"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

నేటి కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ….జనాభా పెరిగే కొద్ది

అంశం:⁠- నేటి కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ
శీర్షిక:⁠- జనాభా పెరిగే కొద్ది

                           ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి వస్తువు ట్యాక్స్ సామాన్యుడు మీద పడుతుంది ఇప్పుడు కొత్తగా పెట్టిన జిఎస్టి అందులో కట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కూడా దొరికిపోయారు. జనాభా పెరిగే కొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూనే ఉంటుంది కానీ అంచనా వేస్తే మాత్రం సామాన్యుడు మీద ఎక్కువ భారం పడుతుందని నేను భావిస్తున్నాను.

ఒక గవర్నమెంట్ ఉద్యోగి జీతం వస్తే మాత్రం అన్నిటీకి పోను 500 కూడా మిగలడం లేదు.
మరికొందరు డబ్బులు వెనక వేసుకోవాలని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎప్పుడు రేటు  డౌన్ అవుతుందో తెలియదు ఎప్పుడూ పెరిగిపోతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడం మీకు మీ కుటుంబానికి మంచిది కాదు.

మొదటి వరకు గ్యాస్ రేటు తగ్గించమని పోరాటం చేస్తే మొన్న ఈ మధ్యనే తగ్గింది అది 1000 రూపాయలు. అన్ని రేట్లు ఆకాశాని అంటి ఉంటే సామాన్యుడు కుటుంబం బతకడానికి చాలా కష్టపడుతుంది.

భవిష్యత్తులో దేశ జనాభా పెరిగిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కొన్ని అన్వేషణ చేసిన సంస్థలు చెప్తున్నాయి.

ఇలాగైతే మధ్యతరగతి కుటుంబాలు బతకడం కొంచెం కష్టం భారంగా అవుతుందేమో.
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని జాతీయ గణాంక కార్యాలయం అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే కూడా ఇది తక్కువే. దీంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను.. భారత్ కోల్పోయే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

కోవిడ్ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడింది ప్రభుత్వం.
కొందరు ఆకలితో చనిపోతే మరికొందరు కోవిడ్ తో చనిపోయారు. కొందరు ఆర్థిక పరిస్థితులు బాలేక చనిపోయారు.

ఇలా ఎన్నో సంఘటనలు ఒకటనే కాదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేశా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిన భవిష్యత్తులో మాత్రం జనాభా పెరిగే కొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలదొక్కుకోవడానికి మనం ఎంతో కష్టపడాలి అని నిపుణులు ద్వారా అర్థమవుతుంది.

 

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                     ఈ వ్యాసం నా సొంతమని హామీ ఇస్తున్నాను..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *