నీలి కళ్ళ చెలి పక్కన నిలిచి కొంటె సైగల చిలిపి చేష్టలతో వలపు వల విసురుతుంటే….

పేరు:కొత్త ప్రియాంక (భానుప్రియ)
అంశం: నీలి మేఘాలలో
శీర్షిక: కడవరకు వదలను లే….
******
నీలి కళ్ళ చెలి పక్కన నిలిచి కొంటె సైగల చిలిపి చేష్టలతో వలపు వల విసురుతుంటే….

చెంత చేరి కమ్మని ఊసులెన్నో తన తేనెలో లుకు పలుకలతో పంచుకుంటే…

నీవే నా ప్రాణమని వాలు చూపుల బాణాలు విసురుతుంటే
నా హృది ఒప్పంగి నీలి మేఘాలలో తేలిపోతూ మధురానుభూతుల ఆనంద డోలికలలో విహారం చేస్తూ నా చెలి పంచే ప్రేమామృతపు మమతకై అడుగులేస్తా తనతో పాటు కడవరకు చేయి వదలక…..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *