నువ్వే నా లోకం

ఏరా ఏం అలోచించావు నీకు ఒకే కదా అన్నాడు కిరణ్ అరుణ్ ని చూస్తూ…  హ ఒకే నా అంటే ఒకే అని చెప్పాలి కానీ నాకు ఎవరూ లేక తనకి ఎవరూ లేక ఈ పెళ్లి జరిగితే మా పెళ్లిని మేమె చేసుకోవాలి మాకు మేమె శుభాకాంక్షలు చెప్పుకోవాలి మాకు బంధువులు ఎవరూ లేరుగా అన్నాడు అరుణ్. అవును మరి వద్దని చెప్పనా అయినా మీకు మేమున్నాం కదరా! స్నేహితులం మనుషులం కాదా? ఏంటి నువ్వు మమ్మల్ని నీ వాళ్ళని అనుకోవడం లేదా? అయినా ఇక నువ్వు మమ్మల్ని ని వాళ్ళని అనుకొనప్పుడు ఇక నేను ఇక్కడ ఉండడం ఎందుకు దండగ పోతున్న నేను నువ్వు నన్ను ఇంకా దూరం చేస్తున్నావ్ కదరా నేను వెళ్తున్నా పో అన్నాడు కిరణ్.

అబ్బా సరే రా బాబు నువ్వే నాకు అన్ని మిత్రుడైన బంధువైన నువ్వేలే కానీ ఇప్పుడు నువ్వు అడిగితే నేను బతిమాలి ఓపిక నాకు లేదు. కానీ, చెప్పు ఏం చేయమంటావు నాకేం తోచడం లేదు, వేరే ఎవరు లేరు సలహాలు చెప్పడానికి ప్లీజ్ రా చెప్పు ఏదో ఒకటి అన్నాడు అనునయంగా అరుణ్. సరే రా నువ్వు ఉన్నావు కాబట్టి నేను వెళ్లడం లేదులే. కానీ, ఒక్క మాట చెప్తాను విను నువ్వు అనాధ నీకు కాబోయే భార్య అనాధ కాబట్టి చేసుకోనని అంటున్నావ్ అంతేనా అన్నాడు. కిరణ్ని చూస్తూ అవునురా అంతే అన్నాడు కిరణ్. ఇద్దరూ ఆఫీస్ క్యాంటీన్లో కూర్చున్నారు. వారిద్దరూ అనాధలైన కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికీ ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సలహాలు తెచ్చుకుంటారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఒక కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ, అతను అనాధ అని ఎవరు పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు. దాంతో ఇంకో అనాథని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు కిరణ్. అలా అరుణ్ కి ఇష్టం లేకున్నా నీరజని చూసి వచ్చాడు. కానీ, అతని మనసులో మాత్రం ఒక కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అత్త మామ బావమరిది ఇలా అందరూ ఉంటారని ఆశపడుతున్నాడు. అతని కోరికలు ఆశలు తప్పేమీ లేదు. కానీ, ఎవరూ పిల్లని ఇవ్వడం లేదని కిరణ్ వాదన.

ఇది ఇప్పుడు వారి మధ్యనున్న జరుగుతున్న డిస్కషన్ సారాంశం, ఒరేయ్ అరుణ్ కుటుంబం అనేది ఏర్పడాలి అంటే ముందు ఎవరో ఒకరు ఎవరికో తెలియని ఇద్దరు వ్యక్తులకు పెళ్లి జరగాలి, పిల్లలు పుట్టాలి, అప్పుడు కుటుంబం ఏర్పడుతుంది. ఆమె అనాధ అని నువ్వు అంటున్నావు నువ్వు తనని చేసుకుంటే మీరు ఇద్దరు భార్యాభర్తలు అవుతారు మీకు పుట్టిన పిల్లలు మీ పిల్లలకు ఇలా ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే ఆ అమ్మాయి కూడా అనుకుంటే అనాధలకు పెళ్లి ఎలా జరుగుతుంది? ఇప్పుడు నువ్వు చేసుకో లేదనుకో రేపు నేను చేసుకోలేను కదా, ఈ కారణం సరికాదు ఇద్దరు అనాధలు కలిస్తేనే బాగుంటుంది. వారికి కుటుంబం ప్రేమ ఆప్యాయతలు తెలియదు కాబట్టి ఈ కుటుంబాన్ని ప్రేమగా చూస్తారు. అంటే నిన్ను నీ భార్య నువ్వు నీ భార్యని ప్రేమగా చూసుకోవచ్చు, ప్రేమని పంచవచ్చు మీరిద్దరూ కలిసి నాకు పెళ్లి చేయవచ్చు. నా పెళ్లి పెద్దలు కావచ్చు అన్నాడు.

కళ్ళు మూసుకుని ఊహించుకుంటూ ఒరేయ్ ఒరేయ్ ఆపరా నీ ఉపన్యాసం ఆపరా బాబు అన్నాడు. సరేలే నాకు నీరజ చాలా బాగా నచ్చింది, అందుకే నీ కోరికని మన్నిస్తున్నా అన్నాడు నవ్వుతూ ఏంటి అయితే నువ్వు నిజమే నువ్వు నిజం అంటూ లేచి టేబుల్ చుట్టూ గెంతుతూ తన సంతోషాన్ని ప్రకటించాడు. ఆయన తను నవ్వుతూ చూస్తుండిపోయాడు అంతా అనుకున్నట్టుగానే నీరజ అరుణ్ పెళ్లిని దగ్గర ఉండి జరిపించాడు కిరణ్. అతనికి అన్ని బాధ్యతలు అప్పగించాడు అరుణ్, ఆఫీసు సహాయంతో గుడిలో ఒక్కటయ్యారు అరుణ్ నీరజలు. తన చేతులతో తన నేస్తం పెళ్లి చేసిన సంతోషంతో మునిగితేలాడు కిరణ్. వారి దాంపత్యం మొదలైంది సంతోషంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న వారి సంసారం సరిగమలు రెండేళ్ళలో నీరజ ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. వారిని చూసి అందరూ మురిసిపోయారు. వారిద్దరికీ లతా, గీత అనే పేరు పెట్టుకున్నారు. అంతా ఒకే కుటుంబంలా ఒకే ఇంట్లో ఉండసాగారు.

కిరణ్ రజనిని వదిన అని వరస పెట్టి నోరారాపిలుస్తూ పనుల్లో సహాయం చేస్తుండే వాడు. గీత పుట్టిన రెండేళ్లకు కిరణ్ కి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు అరుణ్, నీరజలు. పెళ్లి అయినా కూడా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు కిరణ్ భార్య కూడా అనుకూలవతి కావడంతో ఏ అరమరికలు అనుమానాలు లేకుండా సాఫీగా సాగిపోతున్న ఈ సంసారంలో కొన్ని రోజులుగా నీరజకు ఒంట్లో బాగుండటం లేదు. ఎప్పుడూ చూసినా ఆయాసపడుతూ ఉండేది. పిల్లలిద్దరూ చిన్నవాళ్లే అయినా తల్లిని విసిగించకుండా ఉండేవారు. పాపం కిరణ్ భార్యనే అన్ని పనులు చేసేది. దానికి నీరజ బాధపడుతుంటే అక్క నాకు జీవితాన్ని ఇచ్చారు నేను కృతజ్ఞత చూపిస్తున్నాను అనుకో ఇదే పెద్ద కష్టం కాదు కదా నా కుటుంబానికి నేను చేస్తున్నా అనేది గిరిజా. ఆమె కూడా అనాధే, కాకపోతే అందరూ ఉన్న అనాధ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే బాబాయి దగ్గర పెరిగింది.

కష్టం, సుఖం, ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు, కరువైన మనిషి. ఒక్కసారి నీరజ ప్రేమని చూపించడంతో ఆమెని దేవతల భావిస్తుంది గిరిజ. నీరజకు కాకపోవడం నీరసంగా ఉండడంతో దగ్గరలోని డాక్టర్ గారిని సంప్రదించి మందులు టానిక్కులు ఇప్పించాడు అరుణ్. ఆమెకు ఏమాత్రం తగ్గలేదు అలా రెండేళ్లు వాడిన మందుల తిరిగి తిరిగి వాడుతూ బలమైన ఆహారం పెట్టినా కోలుకోలేక పోయింది.

నీరజ చివరికి ఆ ఆసుపత్రి కాకుండా వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపించాడు అరుణ్ కిరణ్ లు. అక్కడ డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి చివరికి క్యాన్సర్ అని తేల్చి బాగా ముదిరిపోయింది అని ఇప్పటివరకు ఏం చేశారని చివాట్లు పెట్టి, చేయాల్సింది ఏదీ లేదని ఇంటికి తీసుకెళ్ళమని అనడంతో, అరుణ్ బాగా కృంగిపోయి ఇంటికి తీసుకొని వచ్చాడు. అప్పటిదాకా ఉన్న సంతోషం అంతా మాయమైపోయింది ఆ ఇంట్లో. ఎప్పుడూ కలకలలాడుతూ నవ్వులతో నిండి ఉండే ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. ఎవర్ని కదిలించినా ఎవరికీ ధైర్యం చాలడం లేదు గిరిజ, పిల్లలకు బలవంతంగా వండి పెడుతుంది. ఈ సంగతి నీరజ తన జీవితాన్ని మధ్యలోనే తీసుకెళ్తున్న దేవుడిని ఎన్నోసార్లు వేడుకుంది తనని బతికించమని. కోరి చేసుకున్న భార్య పిల్లలకు తల్లి దూరం చేయవద్దని తన ఇంటి దీపాన్ని ఆర్పి వేయవద్దని పదే పదే కోరుకుంటున్నాడు అరుణ్.

