తారని ఉన్నారేమో అనుకున్నా కాసేపు చూసి వెళ్దామని ఆగాను.

కానీ ఎంతసేపు అయినా మీరు వెళ్ళాక పోవడం పైగా టెన్షన్ పడుతూ ఉండడం తో నాకు అనుమానం వచ్చి మీ దగ్గరికి వచ్చేసరికి ఆ వెధవలు వస్తూ కనిపించారు దాంతో మీతో మాట్లాడక తప్పలేదు ఇందులో నా తప్పేమి లేదు ఎందుకంటే ఆపదలో ఉన్నారని హెల్ప్ చేసాను.

మీరు ఇబ్బంది పడకండి మీకు నా మిద నమ్మకం ఉంటేనే నాతో రండి అన్నాడు లేదా మీ వారికీ ఫోన్ చేయండి అన్నాడు కానీ మా ఇంట్లో ఫోన్ లేదు వేరే ఎవరికైనా చేసి పిలిపిద్దాం అనుకున్నా కూడా దగ్గరలో ఎవరింట్లోనూ ఫోన్ లేదు .

అతని మాటలు చేతలు నాకు ఎందుకో నమ్మకంగానే అనిపించాయి అందుకే నా విషయం అంతా అతనితో చెప్పాను. అతను అంతా విని సరే అయిందేదో అయిపోయింది నాకు తెలిసి కొన్ని హాస్టల్ పేరు చెప్తాను మీరు వాటిలో ఉందేమో చెప్పండి అంటూ కొన్ని పేర్లు చెప్పాడు.

కానీ వాటిలో మా వారి స్నేహితుడి చెల్లెలు ఉన్న హాస్టల్ పేరు లేదు నాకు ఎలాగో గుర్తులేదు కాబట్టి అలా అనిపించిందో తెలియదు ఇక అదే విషయం చెప్పడం తో అతను ఒక సలహా ఇచ్చాడు రాజు తన స్నేహితుడి గదిలో ఉంటాను నా స్నేహితుడు వేరే ఊరికి వెళ్ళాడు.

కాబట్టి మీకు నమ్మకం ఉంటె నాతో రండి లేదా ఇక్కడ ఉన్న ఎదో ఒక హాస్టల్ లో మాట్లాడి  పెడతాను అని అన్నాడు. దానికి నేను హాస్టల్ లో ఉంటాను అని అన్నాను సరే వెళ్లి హాస్టల్ వెతుకుదాం అని అంటూ బిల్ కట్టాడు నేను కడతాను అని బాగ్ తియ్యబోతుంటే వద్దని వారించాడు దాంతో  నేను ఏం అనలేకపోయాను.

ఇద్దరం బయటకు వచ్చేసరికి వర్షం పడడం చూసి ఇక హాస్టల్ వెతకలేము అని అనుకున్నా , కానీ రాజు మాత్రం ఒక ఆటోని మాట్లాడి నన్ను ఎక్కించారు దాంతో అతను నాపై చూపిస్తున్నది జాలి  అనుకుని కూర్చున్నా , ఇక అలా అంతా తిరిగి ఇక ఎట్టకేలకు ఒక హాస్టల్ నీ పట్టుకున్నాం.

రాజు నన్ను తీసుకుని వెళ్లి పరిస్థితి అంతా వార్డెన్ కు చెప్పి సహాయం అడిగాడు దాంతో ఆవిడ ఒప్పుకుంది రాజు డబ్బులు కూడా ఇవ్వడం తో ఇక ఆవిడ ఒక గది చూపించింది దాంతో నేను సేఫ్టీ గా అందులో ఉన్నాను . తర్వాత అతను వచ్చి నాతో చూడండి నేను రేపు ప్రొద్దున వస్తాను కలిసే పరీక్షకు వెళ్దాం కంగారు పడకండి అనిధైర్యం చెప్పాడు.

నేను కృతజ్ఞతలు చెప్పాను దాంతో అతను వెళ్ళిపోయాడు మరొక సారి జాగ్రత్తలు చెప్పి. టిఫిన్ చేశాను కాబట్టి ఏమి తినకుండానే అలసిపోవడం తో పడుకున్నా నేను హయిగా ..

తెల్లారి లేచి తయారయి రెడీ గా ఉన్నాను రాజు కోసం ఎదురుచూస్తూ అయితే నాకు ఆలోచనలు చుట్టూ ముట్టాయి. రాత్రి రాజు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో తలచుకుంటూ భయం తో వణికి పోయాను . రాత్రి వాళ్ళు వచ్చి నన్ను తీసుకు వెళ్లి ఉంటె ఏమయ్యేదో నా భర్త పిల్ల ఏమయ్యేవారో అని గుండెలు అదిరాయి.

అతని ప్లేస్ లో వేరే ఎవరైనా ఉంటె తమ పని చూసుకుని వెళ్ళే వారు కదా అతను గమనించబట్టి నేను భద్రంగా ఉన్నాను అని అనుకున్నా ఇంతలో రాజు రావడం తో ఆలోచనలు కట్టి పెట్టి  అతనితో కలిసి వెళ్లాను వెళ్ళే దారిలో రాజు తన గురించి అన్ని విషాయాలు దాచకుండా చెప్పాడు నేను కూడా అన్ని చెప్పాను నా గురించి.

అతను చాలా కష్టాలు పడ్డాడు అని తెలిసి పాపం అనుకుని నాకు ఉద్యోగం రాకపోయినా తనకి రావాలని అనుకున్నా ఇక మా వారి కొలీగ్ చెల్లి వచ్చి తనకు జ్వరం రావడం తో రాలేక పోయాను మా అన్నయ్యకి చెప్పకండి అని అంది  దానికి నేను సరే అన్నాను. తను కూడా పరీక్షకు వచ్చింది.

అందరం కలిసి పరీక్ష రాసాము ఇక నేను తనతో వెళ్ళాలి అనుకున్నా అదే విషయం రాజు కు చెప్పితే సరే అన్నాడు. జాగ్రత్తలు చెప్పాడు సాయంత్రమే బస్ ఎక్కి మళ్ళి మా ఊరికి వచ్చేసాను . ఉన్నదీ , గడిపింది కాసేపే అయినా నాకు అతనికి మనస్సులు కలిసాయి.

తాను నాకు చాలా కనెక్టు అయ్యాడు స్నేహితుడు అంటే ప్రేమించిన వాడో లేదా అక్రమ సంభందం పెట్టుకున్న వాడో కాదు సహాయం చేసి  మనసుకు నచ్చితే మనల్ని తన మనిషిగా భావించిన వాడే నిజమైన స్నేహితుడు అని నా అభిప్రాయం …

ఇదంతా విన్న మీరు హెల్ప్ చేసిన వాడు రహస్య స్నేహితుడు ఎలా అవుతాడు అని మీరంటారు కానీ అతను నాకెప్పుడూ స్నేహితుడే ఎందుకంటే అతని గురించి నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు ఎందుకు అంటారా చెప్తాను వినండి కాదు చదవండి.

ఒక మగాడు నాకు సహాయం చేసాడు ఊరికే అంటే ఎవరు నమ్మరు అందులోనూ భర్త నమ్మడు ఎంత నమ్మకం ఉన్నా అతనిలో నేనే అనుమానం రేకెత్తించిన దాన్ని అవుతాను కదా ఒక్కసారి అనుమానం అంటూ వస్తే అది చచ్చేవరకు ఉంటుంది. ఎంత భర్త అయినా , ఎంత ప్రేమున్నా భార్యకు ఎవడో సహాయం చేసాడు.

ఆమె దృష్టిలో పడ్డాడు అంటే ఏదో  ఉంది అనుకుంటారు కదా అందుకే చెప్పలేదు మరి ఇప్ప్పుడేలా చెప్పాను అంటే వయసు అయిపోయింది గా చెప్పినా ఏం కాదనే ధైర్యం తో మీతో పంచుకున్నా అన్నట్టు రాజు కు నేను కోరుకున్నట్టుగానే ఉద్యోగం వచ్చింది.

తనకు ఒక కుటుంబం ఏర్పడి భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. మీకెలా తెలుసు అంటారా ఈ అక్షరలిపి పుణ్యమా అని తను ఈ మధ్యనే కలిసాడు కాబట్టి అప్పటి విషయాలు అన్ని మాట్లాడుకున్నాం .. ఇక ఈ అక్షరలిపి ద్వారా నేను తనకు తను చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ..

****థాంక్స్ రాజు****

ఇప్పటికి, ఎప్పటికి  తను నా (రహస్య ) స్నేహితుడే…..

 

Related Posts

4 Comments

Comments are closed.