నిశ్శబ్ద విప్లవానివా…!!!

నిశ్శబ్ద విప్లవానివా…!!!

అడుగు పడిన వేదనలు
ఆంతరంగాన్ని కమ్మిన నిశీచ్ఛాయలు
వీడలేని మౌనంతో గెలుపు నిజాలు
గాయపడుతు గాఢాంధకారమున
మునిగిపోయి…కరిగిన ఎదలోతుల్లో
తడారిన భావాలు నిన్ను మనిషిగా
రూపుదిద్దుకోలేక పోతున్నాయా…

విషయం గర్పితమా…
విషనాగుల కౌగిటిలో నిరంతరమా
దివిటి కట్టని బతుకు దారిలో
ఆప్యాయతలు కరువై రోజుల
సంగతులను మరిచిన బానిసత్వమా…
ఎదపుటలను కాల్చిన మమకారాలతో
వసంతాన్ని పూయించుకోలేని
బొమ్మలకు పూసిన వేషమా…

దేనికోసమో నీ త్యాగం…
పంతం విడువక లోకాన్ని చూడలేక
విధానాలతో నీలో రగిలిన ఆశల
చిత్తానికి ఫలితం దొరకని నిరాశవా…
వ్యూహం నిండని మబ్బులను చూస్తు
తపనల ఉడుకును మింగుతు శ్వాసల
పోటుతో గమ్యాన్ని తొలుస్తున్న
నిశ్శబ్ద విప్లవానివా…

పలుకని మౌనం మూగబోయి
అంగీకారం లేక పగిలిన హృదయంతో
ఆవేదనని కన్నీరుగా చెమర్చుతు…
భయం గుప్పిటిని దాటుకోలేక
పిలిచిన బంధాలకు దూరమవుతు…
వాటిల్లని సమయం కొరకు ఎదురు
చూస్తున్న స్త్రీ సామ్యవాదివా…

దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *