అక్షర కొరకు
అంశం : ఐచ్ఛికం
శీర్షిక :నీ పయన మెటో,,,,,,,!
ఏ దూర తీరాలకో నీ పయనం
ఏ సుందర స్వప్నాలు మేల్కొంటున్నాయో మది పూసిన బాసలు,,,,,,,,
ప్రకృతి ఒడిలో జీవితాలు కెరటాలు కెరటాలుగా సాగిపోయే పడవ,,,,,
ఉదయించే సూర్యుని లేత పసుపు కిరణాల ఉసులతో మేల్కొంటున్నాయి నవ జీవన స్వప్నాలు,,,,,,,,
పడవ నాగన్నకు తెలుసు ఎదురయ్యే సుడిగుండాల నెలా తప్పించుకోవాలో తన జీవనమే అది,,,,,,,,,
కాలచక్రంలో బంధీయైన జీవితాలు రుధిర స్వప్నాల నడిబొడ్డున కృంగిపోయి ఆగిపోతే ఏదీ నీ కోసం ఆగదు సుమీ,,,,,,,,
కాలం వెంట వెర్రి నాగన్నలా పరుగెత్తకు కాలాన్ని సమయ సందర్భంగా ఉపయోగించుకోడం తెలుసుకో జీవితం వడి వడిగా సాగిపోతుంది,,,,,,,,,,
ఆ అనంత ఆకాశం కింద మన మనస్సుకు తోచిన బంధాలలో ఇష్టమున్నా లేకున్నా ఇమిడిపోతూ సాగిపోయే నదీ ప్రయాణం జీవితం,,,,,,,,
జీవితానికున్న విలువలు ఈ నాగరిక ప్రపంచంలో మనం కల్పించుకున్నవి వాటిలో ఇమిడిపోక తప్పదు,,,,,,,,
ఈ పగళ్ళు రాత్రుళ్ళు శ్రమ జీవులు తమ కర్తవ్యంతో పొసే ఇంధనం మన జీవిత కడలి,,,,,,,,,!
అపరాజిత్
సూర్యాపేట