నా రహస్య స్నేహితుడు

నా రహస్య స్నేహితుడు

 

 

నా పేరు ఎందుకు లెండి అనవసరo ఇక పోతే ఈ శీర్షిక ద్వారా నేను నా స్నేహితుడి గురించి చెప్పాలని అనుకుంటున్నా మరి చదవండి ..

నాకు శ్రీ పరిచయం అవ్వడం చాలా వింతగా జరిగింది శ్రీ ఎవరో కాదు మా వారి  స్నేహితుడు అతను నాకు హెదరాబాద్ కు వచ్చాక పరిచయం అయ్యాడు. నా పెళ్ళి తర్వాత  మేము హైదరాబాద్ లో కాపురం పెట్టాము. అప్పుడు మాకు కావాల్సిన ఇల్లును చూడడానికి కానీ, మాకు కావసినవి తెచ్చి ఇవ్వడానికి గాను తను ఎంతగానో సహాయం చేసాడు పాపం ఎంత రాత్రి ఫోన్ చేసినా , ఏదైనా కావాలన్నా నిమిషాల్లో తెచ్చి ఇచ్చేవాడు.

అయితే అలాంటి సమయం లోనే ఒక రోజు మా వారు ఎదో పని మీద బెంగుళూరు కు వెళ్ళారు అప్పుడు ఏమయ్యిందంటే మా పాపకు సాయంత్రం అవ్వగానే విపరీతంగా జ్వరం వచ్చింది , పైగా వర్షం మొదలైంది  నాకేం చేయాలో పాలు పోలేదు ఎంత సేపని పాపని అలా చూస్తూ ఉండాలి పైగా ఇక్కడంతా కొత్త పాప కు ఇలా సడెన్ గా జ్వరం రావడంతో ఏం చేయాలో అర్ధం కాలేదు అప్పటికి నాకు తెలిసిన ఇంట్లో ఉన్న మందులవి వేసాను కానీ తగ్గలేదు సరికాద ఇంకా పెరిగింది వళ్ళంతా  కాలిపోతుంది.

ఈ సమయం లో తనని పిలవాలా వద్దా పిలిస్తే ఏమనుకుంటారో ఎందుకంటే ఎప్పుడూ మా వారె తనకు ఫోన్ చేసేవారు నేను తనతో ఎప్పుడూ మాట్లాడలేదు ఇప్పుడు సడెన్గా ఫోన్ చేసి రమ్మంటే ఏమనుకుంటారో అని అనుకున్నా కానీ ముందు పాప ముఖ్యం కదా అందుకని ఇక ధైర్యంగా తన నెంబర్ వెతికి ఫోన్ చేసాను ఏమైతే అది అయ్యిందని .

నేను ఫోన్ చేసి విషయం చెప్పగానే పదినిమిషాల్లోనే వచ్చారు పాపం తడిచిపోయారు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుంటే నా ఫోన్ రావడం తో ఇంటికి కూడా వెళ్ళకుండా వచ్చేసి వస్తూ ఒక ఆటో నీ కూడా తీసుకుని వచ్చారు దాంతో ఆటోలో పాపని తీసుకుని హాస్పిటల్ కు వెళ్లాం ఆ రాత్రి అక్కడే ఉన్నాం పాపకు సైలెన్ పెట్టారు జ్వరం తగ్గిన నీరసంగా ఉందని.

పాపం రాత్రంతా తడిచిన బట్టల్లో, తిండిలేక వణుకుతున్న అతన్ని చూస్తుంటే పాపం అనిపించినా వేరే దారి లేదు కాబట్టి ఏమి మాట్లాడకుండా ఊరుకున్నా, ఇక పాప కాస్త బాగావడం తో తెల్లారి ఇంటికి వెళ్లాం నన్ను ఇంట్లో దించేసి వెళ్తున్నా అని చెప్పాడు అయితే నేను మాత్రం ఉండండి అని గబగబా ఉప్మా చేసి తనను బ్రష్ చేయమని ఉప్మా పెట్టాను తను చాలా ఇష్టంగా తింటూ నీకేం కష్టం వచ్చినా నేనున్నాను అని మర్చిపోకు అని చెప్పాడు దాంతో అతను నా మనసుకు చాలా నచ్చాడు.

ఇక అప్పటినుండి అతను నాకు ఆప్తుడిగా అయ్యాడు. కొన్ని రోజులకు మా వారు ఇంకో సెటప్ పెట్టి నన్ను సరిగ్గా చూడడం లేదని తెలిసి మా వారికీ నచ్చ చెప్పి మళ్ళి మంచిగా ఉండేలా చేసాడు ఇక ఇప్పటికి నేను ఏదైనా సమస్య వస్తే తనకు ఫోన్ చేయడమో లేదా మెసేజ్ చేయడమో చెస్తాను. అతని దగ్గర నేనొక చిన్న పిల్లను అవుతాను తనకు నా ఇష్టాలు అన్ని తెలుసు అతను కూడా అప్పుడప్పుడు నేను తినకపోయినా, మూడిగా ఉన్నా వెంటనే నా మెసేజ్ ద్వారా కనుక్కుని ఏమైంది అంటూ ఆరాలు తీసి మరి మెత్తగా మందలించి, నేను తినేలా చేస్తారు.

అయితే ఇదంతా మేము కేవలం మంచిగా ఉండే అంటే ఏలాంటి స్వార్ధం లేకుండా ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఒక స్వచ్చమైన స్నేహం తోనే మేదిలాము. కానీ ఇది ఎవరికీ చెప్పినా నమ్మరు ఎందుకంటే సమాజమే అలా మారిపోయింది కాబట్టి ఆ వాడికేం ఉపయోగం లేకుండానే ఏం ఇవ్వకుండానే ఇదంతా చేసాడా అని అంటారు.

అందుకే ఈ శీర్షిక ద్వారా అయినా నా మనసులో ఉన్న ఈ మాటల్ని అందరితో పంచుకోవాలని, ఈ వేదిక ద్వారా తనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని తను కేవలం నాకు మంచి మిత్రుడే కాదు మంచి సలహా దారుడు కూడా ఇక పోతే తనకు కుటుంబం ఉంది కాబట్టి నేను తన పూర్తి పేరుని చెప్పలేక పోతున్నా కానీ తనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు మాత్రం చెప్పుకోవాలని అనుకుంటున్నా. నన్ను నా జీవితాన్ని నిలబెట్టిన నా శ్రీ కి కృతజ్ఞతలు ..

 

 

థాంక్ యూ  శ్రీ

 

 

                                    నీ  అనామిక ..

 

Related Posts

1 Comment

  1. మంచి స్నేహితుడు

Comments are closed.