నా( రహస్య) స్నేహితురాలు

నా ( రహస్య ) స్నేహితురాలు

 

 

 

నా పేరు సమీర్ నేను అమీర్ పెటల్ ఉన్నప్పుడు ఒకరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది అందులో ఒకావిడ కిరణ్ నేను బాలానగర్ లో దిగాను ఎక్కడికి రావాలి అని అడుగుతుంది దాంతో నేను ఏంటండీ మీరు ఎవరికీ ఫోన్ చేశారు అండి నంబర్ సరిగ్గా చూసుకోండి అని అన్నాను దాంతో ఆవిడ నువ్వు ఎవరు అని నన్నే అడిగింది దాంతో చిరాగ్గా ఫోన్ చేసింది మీరు మళ్లీ నన్ను అడుగుతారు ఏంటి అంటూ కొప్పాడాను.

దాంతో ఆవిడ  సారీ అండి మా అన్నయ్య కు చేయబోయి మీకు చేశాను అంటూ సారీ చెప్పి అమీర్ పేట కు  ఎలా వెళ్ళాలి అండి ఏ నంబర్ బస్ ఎక్కాలి అని అడిగింది దాంతో నేను నంబర్ చెప్పాను . ఆ తర్వాత తనని మీ పేరేంటి అని అడిగాను తను లత అని చెప్పింది అమీర్పేట లో కోచింగ్ తీసుకోవడానికి వచ్చిందని ఆసక్తిగా పేరు అడిగాను అయితే తను డక్కన్ కోచింగ్ సెంటర్ అని చెప్పడం తో నేను అందులోనే తీసుకుంటున్నా అని చెప్పాను అర్ ఇద్దరం ఒకే సెంటర్ లక్కిగాకలిశాంఅంటూఆమర్నాడుసెంటర్లోకలవాలనిఅనుకున్నాంఇద్దరం..

తెల్లారి గబగబా లేచి రెడీ అయ్యి అందరికంటే ముందుగా వెళ్ళాను జీవితంలో మొట్టమొదటి సరిగా అమ్మాయిని కలవడం నాకు కొట్టగను ఇంట్రెస్ట్ గను ఉంది .దాంతో సెంటర్ దగ్గరికి వెళ్ళి ఎదురుచూడడం మొదలు పెట్టాను . కాని అంత మంది అమ్మాయిల్లో ఎవరో గుర్తుపట్టడం కష్టం అయ్యింది దాంతో తనకు ఫోన్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేసిన అమ్మాయిని చూడాలని నాకు ఉంటుంది గా కానీ కరెక్ట్ గా అదే టైం కి ఇంకో ఇద్దరూ అమ్మాయిలు కూడా ఫోన్ మాట్లాడడం తో ఎవరో పోల్చుకొలేకపోయా ఇంతలోనే మాకు కోచింగ్ ఇచ్చే ఫ్యాకల్టీ రావడం తో లోపలికి వెళ్లాను.

క్లాస్ లో లీనం అయినప్పుడు ఫోన్ లో మెసేజ్ వచ్చింది చూస్తే తానే లత హాయ్ ఎక్కడ ఉన్నారు తల తిప్పి వెనక్కి చూడండి అంటూ నేను వెనక్కి తిరిగి చూశాను గుండ్రటి మొహం ఒకటి కనిపించింది వెనక కానీ క్లాస్ ఇంట్రెస్ట్ గా ఉండడంతోమళ్లీముందుకుతిరిగాను.ఇకక్లాస్అయ్యేవరకువెనక్కితిరగలేదు.

క్లాస్ అయ్యాక అందరూ వెళ్తుంటే తనకు ఫోన్ చేశాను తను ఫోన్ లిఫ్ట్ చేసి సారీ అంది క్లాస్ మధ్యలో డిస్ట్రబ్  చేశాను అని అనడం తో సరే అని ఇద్దరం కలిసి అక్కడే ఉన్న హొటల్ లోకి దారి తీశాయి ప్రొద్దున ఏం తినకపోవడం తో ఆకలిగా ఉంది దాంతో టిఫిన్. కి ఆర్డర్ ఇచ్చాను . ఇక లతని పరిశీలించడం మొదలు పెట్టాను అందంగా అని కాదు గానీ ముద్దుగా బొద్దుగా బాగుంది గుండ్రటి మొహం పెడ్డకల్లు చిన్న జడ చుడీదార్ లో అప్పుడే పల్లెటూరి నుండి వచ్చిన అమ్మాయిలా బాగుంది కళ్ళలో ఏం తెలియని ఒకలాంటి వెదురుతో అతు ఇటు ఆసక్తిగా చూస్తోంది.

ఇంతలోనే టిఫిన్ రావడం తో తినడం మొదలు పెట్టాను కానీ లత తినకుండా కూర్చుంది తినండి అన్నాను దానికి లత దోష ఇష్టం ఉండదు అండి అనగానే ముందే చెప్పొచ్చు అంటూ వెయిటర్ నీ పీల్చి దోష ప్లేస్ లో వ డ కావాలని చెప్పి అదైనాఇష్టంమాకాదాఅనిఅడిగానుఇష్టమేఅనితలఊపింది.

ఇద్దరం తిన్న తర్వాత ఇప్పుడు చెప్పండి అన్నాను చాయి తాగుతూ ఇక తన గురించి అన్ని విషయాలు చెప్పింది తానొక్కతే అమ్మాయిని అని నలుగురు అన్నయ్యలు అని తమది అంద్ర దగ్గర ఊరని తనకు ఉద్యోగం చేయడం అంటే ఇష్టం అని చెప్పింది అయితే మా ఇద్దరి అభిప్రాయలు ఒకటే అవ్వడం చాలా సంతోషం వేసింది దాంతో ఇద్దరం మంచి మిత్రులం అయ్యాము. ఇక కోచింగ్ జరిగినన్ని రోజులు  మేము హైదరాబాద్ అంతటా తిరిగాము సినిమాలు, షికార్లు అన్ని విధాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము.  హలో హలో అన్ని విధాలా అంటే ఏదేదో ఉహించుకోకండి మాములుగా ఒక స్నేహితురాలిగానే చూసాను తిరిగాం .

 

అయితే మా ఇద్దరినీ చూసిన కొందరు మాకు ఎదే ఉందనుకుని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అది ఎంత వరకు వెళ్ళింది అంటే వాళ్ళ అన్నయ్యలు వచ్చి తనని తీసుకుని వెళ్ళేంత వరకు వచ్చింది. ఇక నన్ను ఒక శత్రువులా భావించిన వాళ్ళ అన్నయ్యలు తనను కోచింగ్ మానిపించి తీసుకుని వెళ్ళారు. అప్పటికే మా ఫోన్ నంబర్స్ ఉండడం తో కొన్నాళ్ళు మాట్లాడుకున్నాం తర్వాత తన ఫోన్ తీసుకున్నారు, తనకు పెళ్ళి చేసారు అయినా కూడా తను ఎదో విధంగా నాతో మాట్లాడుతూనే ఉంది.

 

అయితే వాళ్ళ అన్నయ్యలు నా మీద కోపం తో తనకు వెనకా ముందు చూడకుండా వరుడి గురించి కనుక్కోకుండా పెళ్ళి చేయడం తో అతను లతా కు పెళ్ళి అయ్యాక కొన్ని రోజులకు నరకం చూపించడం మొదలు పెట్టాడు దాంతో వాళ్ళు పశ్చాతాపం చెందడం మొదలు పెట్టారు కానీ అంతా అయ్యాక ఇప్పుడెం చేయలేక ఊరుకున్నారు పాపం లత మాత్రం అతని చేతిలో నరకం చూస్తుంది తనకు ఇద్దరు పిల్లలు వారి కోసం తను బ్రతికి ఉంది. ఇప్పటికి తాను నాతో మాట్లాడుతూనే ఉంది  భర్తకు తెలియకుండా నేను నా మాటలతో తనకు స్వాంతన కలిగిస్తున్నాను.

 

తాను అలా కావడానికి పెళ్ళి అవ్వడానికి నేనే కారణం అని బాధ పడుతుంటే లత మాత్రం తానూ ఇలా అవ్వడానికి కారణం తన అన్నయ్య లకు , తండ్రికి తన మీద నమ్మకం లేకపోవడం అని తనను చాలా తక్కువ గా చూసారని వారి పై కోపం పెంచుకుని ఇప్పటికి వారితో మాట్లాడడం లేదు. పెళ్ళి అయ్యి వెళ్ళింది అంటే ఇంత వరకు పుట్టింటికి వెళ్ళకుండా భర్త తోనే ఉంది. కానీ ఎంతైనా నా తప్పు కూడా ఉంది కదా కాబట్టి తనకు ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పుకోవాలని అనుకుంటూ  నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్షరలిపి కి నా ధన్యవాదాలు తెలియచేస్తూ …

 

****  నన్ను క్షమించు లత****

                                                                                                                         మీ సమీర్

Related Posts