కానీ, ఆ భగవంతుడు వారి మొర విని ఉంటే కథ ఇంకోలా ఉండేది. సుఖాంతం అయ్యేదేమో కానీ, విధి బలీయమైనది అంటారు కదా అలాగే కాలానికి కన్నుకొట్టి దేవుడికి సంతోషంగా ఉండేవాళ్ళు నచ్చక ఆ దేవుడు రాసిన పాత వల్లే ఓ రోజు రాత్రి ఎవరికీ ఏమీ చెప్పకుండానే నీరజ నిద్రలోనే కన్నుమూసింది. తెల్లారి అది చూసిన అరుణ్ గుండె పగిలింది కన్నీరు, మున్నీరుగా ఏడుస్తూ భార్యని వదలలేక వదలలేక వదిలి వచ్చాడు స్మశానంలో పిల్లలిద్దరూ తల్లిలేని అనాధలయ్యారు గిరిజ వారికి ఇప్పుడు వారిని జాగ్రత్తగా పెంచుతుంది. రోజులు గడుస్తున్నాయి, అందరూ నీరజని మర్చిపోతున్నారు కొంచెం కొంచెంగా… పిల్లలు బడిలో చేరారు అరుణ్ మాత్రం కృంగి కృశించి పోతున్నాడు రోజు రోజుకి… అప్పుడు ఆఫీస్ కి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేవాడు. కాని, ఇప్పుడు ఆఫీస్ నుండి తిన్నగా స్మశానానికి వెళ్తాడు. తనకి ఇష్టమైనవి తీసుకుని స్మశానంలో ఆమె సమాధి ముందు కూర్చుని కబుర్లు చెప్తూ తాను తెచ్చినవి ఆమెకు చూపిస్తూ ఉంటాడు.

మొదట్లో ఇది మానిపించాలి అని కిరణ్, గిరిజాలు చాలా ప్రయత్నించారు. కానీ, అరుణ్ అరేయ్ నేను చాలా ప్రేమించాను ముందు వద్దు అనుకున్న కానీ పెళ్లయ్యాక తనని ప్రాణంలా చూసుకున్నా నాకు అన్నీ తెలుసు నేనేమీ పిచ్చి వాడిని కాదు. కానీ, నా నీరజ లేకుండా ఉండలేను దయచేసి నన్ను ఆపకండి అని కచ్చితంగా చెప్పడంతో ఏమీ అనలేక పోయారు. వాళ్లు ఇక అరుణ్ రోజు సాయంత్రం వెళ్లడం అతని దినచర్య లో భాగమైంది, నీరజ చనిపోయి సంవత్సరం కావస్తుంది. ఆరోజు సంవత్సరికం గిరిజా, కిరణ్ ఆమెకు శాస్త్ర ప్రకారంగా జరగాల్సిన వన్నీ జరిపారు. అరుణ్ పిల్లలతోనూ అందరికీ జ్ఞాపకార్థంగా చీరల అన్నదానాన్ని చేయించారు. అంతా అయ్యాక అరుణ్ ఇష్టమైన బట్టలు, స్వీట్లు, తీసుకొని పువ్వులు, కూడా తీసుకుని అరుణ్ ఆమె సమాధి వద్దకు పయనమయ్యాడు. మేము వస్తాం అంటూ లలితగీతాలు ఇద్దరు కూడా అతని వెంట నడిచారు. కానీ, వారిని పట్టించుకోలేదు ముందుకు సాగిపోయాడు. సమాధి దగ్గర కూర్చొని ఆమెతో గడిపిన మధురమైన రాత్రులను కబుర్లను గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా పెద్ద పెట్టున బోధించడం మొదలుపెట్టాడు.

అరుణ్ అప్పటివరకు దాచుకున్న దుఃఖం అంతా బయటకు తన్నుకు రాసాగింది. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఒక్కసారిగా సమాధి పైన ఒరిగిపోయాడు అరుణ్ పిల్లలు అది చూసి నాన్న నాన్న అంటూ దగ్గరికి వచ్చి పిలిచారు. కానీ, అరుణ్ పలకలేదు అతని బలహీనమైన గుండె నీరజను వెతుక్కుంటూ వెళ్లి పోయింది. పిల్లల వెనకాలే వచ్చిన కిరణ్ గిరిజలు ఆ దృశ్యం చూసి అవాక్కయ్యారు.. అనాధలైన ఆ చిన్నారులు ఇద్దరిని అక్కున చేర్చుకున్నారు. బాధగా నీరజ అరుణ్ అజరామరమైన ప్రేమకు తార్కాణం గా నిలిచిన సమాధి చూస్తూ ఆ దంపతుల పవిత్ర ప్రేమకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి పిల్లలను తమ పిల్లలుగా పెంచాలని తమ పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నారు ఆ ఆదర్శదంపతులు…

Related Posts

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *