నేటి ప్రేమ కథ
ఎంత అని అడిగాడు వరుణ్ మూడు వేలు అంది శ్రీజ, హ సరే ఇదిగో కార్డ్ తీసుకుని వేళ్లి ఇచ్చెయ్యి అని కార్డ్ ఇచ్చాడు.
సరే నంటూ వెళ్లి పే చేసి వచ్చింది శ్రీజ. ఇంకా ఎంత ఇవ్వాలి నీకు అడిగాడు వరుణ్ హ అంటే ఇంకా పదమూడు వేల నూట యాభై రూపాయల పదిహేను పైసలు ఇవ్వాలి అని అంది శ్రీజ.
అబ్బా పైసల తో సహా ఎందుకే చెప్పడం ఇస్తా లే అన్నాడు వరుణ్, ఇస్తావు అనే కదా నీ లవ్ కి ఒప్పుకుంది అంది శ్రీజ.
అవును తల్లి అవును నా స్నేహితులతో నాకు లవర్ ఉందని చెప్పడం వల్ల నిన్ను కలవక తప్ప లేదు. నాకు నాకు రెండు నెలలు లవర్ గా ఉండడానికి నువ్వు చెప్పిన అమౌంట్ ఇవ్వక చస్తానా అన్నాడు వరుణ్ నెత్తీ కొట్టుకుంటూ, హ మరి ఎందుకమ్మా ఫ్రెండ్స్ తో బిల్డప్ లు ఇవ్వడం నేను అడిగానా ఏంటి, నువ్వే నువ్వే కదా నాకు లవర్ ల ఉండు అని బతిమలింది అంది శ్రీజ.
అవును ఈ మధ్య మా స్నేహితులలో లవ్ చేసి,లవ్ లో ఓడిపోయిన వారికి మంచి మర్యాద ఇస్తూ,వారిని గొప్పవాళ్ళు గా చూస్తున్నారు, అందుకే కద నేను లవ్ చేసాను అనుకో మా ఇంట్లో వాళ్ళు నన్ను తంతారు.
పైగా మనకు మార్కెట్ లో మంచి ధర ఉంది .అది రాదు మరి ప్రేమిస్తే అందుకే ఇలా డబ్బించి నిన్ను సెట్ చేసాను. అన్నాడు వరుణ్.
నేటి ప్రేమ కథ
ఏంటో మీ మగాళ్ల కి ఒక లవర్ కావాలి,దాంతో అన్ని సరదాలు తీరాలి,కానీ పెళ్లి మాత్రం బాగా కట్నం వచ్చే అమ్మాయే కావాలి, ఆమె ఎవరితోనూ తిరగ కూడదు. ఏ లవ్ స్టోరీస్ ఉండకూడదు.
ఒక వేళ ఉన్నా మీకు తెలియనంత వరకు మీరు హ్యాపీగా ఉంటారు. ఒక వేళ తెలిస్తే మాత్రం ఊరుకోరు, గొడవలు పడతారు. వారికి ఒక వేళ డబ్బు ఎక్కువగా ఉంటే ఇంకా గుంజుతారు అంతే గా మీరు చేసేది అంది శ్రీజ.
హ అవునమ్మా మరి మేమే ఎక్కువ మీరు తక్కువనా కాదుగా, మీకు కూడా ఒక లవర్ కావాలి ,వాడు బాగా డబ్బున్నవాడు కావాలి.
వాడితో షాపింగ్ లు అని, లాంగ్ డ్రైవ్ అని వీలయినంత డబ్బు గుంజి, తిరిగి, ఒక వేళ కమిట్ అయితే ప్రెగ్నెన్సీ అని మమ్మల్ని భయ పెడుతూ, మాతో చేయరని పనులన్నీ చేయించి, చివరికి ఏ NRI సంబంధం
రాగానే బుద్ధి మంతురాళ్ళు గా వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు కాదనే,ఇదే కదా ఇప్పుడు మీరు చేసే పని అన్నాడు వరుణ్…
హ లేకపోతే మీరు, మీ బోడి బైక్ ల మీద కూర్చుని, తిరిగిన దానికి అది వాడి లవర్, ఇది విడి లవర్ అని అనిపించుకున్న దానికి, మీతో బెడ్ షేర్ చెసుకున్నందుకు అవ్వన్ని టాక్స్ లన్న మాట…
అయినా మీతో ఎంత తిరిగిన లైఫ్ సెక్యూర్ ఉండదు, మీరు పెళ్లి చేసుకోరు కాబట్టి మిమల్ని నమ్మలేకనే మేము మా తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలు చూసుకుని పెళ్లి చేసుకుంటాం.
ఎవరైనా అంతేగా మీరు డబ్బు చూసుకుంటే,మేము భద్రత చూసుకుంటాం అంది శ్రీజ.
సరేలే ఈ రోజుల్లో ఇదంతా మాములు విషయమే అయ్యింది కానీ నీకు నాతో కలిపి ఎంత మంది బాయ్ ప్రెండ్స్ ఉన్నరే అన్నాడు వరుణ్, నికంటే తక్కువే లేరా అంది శ్రీజ.
ఓ అంటే పదకొండు మందా అన్నాడు వరుణ్, హహఅంటే నీకు పన్నేoడు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అంది శ్రీజ.
అవునే అంత మందిని మెంటనెన్స్ చేసావు కదా, డబ్బు బాగానే ముట్టిందా అన్నాడు వరుణ్, నీ ఫేస్ లేరా డబ్బు ఏంటి డబ్బు వాళ్ళు ఇచ్చిన డబ్బంతా వాళ్ళు పార్టీ లకి రమ్మన్నప్పుడు మేకప్ కి, డ్రెస్ లకు సరిపోతుంది.
ఇంకా నేనేం వెనక వేసుకుంటా, అవును నీకు కూడా బాగానే ఉందిగా, ని లవర్స్ అందరూ డబ్బున్న అమ్మాయిలు కదా అంది శ్రీజ. ఏం డబ్బో ఏమో నేనే వారికి గిఫ్ట్స్ కోసం ఖర్చు పెట్టాలి కదా అని నిట్టూర్చాడు వరుణ్.
అవును రా ఎలాగూ నీకు మీ వాళ్ళు ఎవరినో ఒకర్ని చూసి పెళ్లి చేస్తారు కదా, ఆ ఎవరినో చేసుకునే బదులు నువ్వు నా గురించి నీకు, నీ గురించి నాకు అన్ని తెలుసు కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఏమంటావు అంది శ్రీజ.
అమ్మో బాబోయి నిన్ను చేసుకుంటే ఇంకేమైనా ఉందా, నన్ను పూర్తిగా ముంచేస్తావు అన్నాడు భయంగా వరుణ్. నీ ఫేస్ అంటూ అతన్ని కొట్టబోయింది శ్రీజ. వద్దులే తల్లి ఆ తర్వాత మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తే కష్టం.
నీ దారి నీదే, నా దారి నాదే అని అంటూ, పక్కనే ఉన్న ఎటిఎం లోకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకుని వచ్చాడు వరుణ్. అతను వచ్చే వరకు ఐస్ క్రీమ్ తింటూ బండిపక్కనే నిలబండింది శ్రీజ.
అతను డబ్బు తేగానే చేతులు తుడుచుకుని అతను ఇచ్చిన డబ్బుని జాగ్రత్తగా లెక్క బెట్టుకుని పర్సులో వేసుకుంది. హ లెక్క సరిపోయిందిగా అన్నాడు వరుణ్ హ సరిపోయింది రా అంది శ్రీజ.
సరే ఇక నీ దారి నీది,నా దారి నాది,ఇక ముందు ఎక్కడైనా కనిపించినా,నా భార్యతో నేను,నీ భర్తతో నువ్వు కలిసి చూసినా ఎవరో తెలియనట్లు గా ఉండాలి, అర్థం అయ్యిందా అన్నాడు వరుణ్ ..
సరే రా ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అడిగింది శ్రీజ. హ ఏముంది నువ్వు నాకు బ్రేకప్ చెప్పావు అని దేవదాసు అవతారం ఎత్తడం, ఆ తర్వాత కొన్నాళ్ళకు అమ్మా వాళ్ళు చూసిన దాన్ని పెళ్లి చేరుకోవడం అని నిట్టూర్చాడు వరుణ్ , సరే నాకు టైమ్ అవుతుంది బై, అని బైక్ స్టార్ట్ చేసాడు వరుణ్,ఓకే బై అని అంది శ్రీజ . ఇద్దరి దారులు వేరయ్యాయి….
ఇది నేటి ప్రేమ….
ఇప్పుడు ప్రేమ కధలు ఇలాగే ఉంటున్నాయి
అని అందరూ అనుకుంటున్నారు.