నేటి అంశం
ఆశించకు
శీర్షిక
ఆశించకూడనివి ఏమంటే…
ఆశించినవి అన్నీ జరగవు.
అలా జరగలేదని నిరుత్సాహ
పడితే ముందడుగు వెయ్యలేం.
ఆశించినవి దక్కించుకోవాలంటే
తీవ్ర ప్రయత్నం చెయ్యాలంతే.
ఇక్కడ ఒక విషయం అందరూ
తప్పక గమనించాల్సి ఉంది. ఇతరుల నుండి కొన్ని-కొన్ని ఆశించకూడనివి కూడా ఉంటాయి. ఇతరుల డబ్బును
తన సొంతం చేసుకోవాలనే
తపనతో వారిని మోసం చేసి
వారి డబ్బులు పొందాలని అనుకోకూడదు. అలా కనుక
ఆశిస్తే అది అధర్మం అని మన
పూర్వీకులు పురాణాల్లోనే అనేక కధల ద్వారా చెప్పారు.
అలాగే తన భార్య కాకుండా
వేరొక స్త్రీను లోబరుచుకోవాలి
అని ఆశించటం కూడా తప్పే.
పరాయి ఇంటిలోని మహిళలు
తల్లితో సమానం. అటువంటి
వారి పట్ల కోరికతో రగిలిపోయి
చేయకూడని పనులు చేయటం
కూడా అధర్మం. ఇతరుల యొక్క కాంతా- కనకాలపై కన్ను వేసి అవి పొందాలని
ఆశిస్తే చరిత్ర హీనులు అవుతారు అని చరిత్రలో
అనేక సార్లు ఋజువైంది.
ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని