నీవు నీదైన జీవితంలో జీవించు

నీవు నీదైన జీవితంలో జీవించు,,,,,,!!

నీలో నిగూఢంగా గూడుకట్టుకున్న ఎన్ని కూలిపోయిన అద్భుత స్వప్నాలో,,,,,,,,,,,
నీ జీవితాన్ని నీవు జీవించలేని ఎన్ని బంధనాల బాదరాబందీలో,,,,,,,,,,,
నీ పెళ్ళితో ఊహల గాలిమేడల్లో తేలిపోతూ దుఃఖం మిగిల్చిన ఎన్ని తెగిపడ్డ గాలిపటాలో,,,,,,,,,,,,,
నీవు ఊహించిన రంగుపూవుల జీవితం పగిలిన వక్కలు గుండెల్లో గుచ్చుకుంటున్న ఎన్ని వేదనా అపశ్రుతులో,,,,,,,,,,,,,,
నీ జీవితం ఆనంత ఆకాశం నుండి తెగిపడ్డ తనువు తాలూకు కరిగిపోయే కర్పూరానివో,,,,,,,,,,,,,
ఈ పృథ్వి కన్న కలలు కల్లలై కన్నీళ్లు రాని ఇసుక సముద్రాలు కళ్ళల్లో తేలిపోతూ అంతా అగమ్యగోచరంగా దుఃఖిత మది నుండి రాలని అశ్రువులు,,,,,,,,,,,,,,
కళ్ళల్లో నీవు చదివిన చదువులు ఈ కంగాళీ జీవితానికి ఆసరాయని ఇప్పుడు అర్థమవుతూ రూపుదిద్దుకుంటున్న ఆలోచనలు జీవిత పుటల్లో లిఖించుకునే అక్షరాలు,,,,,,,,,,,,,,,
అలనాడు రామసేతువు నిర్మాణంలో ఉడత తన భక్తితో సేతువుకై చిన్ని ప్రయత్నం ఇలలో ఎల్లకాలం నిలిచింది నీ ఆలోచన చిన్నదైనా గొప్ప గురువులాంటి నీ జీవితానికి అర్థం చెప్పే అణ్వాయుధం సోదరీ,,,,,,,,,,,,
లే లేచి నీ సంతానం బడి నుండి వచ్చే వేళ అయింది,,,,,,,,,,,
నీ భర్త ఉద్యోగియై సాధించ లేని జీవనయాత్రా సారధ్యంలో నీవు ప్రయివేటు ఉపాధ్యాయురాలివి ఎందుకు కాగూడదు,,,,? నీ ఆలోచన సరియైనది సోదరీ,,,,,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *