నేటి పిల్లలు

అక్షర కొరకు
అంశం – నేటి పిల్లల ప్రవర్తన సామాజిక బాధ్యతలు
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – నేటి పిల్లలు

నేటి పిల్లలు సమాజం లో
సత్ ప్రవర్తన కలిగి ఉండడం లేదు
విచక్షణ కోల్పోతున్నారు
చదివి ప్రయెాజనం లేనట్టే!

దీనికంతా కారణం ఏంటంటే
ఒక్కరు లేక ఇద్దరినే కనడం
అల్లారు ముద్దుగా తల్లి తండ్రులు
పెంచడం గారాబం ఎక్కువవడం!

అదొక్కటనే కాక సామాజిక
మాధ్యమాలు ఎక్కువవడం
ఫోన్లు, ల్యాప్ టాప్ ల వాడకం
అన్ని ఆటలు వాటిలోనే ఆడడం!

ఈ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువుల
వలన పిల్లలు వాటికి ఆకర్షితులై
మనుషుల తో బంధాలను
కోల్పోతున్నారు ఒంటరి జీవితానికి
అలవాటు పడుతున్నారు!

చదువుల మీద శ్రద్ద లేదు
ఒకవేళ చదివినా బుర్ర లో మాత్రం
ఫోన్ల లోని ఆటలే తిరుగు తున్నాయి
వాటి ఆకర్షణ అంతలా ఉంటుంది!

మర్యాద మన్ననలు మరుస్తున్నారు
రఫ్ గా తయారవు తున్నారు
సామాజిక బాధ్యతలేమీ ఉండడం లేదు
ప్రతి పిల్లల తల్లి తండ్రులు తమ పిల్లలకు
ఫోన్లేమీ ఇవ్వ కుండా తగిన జాగ్రత్తలు
తీసు కోవాలి!

ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *