నీ కళ్ళు కలల్లో తేలియాడు అప్సరసలు మది పూసిన కావ్య కళాఖండాలు
నీ కళ్ళు నిఘోడ తేజస్సులు అర్థంకాని మూగ బాసలు చిత్రకారుని చిత్రీకరణల మోడ్రన్ చిత్రాలు,,,,,,
నీ కళ్ళు మకరందాల మల్లియలు
వీక్షణలు పఠించు అక్షరాలు ముగ్దమనోహర కావ్యాలు,,,,,,,
నీ కళ్ళు చంద్రికలు చాందినీ నర్తినులు గోపికలు బృందావణిలో వేణుగానాలు,,,,,,,
నీ కళ్ళు దేవేరి పూజితలు రాకుమారుల సౌందర్యాల కలలు కుసుమించిన పూవులలో కన్యకలు,,,,,,,,,
నీ కళ్ళు కవుల మనములలో కవితలు జలజల కురిసే జల్లులు పదజాలములు సుకుమారులు ఇంద్రధనుస్సులు,,,,,,,
నీ కళ్ళు కలువలు ఠాగూర్ గీతాంజలి గీతాల ఊహలు సాలోచనలు నక్షత్రాల దివ్యతేజస్సులు ఆత్మావలోకణాలు ,,,,,,,,,
నీ కళ్ళు దివ్యగ్రంథాల మౌన పఠితలు బీజాక్షరాల శ్లోకాలు సంకీర్తనలు అక్షరాలు జ్యోతుల వెలుగుల కళలు,,,,,,,
నీ కళ్ళు ఉషస్సుల లేత కిరణాలు లోకాల మేల్కొలుపు జీవన తరంగాలు జ్ఞాపికల ఉదయినులు,,,,,,
అపరాజిత్
సూర్యాపేట