నీవు వచ్చేరాకడ తెలిసింది

అక్షర కొరకు
అంశం : చిత్రకవిత
శీర్షిక :నీవు వచ్చేరాకడ తెలిసింది!

నీవు వచ్చేరాకడ తెలిసింది
కానీ కనుచూపుమేరలో ఎవరూ లేరు,,,,,
గుభాలిస్తున్న పూల సుగంధాలు
కురుస్తున్న మంచులో తాజాగా మందారాలు
ఎర్రని పులి చారికల నిప్పు కణికల్లా,,,,,!
నీవు నీ కంచు కంఠం శృతి చేసుకుంటూ
నీవు పెదవులు తెరిచి పాడే పాట
సోయాగాల అమృతవళ్లుల గీతిక!
మనస్సు దేహం పులకరించిన పున్నాగ
నీ రాకడతో సునామీల సంగమం!
మనస్సు తెల్ల కాగితంపై రేఖా చిత్రాలు
నెలవంక నీ ముఖం నన్ను ముగ్దను చేస్తూ,,,,,,,,
సెలయేటిలో చేపలు పట్టే జాలరులు
మబ్బులు పట్టిన మధ్యాహ్నం లేత ఎండలో
కుళాయిల చెంత పోట్లాడు కుంటున్న ఆడంగులు
తలపాగ చుట్టుకుని రైతులు పొలాలకు వెళ్తూ,,,,,,
గుడి గంటలు బడిగంటలు మ్రోగాయి
నీవు నిర్మించుకున్న గాలి మేడలు రూపుదిద్దుకున్నాయ్!
ఈ శీతాకాలం పెనునిద్రను వీడి పిల్లలు
చదువులమ్మ గూటికి చేరుకున్నారు
పేదింటి పిల్లల ఇల్లు సర్కారు బడి
నీవు బడి పంతులుగా పిల్లలతో చెలిమి కలిమి
సరస్వతిమాత కూర్చున్న విరబూసిన తెల్లని కమలం!
నీవు ఇంకా రావేల ప్రియతమా,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *