నువ్వంటే నాకిష్టమని చెప్పావు………….

అంశం:⁠- ప్రేమాకర్షణ
శీర్షిక:⁠- ప్రేమ అవుతుందా?

నువ్వంటే నాకిష్టమని చెప్పావు
నీ మాటలు మొదట్లో నమ్మకపోయినా
నా మీద చూపించిన శ్రద్ధకి నీ ప్రేమకి తలవంచాను
దానికి ప్రేమ అని పేరు నువ్వు పెట్టుకుని నా చుట్టూ తిరిగితే నమ్మాను…
ప్రేమంటే స్వార్థంగా ఉండాలని
మనల్ని ప్రేమించిన వాళ్లు సంతోషంగా ఉండాలని వాళ్ళు ఎలా ఉన్నా సరే స్వీకరించే అంత ప్రేమ ఉండాలని
కానీ నాకు ఇవేవీ నీలో కనిపించకపోయేసరికి
నాకు నీ మీద ప్రేమో లేక ఆకర్షణనో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను…
కృష్ణుడిని రాధా ఎంతగా ప్రేమించిందో
తన ఆరాధన లోనే తెలిసిపోయింది..
ప్రేమంటే స్వార్థం లేని ఒక ఆరాధన లాంటిది..
అలాంటి ప్రేమకు ఈరోజుల్లో విలువ లేక పోతుంది…
ప్రేమాకర్షణ మధ్యలో నలుగుతూ జీవితాలు నాశనం చేసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు..
ప్రేమ పేరు చెప్పి తమ కోరికల్ని తీర్చుకుంటున్నారు…
నువ్వు ఒకరిని ఇష్టపడుతుంటే అది ప్రేమో వ్యామోహమో తెలుసుకుని మసులుకుంటే నీకే మంచిది…
నీకే నిజమైన ప్రేమ ఎంత పవిత్రమైనదో అర్థమవుతుంది..
ఒకరు మంచి కోరుకునే ప్రేమ ఒకరి ప్రాణాలు తీయమని చెప్తుందా?
నీ ప్రేమను కాదు అన్నందుకు తన ప్రాణాలు తీస్తే అది ప్రేమ అవుతుందా?
అయితే అది ప్రేమ అవ్వదు ప్రేమాకర్షణ అవుతుంది..
ప్రేమాకర్షణ వల్లే కొందరు ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు…

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                     ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *