నిజం

 

నాకసలు అనుమానం రాకపోయేది తెలుసా అసలు నా భర్త పుట్టినరోజు నాడు అతని అక్క చెల్లెళ్లకు నాకు కలిపి చీరలు తీసుకున్నాడు మేము తనకు బట్టలు తీసుకున్నాం వాళ్లు వెళ్లిపోయిన తర్వాత నేను నా చీర ని అంటే కొనుక్కున్న చీర జాకెట్ కుట్టడానికి  ఇవ్వాలని అనుకున్నా కానీ ఇంతలోనే పెద్దోడికి కాలు బెణికింది అంటే చూడడానికి వెళ్లాను ఇక అంతే ఆ సమయంలో అక్కడ పెద్ద వాడి దగ్గర ఉండవలసి వచ్చింది ఆ తర్వాత వెళ్ళిన ఆ చీర గురించి పట్టించుకోలేదు కొన్నాళ్ళ వరకు  ఎక్కడికి పోతుంది ఇంట్లోనే ఉంటుంది కదా అనే నమ్మకంతో మళ్లీ ఇంతలోనే టైఫాయిడ్ జ్వరం రావడంతో అందులోనూ అమ్మవారు కూడా అవడంతో వాడిని చూసుకోవడానికి సరిపోయింది

ఇంతలోనే చిన్నబాబు ఫోను నాకు ఇక్కడ బాగా లేదంటూ వచ్చి తీసుకు వెళ్ళమంటే వాడిని ఈ మధ్య హాస్టల్ లో వేశాను అమ్మవారు పెట్టుకుని వెళ్ళడం ఎందుకని పెద్దోన్ని అమ్మ దగ్గర ఉంచి  చిన్నోడి దగ్గరికి వెళ్లి వాడిని బుజ్జగించి బ్రతిమాలి బామాలి కట్టిన డబ్బు వెనక్కి ఇవ్వరు అంటూ వాడికి చెప్పు ఏదో ఒకటి చెప్పి మళ్ళి పెద్దోడి దగ్గరికి వచ్చి  వాడికి వేపాకు వేసిన నీటితో స్నానం మందులు వాడుతూ, జ్వరాన్ని తగ్గించి అందులోనూ చుట్టాల చావుకు వెళ్లి వచ్చి అమ్మవారు తగ్గిన జ్వరం తగ్గక పోవడంతో నేను ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఇంటికి వచ్చేయ్ అనడంతో బాబు ని తీసుకుని వెళ్ళాను

అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వారం రోజులు మూడు పూటలా పెట్టారు వాడికి పత్యం వంట మాకు మామూలు వంట నేను ఇంటికి హాస్పిటల్ కి తిరగడం తోనే సరిపోయింది పక్కింటి పాప పెద్దమనిషి అయింది అని తెలిసి వెళ్లి కొబ్బరి బెల్లం వేసి వచ్చాను ఆ అమ్మాయికి ఫంక్షన్ పెద్దగానే చేశారు అసలే మేము  మడి ఆచారం పాటించేవాళ్ళం వారేమో వేరేవాళ్లు అమ్మాయి ఫంక్షన్ ఉందని మేక తెచ్చి కోసారు నాకు ఆశ్చర్యం వేసింది.

ఎందుకంటే మా వారు వాళ్లను ఏమీ అనలేదు అలా చేయొద్దు ఇంట్లో అని చెప్పలేదు నేనే అడిగాను ఎందుకండి ఏమన లేదు అని అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే వాళ్లు మన ఇంట్లో కిరాయికి ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏం చేసుకుంటే మనకు ఏంటి అంటున్న విచిత్రంగా చూశాను ఎందుకంటే వాళ్లు వచ్చాక ఏ రోజు కనీసం గుడ్డు వండుకున్నా గొడవ పడేవారు. అలాంటిది ఈయన ఇలా అంటున్నాడని ఆ తర్వాత నాది ఏముందిలే అని అనుకోకుండా వారితో చెప్పాను ఇంట్లో వద్దు మీరు ఫంక్షన్ హాల్లో చేసుకోండి అదంతా అని  దానికి వాళ్ళు  సరే అన్నారు నేను బాబుని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాను హాస్పిటల్ లో ఉంటే రోజు డబ్బు అవుతుందని ఇంట్లో నుండి తిరుగుతున్నాము

నేను అమ్మ బాబు ని తీసుకుని వెళ్ళాను వెళ్లేటప్పుడు వారి ఇంట్లో ఫంక్షన్ కదా వాళ్ల చుట్టాలు వచ్చారు చాలా సందడిగా ఉంది సరే బాబుకు ఇలా ఉందని ఆందోళనతో నేను గబగబా బయలుదేరాను కానీ వెళ్లేటప్పుడు అతని భార్య ఎదురైంది నన్ను చూడగానే మీరు కూడా రావాలి అని ఫంక్షన్కు ఆ సరే అని అనుకుంటూ నేను వెళ్ళిపోయాను కానీ మనసులో మాత్రం ఎక్కడో ఏదో అనుమానం మొదలైంది

అది ఆమె కట్టుకున్న చీర అవును నేను ఎక్కడో చూశాను ఎక్కడ అని అనుమానం నా మనసులో మొదలైంది అది ఎక్కడ చూశాను అని ఎంత సేపు ఆలోచించినా గుర్తు రాలేదు అసలు ఎందుకు ఇలా మారిపోయారు అని ఆశ్చర్యం ఓ వైపు, ఆ చీర ఎక్కడ చూశాను అని ఓవైపు మనసులో అంతర్మధనం మొదలైంది.ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ రోజు ఫంక్షన్కు ఆయన వెళ్లారు . ఏ ఫంక్షన్ కు  వెళ్ళని ఆయన దీనికి వెళ్లడం ఏమిటి పైగా అక్కడ సుష్టుగా తినేసి వచ్చారు నా అనుమానం ఏంటంటే మేకమాంసంతో తిన్నారని కానీ ఆయన మాత్రం నేను స్వీట్ ఒకటే తిన్నానని కవర్ చేసుకున్నారు.

వెంట వేరే వాళ్ళు ఉన్నారు వాళ్లు చెప్పిన నేను నమ్మలేదు ఈ ఆలోచనలతోనే బాబుకి జ్వరం తగ్గడంతో అమ్మ నీ బాబు ని పంపించాను ఆ తర్వాత అంతా సర్దుకుని ఈ హడావుడి అంతా అయ్యేసరికి రెండు నెలలు గడిచి పోయింది ఈ లోపు నాతో పాటుగా చీర కొన్న ఆడపడుచు ఒకసారి కట్టుకుని వచ్చింది. అప్పుడు  నాకు నేను కొనుక్కున్న చీర గుర్తుకు వచ్చి దాని కోసం బీరువాలో చూశాను అది లేదు దాంతోపాటు కొత్త లంగాలు కూడా కనిపించలేదు నేను హడావుడి పడుతూ ఇల్లంతా వెతికాను బీరువాలో అంతట గాలించాలి కానీ నాకు అది ఎక్కడ కనిపించలేదు.

చివరికి మా వారినే ఏదని అడిగితే కుట్టడానికి ఇచ్చావ్ ఏమో అని అన్నారు నేనే మర్చిపోయాను అని అనుకుంటూ వెళ్లి ఆవిడని కూడా అడిగి వచ్చా ఆవిడ నాకు ఇవ్వలేదు అని అంది  నా పిచ్చి గానీ ఎందుకు అబద్ధం చెప్తుంది. ఆమె అందరికి కుట్టి ఇస్తుంది డబ్బు కోసం మరి అలాంటిది నా బట్టలు ఆవిడ ఎందుకు కట్టుకుంటుంది కదా.

ఇక ఇల్లంతా వెతికి వెతికి వేసారి పోయా కలర్ కూడా ఎరుపు రంగు, వంకాయ రంగు కలగలిపి ఉన్న చీర అది చూడగానే ఆకట్టుకుంటుంది. నాకు ఎందుకు గుర్తు లేదా ఎందుకంటే చీర కొన్న మర్నాడే నేను బాబు దగ్గరికి వెళ్లాను కదా అందుకే అంతగా గుర్తులేదు అని కూడా చెప్పలేను  ఇక వెతికి దొరకకపోవడంతో  పోతే పోయింది అని అనుకున్నా కానీ నాకు తెలుసు అది ఎవరి దగ్గరికి చేరిందో అది ఆ రోజు ఆవిడ కట్టుకున్న ఎర్ర చీర నాది ఎందుకంటే రంగు బాగా ఆకట్టుకునేది పైగా మా ఆడవాళ్ళు చీరలు గుర్తుంచుకుంటారు కదా అందుకే ఆ రోజు ఆ చీర ని చూడగానే నా మనసు అదోలా అయిపోయింది బాబు ఆరోగ్యం గురించి నేను ఆలోచించాను కానీ మగబుద్ది ఎక్కడికి పోతుంది తన ఆకలి గురించి ఆలోచించింది.

ఆ కుక్క ఇంకో కుక్కకు ఎర చూపించింది వాడుకుంది ఏర మొత్తానికి ఎసరు పెడుతుందని నేను అనుకోలేదు రెండు కుక్కలు కలిసి వారి ఆకలి కోసం వారి క్షణికావేశం కోసం మూడు నిండు జీవితాలను నాశనం చేశాయి ఒక చీర కోసం కక్కుర్తి పడిందో లేదా కోరిక తీరుతుందని ఆశ పడిందో భర్త తీర్చలేని వాటిని ఇలా తీర్చుకోవచ్చు అని కానీ ఆ కుక్క నా స్థానాన్ని తీసుకుంది కాదు ఆక్రమించింది అయిపోయింది పిల్లలు బాగుండాలని తల్లి గా అనుకున్నా కానీ  ఆ అవసరం లేదు తన ఆకలి తీరితే చాలనుకున్నా వాడి  తుచ్చమైన కోరిక ముందు తల్లి ప్రేమ ఓడిపోయింది. సంపాదించేది వాడు కదా అందుకే వాడికి అంత పొగరు, నా ఇష్టం  అని అన్న వాడు రేపు నా ఇష్టం అంటూ చంపడనే నమ్మకం లేక కాదనుకున్నా కనీసం ప్రాణాలు అయినా దక్కుతాయని..

ఇప్పుడు అంతా అయిపోయింది ఏ కోరిక కోసం ఇంకో కుక్కని చూసుకున్న వాడికోసం వెంపర్లాడక నేను బయటకు వచ్చి బ్రతుకుతున్నా ఎవరు ఎప్పుడు ఎలా మారతారు ఎవరికీ తెలియదు నీకు తెలివి లేదు అంటారా అవును తెలివి లేకనే వారిని కాదనీ నా స్థానాన్ని ఇంకొకరితో పంచుకోలేక ఆ ఎంగిలి నాకు అవసరం లేక భార్యాభర్తల అంటే సగభాగం అనే కాదు మనసా వాచా కర్మణా అన్ని పంచుకోవాలి కేవలం భార్యకి సొంతమైన భర్త ఇంకొకరితో గడిపితే అది చావు కంటే హీనం అంత మనోశక్తి  లేనివారికి వివాహం అనవసరం.

ఇది కొన్నాళ్ళు మాత్రమే నిజం ఏంటో గ్రహించిన నాడు మళ్ళి వెతుక్కుంటూ రాక పోతాడా ? అప్పుడు ఈ మాటలన్నీ చెప్పాలి నా ఈ మౌనాన్ని వీడాలి..వాడు ఏదోక రోజు మళ్ళి నా కాళ్ళ కిందకే వస్తాడు అవును ఇదే నిజం డబ్బు కోసం వచ్చిన ఆడది డబ్బు పోగానే వెళ్ళిపోతుందని వాడికి తెలిసే రోజు నిజాన్ని గ్రహించే రోజు ఎంతో దూరం లో లేదు…

ఇదంతా సోది లా ఉండొచ్చు కానీ పెళ్లి కాకముందు ఏం చేసినా ఒకసారి పెళ్లి అయ్యాక ఇక వారికి కట్టుబడి ఉండాలి వారి కోసం మాత్రమే బ్రతకాలి  ఇప్పుడు నేను గమనించిన ఈ నిజం ఇలా అందరికీ చెబుతున్నా ఎవరు నమ్మరు నమ్మలేరు ఇది చదివిన తర్వాత అయినా మీరు జాగ్రత్త పడండి మీ చీర కనిపించకపోయినా పక్కింటి వారితో మీ భర్త మాట తీరు మారినా వారిని సపోర్ట్ చేస్తున్నా అది ఏంటో తెలుసుకోండి.

వీలైతే అక్కడినుండి దూరంగా వెళ్ళిపోండి లేదా వారిని పంపించండి ఆడవారిలో కూడా ఇలాంటి వాళ్ళు  ఉన్నారనే నిజాన్ని గ్రహించండి జాగ్రత్తపడండి.. పడతారు కదూ

 

మీ  జననీ..

 

Related Posts

1 Comment

  1. వ్యక్తిత్వ్తానికి ప్రాధాన్యత ఇచ్చే కథ. బాగుంది

Comments are closed.