నిరీక్షణ

అబ్బ ఏం ఉందిరా బాబు చింత చచ్చినా పులుపు చావనట్టు మొగుడు పోయినా ఇంకా బిగువు సడలలేదు బాగా బలిసిన ఊరి కోడిలా బలే ఉంది రా ఏయ్  వస్తావా , ఒక్కసారి వచ్చావు అనుకో ఊరికే కదూ లే ఎంతో కొంత ఇస్తాను అయినా ఉప్పు కారం తినే శరీరం ఎలా ఉంటున్నావే ఒక్కసరి నా కోరిక తీర్చు నిన్ను రాణిలా చూసుకుంటాను ..

ఒరేయి ఎధవ నువ్వు చూసుకునేది ఏంటి రా దాన్నే అందరూ చూసుకుంటారు అయినా దాని కళ్ళ కు మనం ఎక్కడ కనిపిస్తాము రా ఈసూకుల్లో సార్లు టక్కు లు ఏసుకుని టిప్పు టాపు గా ఉండేటోల్లు దాని కళ్ళకు అనుతారు. మనల్ని కన్నీత్తి అయినా సుస్తుందా సుడది రా అది ఆగు బిడ్డ జర సందు దొర్కని నీ పని జేస్తం తీ అన్నాడు ఒకడు

ఒరేయి అదిప్పుడు బంగారు గుడ్లు పెట్టె బాతు రా రెండు చేతులా సంపాదిస్తున్న దానికి మనమెడ అనుతం  అంటూ కూస్తున్న  ఇద్దరు వెధవలను వారి మాటలకూ బాధ పడుతున్న తల్లిని వారి చేష్టలను ఈసడించుకుంటూన్న తల్లిని చూసి ఒరేయి మా అమ్మనే అంటారా అంటూ వారి పైకి వెళ్ళ బోతున్న శ్రీనివాస్ నీ ఆపేసింది శారదమ్మ.

చీ ఛి కుక్కలు వీధి కుక్కలు అరుస్తున్నాయి నాన్న పోనీ వాటి పాపాన అవే పోతాయి వాటిని అధిలిస్తే మన నోరే పాడవుతుంది పద బళ్లోకి అంటూ వడివడిగా అక్కడి నుండి వెళ్లి పొయింది శారదమ్మ.

ఒసేయి మాకు తెలుసు నువ్వు మాకు పడవని సార్లు నిన్ను వదులుతారా అది చూద్దాం నీ తప్పేదైనా దొరక్క పోతుందా అప్పుడు నిన్ను మేము పట్టుకోక పోతామా అంటూ వెకిలిగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళారు వాళ్ళు.

శారదమ్మ బడికి వెళ్ళినా,పని చేస్తున్నా ఏం చేస్తున్నా ప్రొద్దున వాళ్ళు అన్న మాటలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. నిజమే వాళ్ళు అన్నది ఈ ఊర్లోనే కాదు ఎక్కడైనా ఈ ప్రపంచం లో ఏ మూలకు వెళ్ళినా మొగుడు లేని ఆడది అయినా మొగుడు చచ్చిన ఆడది అయినా ఎవర్ని ఊరికే వదలదు ఈ సమాజం.

తానెం తప్పు చేయక పోయినా సమాజం ఏదోటి అంటూనే ఉంటుంది. ఈ పాడు లోకం లో ఎంత నిజాయితి గా ఉంటున్న ఎదో ఒక నింద వేస్తుంది. తమ కింద ఉన్న తప్పులను ఎవరు చెప్పుకోరు ఎదుటి వారి తప్పులను ఎంచుతారు కానీ తన కొడుకు ఇలాంటి చోట పెరిగితే వాడికి కూడా ఇవే అలవాటు అవుతాయి. ఇవే మాటలు వాడు నేర్చుకుని రేపు నలుగురిలో మాట్లాడితే పరువు పోతుంది.

వాడి నీ వాతావరణం లో పెంచాకుడదు వాడి జీవితం బాగుండాలి, వాడు బాగా చదువుకోవాలి వాడి బంగారు భవిష్యత్తు బాగుండాలి అంటే నేను ఎంత కష్టపడి అయినా వాడిని కలెక్టర్ చేయాలి అవును నేను వాడికి దూరంగా ఉండాలి. ఇక ఎట్టి పరిస్థితిలోనూ వాడిని ఈ ఊర్లో ఉంచకూడదు. నేను కూడా ఈ ఊరికి దూరంగా బదిలీ చేయించుకుని వెళ్లి పోవాలి అయిపోయింది నా జీవితం ఇక వాడి కోసమే అంకితం అని గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చిన శారదమ్మ అలసటగా కళ్ళు మూసుకునీ అలసిన మనసు తో నిద్రలోకి జారుకుంది …

*****

తెల్లారగానే తన పనులన్నీ పూర్తి చేసుకుని అనుకున్నట్టే తన కొడుకుని పిలిచి నాన్న శ్రీనివాసు  నేను చెప్పేది జాగ్రత్తగా విను నాయన మనకు మగతోడు ఎవరూ లేరు మీ నాన్న చనిపోయాక మన చుట్టాలు అందరూ మనల్ని పట్టించుకోవడం మానేశారు.

డబ్బు లేదు కాబట్టి అలాగే మనం అడుగుతాం అనే కావచ్చు ఏదైనా మనకు ప్రస్తుతం ఎవరూ లేరు . ఒక వేళ ఉన్నా పట్టించుకోరు అదే ఏదైనా తప్పు దొరికితే లేదా తప్పు అయ్యిందని అనిపిస్తే వచ్చి కాకుల్లా పొడుస్తారు.

కాబట్టి మనం ఇక్కడి నుండి వేరే ఊరికి వెళ్ళాలి ఈ వాతావరణం లో నువ్వు నీ చదువు సాగడం కుదరదు లోకం అనే మాటలతో నీ బుర్ర పాడవుతుంది దాంతో ఏదైనా జరగవచ్చు నిన్ను కలెక్టర్ గా చూడాలని నా ఆశ కాబట్టి నిన్ను పట్నం లో హాస్టల్ లో వేస్తాను ఇక నేను వేరే ఊరికి బదిలీ చేయించుకుంటాను.

నువ్వు అక్కడ ఉండి చదువుకో నేను రాలిపోయే వరకు నిన్ను బాగా చదివించడమే నా జీవిత లక్ష్యం కాబట్టి ఎందుకు వద్దు వెళ్ళాను అనే మాట అనకుండా వెళ్లి హాస్టల్లో చేరు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు ఎదుర్కొని నా కోరిక తీర్చు నీకు డబ్బు నేను పంపుతాను అంటూ కొడుక్కు ఎన్నో విధాలా నచ్చ చెప్పింది శారదమ్మ .

కానీ అమ్మా నిన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్తే ఎలాగమ్మ నీకు రక్షణ ఎవరు నన్ను బాగా చదివించాలనే ఆశ పడుతున్నావు కానీ నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా వద్దు అమ్మ మనం ఇద్దరం కలిసే ఉందాం అంటూ బతిమాలాడు శ్రీనివాస్.

వద్దు నాన్న నువ్వు  ఇప్పుడే మొగ్గ నుండి  వికసిస్తున్న వాడివి నువ్వు ఇలాంటి వాతావరణం లో వికసించ కూడదు మంచి వాతావరణం లో నువ్వు మంచి యువకుడిలా మారాలి. మంచి మనసున్న వ్యక్తిలా పరిపూర్ణ పురుషుడిలా నువ్వు మారాలి అంటే ఈ స్థలం లో ఉండకూడదు.

నువ్వు నా గురించి ఆలోచించకు నా జీవితం ఎండి పోయిన ఆకు అది ఎప్పుడు ఎలా రాలుతుందో తెలియదు కాబట్టి నువ్వు నీ జీవితాని ఒక బంగారు బాట వేసుకోవాలి అందుకే నువ్వు నేను చెప్పింది విని ఇక్కడి నుండి వెళ్ళు మళ్ళి నువ్వు కలెక్టర్ వి అయ్యాకే నాకు కనిపించు.

అంతే నాయనా నా జీవితం చివరి రక్తపు బొట్టు వరకు నిన్ను నేను కాపాడుకుంటాను నిన్ను అన్ని విధాలా చూసుకుంటాను చెప్పింది విను నేను ఎక్కడ ఉన్నా నీకు ఏ లోటు రాకుండా డబ్బు పంపుతాను సరేనా ఇక నువ్వు వద్దు అన్నావంటే నా మీద ఒట్టే అని శ్రీనివాస్ ముందరి కాళ్ళకు బంధాలు  వేసింది శారదమ్మ.

ఇక శ్రీనివాస్ ఏమి మాట్లాడలేక పోయాడు. తనకి అన్ని అర్ధం అవుతున్నాయి తానూ చిన్నప్పటి నుండి అన్ని చూస్తూనే పెరిగాడు. తన చుట్టాల సంగతి తల్లిదండ్రి సంగతులు తండ్రి మంచితనం ఇవ్వన్ని గుర్తొచ్చి తల్లి ఎంత పద్దతిగా ఉన్నా లోకం వేస్తున్న అపవాదులు కూడా మనసులోనే ఉన్నాయి.

అమ్మ చెప్పేది కూడా తన మంచికే కాబట్టి తల్లిని వదిలి వెళ్ళడం ఇష్టం లేకున్నా తల్లిని బాగా చూసుకోవాలన్నా, లోకం నోరు, తమని చూసి నవ్వినా వారి నోరు ముయించాలన్నా తాను ఏదోటి సాధించాలి. దాంతో సరేనమ్మ అలాగే నీ ఇష్ట ప్రకారమే వెళ్లి చదువుకుని కలెక్టర్ గా తిరిగి వస్తాను అప్పటి వరకు నీకు నా మొహం చూపించను అని తల్లితో చెప్పాడు శ్రీనివాస్.

అతని మాటలకూ పొంగిపోయిన శారదమ్మ ఇక అతన్ని చదువుల కోసం పట్నానికి తీసుకుని వెళ్లి స్కూల్ లో హాస్టల్ లో అన్ని విధాలా కుదిర్చిపెట్టి తనని జాగ్రత్తగా ఉండమని చెప్పి, డబ్బులు పంపుతాను అని అంటూ అడ్రెస్ అన్ని తీసుకుని తిరిగి తన ఊరికి వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకే తానూ అక్కడి నుండి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయింది.

ఆ తర్వాత తానెక్కడున్నా తన కొడుక్కు డబ్బు  పంపడం మాత్రం మానలేదు. కానీ అడ్రెస్ కూడా ఇవ్వలేదు, తన ఆరోగ్యం గురించి కూడా ఏ విషయాలు ఇక అలా పదేళ్ళు గడిచిపోయాయి. ఈ పదేళ్ళలో శ్రీనివాస్ తల్లి పైన చాలా బెంగపెట్టుకున్నాడు కానీ తల్లి ఎక్కడుంది మాత్రం తెలుసుకోలేక పోయాడు.

శ్రీనివాస్ కు తన సొంత ఊరిలోనె కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వడం తో అక్కడున్న తమ చుట్టాలు అంతా శ్రీనువాస్ నీ అందలం ఎక్కిస్తూ మా వాడె మా వాడె అంటూ ఆకాశానికి ఎత్తేసినా చిరునవ్వుతో వారిని పక్కకు జరిపి తల్లి కోసం వెతకడం మొదలు పెట్టాడు అలా కొన్ని రోజులు వెతికినా తర్వాత ఒక మారు మూల పల్లెలో తల్లి ఉందని తెలిసి ఆఘమేఘాల మీద అక్కడవాలాడు.

కానీ అక్కడికి వెళ్లి చూసేసరికి తల్లి చుట్టూ తనలాంటి వందల పిల్లలు చేరి కబుర్లు చెప్తూ నవ్విస్తూ ఉన్నారు ఆ దృశ్యం ఎంతో మనోహరంగా అనిపించింది శ్రీనివాస్ కు అతని తల్లి కూడా ముదిమి వయసులో గoభిరంగా, కాటన్ చీర , జారు ముడి తో ఎంత అందంగా కనిపించిది.కొడుకును గుర్తుపట్టిన ఆ తల్లి సంతోషంగా దగ్గరికి వచ్చి నాన్న శ్రీ అంటూ దగ్గరికి తీసుకుంది ఆ తర్వాత ఎన్నో మాట్లాడాలి అనుకున్న శ్రీనివాస్ తన తల్లి నీ చూసిన ఆనందం లో ఏమి మాట్లాడలేక పోయాడు.

తల్లిని తీసుకు వెళ్లి కలెక్టర్ సీట్లో కుర్చోపెట్టాడు ,అది చూసి ఆనందం తో శారదమ్మ గొంతు మూగ బోయింది.ఆ తర్వాత తన కొడుకుని  అనాధ పిల్లల్లో ఇన్నాళ్ళు చూసుకున్నందుకు వారికీ తన వంతు సహాయంగా ఒక శరణాలయం పెట్టి వారిని కన్నబిడ్డలా చూసుకోసాగింది శారదమ్మ ,ఎన్నో ఏళ్ళ తర్వాత తన జీవితాన్ని బంగారు బాట వేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన తన తల్లిని ఇన్నేళ్ళ తన నిరీక్షణ ఫలించి తాను తన తల్లిని చేరుకున్నాడు శ్రీనివాస్.

Related Posts