నీ రక్షణ నేను కలల కన్నా స్వరాజ్యం

నీ రక్షణ నేను కలల కన్నా స్వరాజ్యం

నేను కలల కన్నా స్వరాజ్యం లేకపోయినా
నీ రక్షణ కోసం తీసుకో అమ్మా ఈ కర్ర
నీ మీద జరిగే దాడులను చూడలేక
నీ రక్షణ కోసం ఇస్తున్న ఈ కర్ర
ఈ కర్రతో వాళ్ళ భారతం పట్టి
నిన్ను నువ్వు రక్షించుకో
నిన్ను కాపాడడానికి ఎవరో వస్తారని ఎదురు చూడకు
ఎవరో కాపాడుతారని నీ శక్తిని నువ్వు తెలుసుకోకుండా ఉండకు
నీలోనే అమితమైన శక్తి ఉందని తెలుసుకో
ఆ శక్తి ముందు ఈ మూర్ఖులు శక్తి పనిచేయదు
ఎప్పటికైనా నీకు నువ్వే రక్ష
నిన్ను నువ్వే రక్షించుకోగలవని నమ్మకంతో ఉండు
ఆ నమ్మకమే గెలుస్తుంది
అందుకో ఈ కర్ర నీపైన జరిగే దాడులను నుండి రక్షించుకో
ఈ ప్రపంచంలో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకున్నా
కొందరి స్వార్థంలో బలి అవుతుంది నువ్వే అని తెలుసుకో
ఎవరిని గుడ్డిగా అమాయకంగా నమ్మకుండా నీ జాగ్రత్తలో నువ్వు ఉంటూ
ఈ కర్రతో వారి పని పట్టు
నిన్ను నువ్వే రక్షించుకోగలవని ధైర్యంతో ముందుకు అడుగు..

నీ రక్షణ నేను కలల కన్నా స్వరాజ్యం

మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *