నిషిత్

నిషిత్

నిషిత్

నిషిత్ మౌనంగా మూగగా మారాడు..
అమ్మ నాన్న ఎంత మాట్లాడిచ్చినా మౌనమే సమాధానంగా నిశ్శబ్దంగా ఉంటున్నాడు..
అలా కొంతకాలం నుండే!
అంతకు ముందైతే ధారాలంగా మాట్లాడేవాడు అందరినీ నవ్విస్తూ తనూ నవ్వుతూ గల గల సెలయేరులా ఉంటుండె..
ఇప్పుడేమెా ఆ నిషిత్ అని పేరు పెట్టినందుకా అన్నట్టు చీకట్లో నిశ్శబ్దమే తన బంధువైనట్టు తన గదిలో ఓ మూలన ఒదిగి పోతున్నాడు..
ఇదంతా ఎందుకు ఏంటని ఒకసారి వాల్ల నాన్న కాలేజ్ కి వెళ్లి కనుక్కుంటే ఒక అమ్మాయి వల్ల అలా అయ్యాడని తెలిసింది..
అమ్మాయిని ప్రేమించాడట తనూ ఇతణ్ణి ప్రేమించిందట కానీ మెాసం చేసి వేరే అతణ్ణి పెళ్లి చేసుకుందట..
అది విన్న వాల్ల నాన్న తన కొడుక్కి ఒక మంచి సంబంధం చూసాడు..
ఎంత చెప్పినా ససేమిరా చేసుకోనన్నాడు నిషిత్..
ఆఖరి రెండు అస్త్రాలు ప్రయెాగించి ( అదే ఇద్దరం చనిపోతామని బెదిరించి ) చివరకు ఒప్పించి పెళ్లి జరిపించారు ఎలాగోలా!
నిషిత్ నిశ్శబ్దాన్ని ఛేదించే బంధువు నిషికాంత నిషిత అతని జీవితంలోకి ప్రవేశించింది..
ఇంకేముంది నిషిత తన వాక్చాతుర్యంతో తన ప్రేమతో మళ్లీ నిషిత్ ను మునుపటిలా తయారు చేసింది..
మళ్లీ ఇంట్లో గల గల నవ్వులు నిండడంతో తల్లి తండ్రులు చాలా సంతోషించారు..
ఇద్దరి పేర్లలో చీకటి ఉన్నా జీవితంలో వెలుగులు నిండాయి..

ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *