కాలం.

నిరంతర ప్రవాహం

నిరంతర ప్రవాహం

                                   కాలం ఒక నిరంతర ప్రవాహం, ఎవరూ దానిని ఆపలేరు? అది గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కలుపుతుంది. కాలం చూపించే మార్గంలో మనము ఎలా ముందుకు సాగుతాము? అనుకోని మలుపులు ఎలా ఎదుర్కుంటాము అనేది మన చేతుల్లోనే ఉంది? కాలం చూపించే మార్గం ఎప్పుడూ ఒకేలా ఉండదు? అది మనకు కొత్త పాఠాలను, అనుభవాలను ఇస్తుంది. కొన్నిసార్లు అది సంతోషాన్ని, కొన్నిసార్లు దుఃఖాన్ని, కొన్నిసార్లు కొత్త అవకాశాలను ఇస్తుంది.

కాలం చూపించే మార్గంలో ప్రేమ ఒక శాశ్వతమైన భావోద్వేగం. కాలం గడిచినా, మనసులో ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది.
కాలం చూపించే మార్గంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. డబ్బు సంపాదనలో కాలం ఎలా గడుస్తుందో మరియు డబ్బు మన జీవితాలను ఎలా శాసిస్తుందో తెలుపుతుంది? డబ్బు ఒక సాధనం మాత్రమే, అది గమ్యం కాదు. కాలం చూపించే మార్గంలో డబ్బు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, కానీ అది సర్వస్వం కాదు.
చిత్రంలో కనిపిస్తున్నట్లుగా కాలం అనే మహా శక్తి తన వేలిమీద మనుషులను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తోంది. కొందరు జాగ్రత్తగా అడుగులు వేస్తుంటే, మరికొందరు అజాగ్రత్తతో జారిపడుతున్నారు. ఈ దృశ్యం జీవితం అనే ప్రయాణానికి ప్రతీక.
జీవితంలో ప్రతి మనిషికి కాలం ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవారు విజయ శిఖరాలను చేరుకుంటారు. కాలం విలువను గుర్తించని వారు మాత్రం వెనుకబడిపోతారు. ఒకసారి కోల్పోయిన సమయం తిరిగి రాదు. అందుకే సమయాన్ని సక్రమంగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
కాలం మనకు అనుభవాలను అందిస్తుంది. సుఖంలో వినయాన్ని, కష్టంలో సహనాన్ని నేర్పుతుంది. విజయంతో… పాటు అపజయాలనూ చూపిస్తూ జీవిత పాఠాలను బోధిస్తుంది.
పడిపోవడం తప్పు కాదు, పడిపోయిన తర్వాత లేవకుండా ఉండటమే నిజమైన ఓటమి అని కాలమే మనకు తెలియజేస్తుంది.
ప్రతి క్షణం ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో నడవాలా, నిలవాలా, వెనక్కి తిరగాలా అన్న నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుంది.
క్రమశిక్షణ, కృషి, పట్టుదల ఉంటే కాలం మనకు మిత్రుడవుతుంది. లేకపోతే అదే కాలం మనకు కఠినమైన పరీక్షలను ఇస్తుంది.
అందువల్ల కాలం చూపించే మార్గాన్ని అర్థం చేసుకొని, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఎందుకంటే కాలం మన చేతిలో ఉండదు, కానీ కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది?

మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *