నిరాశా

నిరాశా

నిరాశా…

కోరికల ఊసులన్నీ మూటగట్టుకుని ఆశల పల్లకి ఎక్కి అందాల ఆరణాల ఆడపడుచు.

ఆశల పల్లకి ఎక్కానని ఆనందాల వెల్లువలొ సంబరముగా వేయించుకునే మూడు ముళ్ళు.

ముచ్చటైన పందిరిలో అందరి సంతోషాల మధ్యలో సంబరముగా వేస్తివే మూడు ముళ్ళు,.

ఏరి కోరి నిన్ను ఎంచుకున్నాను సుకుమార కోమల సుందరివని
అని మురిపించి నావు .

మభ్యపెట్టిన మాటలన్నీ నమ్మితినే ఆనాడు! అనురాగాల పందిరి దోరికిందని

కాళ్ళపారాణ అయిన ఆరనేలేదు కంటికి కనపడకుండా వెలితివే ఈనాడు..

మారు మాటైనా మాట్లాడలేదు నాతో !పెట్టిన మల్లెలు వడలనే లేదు కానరాకుంటవి నీవు..

నిసీది అంతా నా గుండెల్లో నీడలా వెంటాడుతుందేమో! చేరిపోయింది నిరాశ నిసిలా..

పదుగురు పరిహసించక ముందే ! మన ప్రేమానురాగాలు పండించు ..

పదుగురాడిన గుసగుసలు ,పరిహాసాలు నిజాలుగా చూపించకు! నన్ను ఇలా ఒంటరిని చేయకు …

నీకై వేచి చూస్తుంది శ్వేత వర్ణపు మధుపర్కం . నిసికి వెలుగులు తెస్తూ..

ఆశలన్నీ ఊహల గానే కరిగిపోనియ్యకు! నాకై నీవు రాగా మారిపోనా నేను నీలా.

నీవు నేను అనుమాట వేరుగ లేదు !ఇరువురము ఒకటై ఏలుదాము ప్రేమలోకము ..

సత్యవతి ఆలపాటి 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *