చెదిరిపోనీ మా స్నేహం

నిజమైన స్నేహం

నిజమైన స్నేహం

నిజమైన స్నేహితుడు దెవుడిచ్చిన వరం
తోబుట్టువు కాకున్నా వెన్నంటి ఉండేది స్నేహితుడు!
కష్టసుఖాల కలబోత జీవితంలో
స్నేహితుడే తోడుగా నీడగా త్యాగమూర్తిగా
ఆపద్భాంధవుడిలా జీవిత సహచరుడు స్నేహితుడు!
వేదనలోను శోధనలోను ఆలంబనగా వుంటాడు
ప్రపంచమంతా నిన్ను దోశిగా వేలెత్తి చూపినా
నిన్నెరిగిన స్నేహితుడు నిన్ను విడువడు
అతని సహచర్యంలో తుది గెలుపు నీదే అవుతుంది!
నిజమైన స్నేహితుడు జీవితాంతం తోడుగా ఉంటాడు
చీకటి వెలుగుల జీవితంలోనే నిజమైన స్నేహితులెవరో తెలుస్తుంది!
నిరంతరం అధ్యయనం చేసేవాడికి పుస్తకమే స్నేహితుడు
డబ్బున్నంత కాలం వెంటవుండి కల్లబొల్లి కబుర్లతో
వాడుకుని వదిలేసేవాడు కపట స్నేహితుడు!
నిజమయిన స్నేహితుడు నీడలా వెంట వుంటాడు
జీవిత పరమార్ధం బొధపడేది స్నేహం పరిపక్వతలోనే!
ఒకరి భావాలు ఒకరు హృదయం విప్పి చెప్పుకునేది
స్నేహితుడన్న వాడితోనే!
అలవిగాని ఆనందాల లోగిలి స్నేహితుల మధ్యనే!

ఆపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *