నిజమైన దేవుడు-1 చిన్న కథ (Real God With Great Heart)

నిజమైన దేవుడు- చిన్న కథ

 

నేను ఒక గుడిలో పనిచేసే అర్చకుని నా పేరు శ్రీకాంత్. నేను ప్రతిరోజు తెల్లవారుఝామునే లేచి రెడీ అయ్యి పనిచేసే గుడికి వెళ్లి అంతా శుభ్రం చేసుకుని హారతి పళ్లెం, గంట కడిగి పెట్టుకుంటాను.

నేను వచ్చే  ముందే ఒక ఆవిడ వచ్చి గుడి అంతా శుభ్రంగా కడిగేసి వెళ్తుంది. అంత పొద్దున్నే వచ్చి గుడి శుభ్రం చేసే ఆవిడను చూడాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను.

కానీ, ఆవిడ నాకెప్పుడు కనిపించలేదు. దేవుడైన కనిపిస్తాడేమో కానీ, ఈవిడ ఏంట్రా బాబు కనిపించదు అని అనుకున్న సందర్భాలు లేకపోలేదు.

Photo of People Standing in Front of Ganesha Statue

నాకు ఇక గుడిలో పూజ అయ్యాక అంత పొద్దున భక్తులు  ఎవరు రారు కనక స్వామివారికి విసర్జించిన పువ్వులు తీసుకుని ఒక కవర్లో వేసుకుని పారవేయడానికి వెళ్లే సమయంలో ఒక ముసలాయన వచ్చి గుడి బయట అంతా శుభ్రం చేసి అక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది వేసుకొని కూర్చునేవాడు.

తన ముందు చిన్న సత్తు పళ్ళెం పెట్టుకుంటూ…..  మొదట్లో నేను అది చూసి అతన్ని వెళ్ళిపొమ్మని  అన్నాను. కానీ, అతను బాగా ముసలి వాడు అవడంతో ఎవరైనా ఉన్నారో లేదో అని ఇదే అతని జీవితమేమో అని అనుకుంటూ పోనీలే అని ఊరుకున్నా.

ఇక నా విషయానికి వస్తే, నా గుడికి నేనొక్కన్నే అర్చకున్ని. అందరి దేవుళ్ళు ఉండడంతో భక్తులు బాగానే వచ్చేవారు. నాకు కూడా  లాభ సాటిగానే ఉండేది.

దాంతో నేను జీవించే వాడే దాదాపు పదేళ్లుగా గుడిలో అర్చకత్వం చేస్తున్న ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి శుభ్రం చేసే ఆవిడను చూడలేకపోవడం. ఈ ముసలాయన రాకపోవడం అంటూ జరిగేది కాదు.

వారు తప్పకుండా  వచ్చేవారు.  వర్షం పడినా వచ్చే వాళ్ళు. ఒక రోజు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగాయి.

ఈ గుడిలో చాలా బాగా జరిగాయి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో విచ్చేశారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో అన్నదానం కూడా చేసాము. అంతా అయ్యాక స్వామివారికి అలంకరించిన నగలను తీసి జాగ్రత్తగా పక్కకి పెడదామని చూసేసరికి, స్వామివారికి అలంకరించిన  చేతి కడియం కనిపించకపోవడంతో నేను ఈ విషయాన్ని సభ్యులకు చెప్పాను.

దాంతో, వారు చివరికి ఎవరెవరు వచ్చారు చూడమని  అన్నారు. నేను గుర్తు చేసుకుంటూ అన్నసంతర్పణ కాబట్టి భక్తులంతా వచ్చి తిని వెళ్లారు, కాబట్టి ఎవరిని ఏమి అనలేని పరిస్థితి.

నిజమైన దేవుడు

Lord Ganesha Statuette

అలా అని ఊరుకుంటే ఇది ఇంకొకసారి జరగవచ్చు కాబట్టి అక్కడున్న అందరినీ అడగాలనుకున్న గేట్లు మూసేసి  ఈ విషయాన్ని చెప్పి తీసిన వారు ఎవరైనా తిరిగి అయిదు నిమిషాల్లో స్వామి వారి చేతికి తొడగవలసిందిగా తెలియనివ్వమని కూడా చెప్పేసరికి భక్తులు కొందరు మొదట మమ్మల్ని అనుమనిస్తారా ? అని అన్నా  తర్వాత  తమకు సహకరించారు.

వారంతా వెళ్లి మళ్లీ స్వామిని దర్శించుకున్నారు. అలా అందరూ దర్శించుకుంటున్న సమయంలో నేను వారిని జాగ్రత్తగా గమనించాను. ఎందుకంటే దాదాపు 20 ఏళ్లుగా నగలు నేను వచ్చిన అప్పటి నుండి ఇప్పుడే వేయడం అది కూడా బ్రహ్మోత్సవాలు అని. మరి నా అధీనంలో ఉన్నప్పుడు అలా నగలు పోతే నాకు ఎంత అవమానం.

అందుకే నేను ప్రతి ఒక్కరిని గమనిస్తున్న నేను చూస్తున్నా ఈ సమయంలో నా కమిటీ సభ్యులు లోని ఒక వ్యక్తి తన జేబులోంచి తీసి తిరిగి స్వామి వారి చేతికి తొడగడం గమనించి నేను ఓరా అనుకున్నా.

అతనికి ఎక్కడ పెట్టలేనంత ఆస్తి ఉంది. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి.

నిజమైన దేవుడు

కాబట్టి, అన్నిటిలోనూ విజయము అతన్ని వరిస్తుంది. అలాంటివాడు ఇలా దేవుడి నగలు కొట్టేయాలని అనుకోవడం, కొట్టేయడం చూసి అతని బుద్ధికి నేను పైకి ఏమీ అనలేక మనసులోనే తిట్టుకున్నాను.

మిగతా వారు మాత్రం ఎవరో ఆ దొంగని కనిపెట్టలేకపోయారు. నాకు ఆ దొంగతనం చేసిన అతనికి, అక్కడ బయట చలికి, ఎండకి, వానకి, తడుస్తూ అడుక్కునే వ్యక్తికి తేడా ఏం లేదు అని అనిపించింది.

ఒక విధంగా చూస్తే, ఈ కమిటీ సభ్యుని కన్నా అక్కడ బయట అడుక్కుతినే అతనే గొప్ప అని నాకు అనిపించింది.

ఎందుకంటే, అతను కావాల్సినంత సంపాదించుకుంటాడు. అతనికి ఏరోజైనా ఎక్కువ డబ్బు వస్తే తనతోపాటు ఉన్న వారికి ఇచ్చేసి వెళ్ళిపోతారు.

కానీ, తను ఇంత డబ్బు ఉండి కూడా ఇంకా కష్టపడకుండా వచ్చే సంపాదన కోసం కక్కుర్తి పడుతున్నాడు. ఈ లోకం మొత్తం మారిపోయింది అని అనుకుంటున్న సమయంలో అమ్మ గారు వస్తున్నారు, వస్తున్నారు, అంటూ కేకలు వినిపించి నేను నా ఆలోచనల నుంచి బయటకు వచ్చి చూసేసరికి, ఒక యాభై ఏళ్ల ఆవిడ ఖరీదైన కారులో నుండి దిగుతూ కనిపించింది.

ఒంటినిండా నగలు, ఖరీదైన చీర, కట్టుకున్నా కూడా ఆవిడ ముఖంలో ప్రశాంతత చూస్తే చేతులెత్తి మొక్కలి అని నాకు అనిపిస్తుంది. అందరూ ఆవిడ ముందుకి వెళ్లి పలకరిస్తున్నారు.

నేను అలాగే నిలబడ్డాను ఆమె చిరునవ్వుతో వారిని పలకరించి అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళి అడుక్కునే వారి వద్దకు వెళ్ళి వారి క్షేమ సమాచారాన్ని అడుగుతూ, తాను తెచ్చిన బట్టలను పంచుతుంది.

ఇంతలో అదేంటి అలా చూస్తూ నిలబడ్డారు అని అడిగాడు పక్కనున్న వ్యక్తి. ఎవరు ఆవిడ నేనెప్పుడూ చూడలేదు అన్నాను తేరుకుంటూ…

ఇది మరీ బాగుంది! ఆవిడే కదా, ప్రతి రోజూ వచ్చి గుడిని శుభ్రం చేసేది. ఆ మాత్రం గుర్తు పట్టలేకపోతే ఎలా? అంటూ… ఆమె గొప్ప ధనవంతురాలు. కానీ, ప్రతిరోజు దేవుని సేవ చేసి గాని పచ్చి గంగ కూడా ముట్టదు అంటున్న ఆ వ్యక్తిని అలా చూస్తూ ఉండిపోయాను.

అంత గొప్ప ధనవంతురాలు అయి ఉండి కూడా గర్వం, అహంకారం లేని ఆమెను తనకున్న కొద్ది డబ్బుని మిగతా వారికి దానం చేసే ముసలాయన లోనూ నాకు నిజమైన దేవుడు కనిపించాడు ఆ క్షణంలో…

 

Related Posts

2 Comments

  1. మానవ సేవే మాధవసేవ అనే విషయం చెప్పకనే చెప్పారు.

  2. చాలా బావుంది భవ్యా, నిజంగా ఆవిడ లాంటి వాళ్ళు ఉన్నారు.

Comments are closed.