నేటి విజ్ఞానం జ్ఞానులు ఎవరు !!??!!

నేటి విజ్ఞానం జ్ఞానులు ఎవరు !!??!!

నేటి విజ్ఞానం,,,, జ్ఞానులు ఎవరు !!??!!

గొంతు సవరించుకుని జీవనరాగాలను గానం చేద్దామంటే,,,,
వయస్సు ముదిరి అపశ్రుతి రాగాలే పలుకుతున్నాయి,,,,
ఈ వయస్సులో గతితప్పిన జీవనస్థితిగతులు ఆవేదనలలో కొట్టుమిట్టాడే దుఃఖిత సంఘర్షణలలో మనస్సు గూడు,,,,,
నా చుట్టూర నిస్తేజంగా యువతరం కుళ్ళిన సమాజం గొడుగు కింద జీవనం సాగించే అపశ్రుతి క్రీనీడలు,,,,,
నిద్రాహారాలు మాని విలువలు కోల్పోయిన చదువులు ఆత్మ కోల్పోయిన ఆకులు రాలిన అడవి మోడు మాను,,,,,
నేటి విజ్ఞానం అధ్యయనం ఏమిటికీ కొరగాని వెర్రిమొర్రి థియరీలను బట్టీయం వేస్తూ ర్యాంకుల కోసం ఆకలి దప్పికలు మాని అహరహం శ్రమలు,,,,,,
కోరుకున్న సీటు కోసం, ఉద్యోగం కోసం నిలువునా తెగిపడుతూ ఇంటి పరిస్థితులు గుర్తెరిగి తీతువు తీసే రాగాలలో అగ్ని మింగే సిగరెట్లలో ఆకాశం కూలిపడేలా హృదయంలేని సంజ్ఞల గారడీ గణితం ఏ మేధావో కనిపెట్టిన సిద్ధాంతాల మూలాలు లాబ్ టాప్ లలో నిక్షిప్తమైన అనవసరమైన జ్ఞానమనుకునే మూర్ఖత్వానికి నేటి యువతరం బలి,,,,,,,
మానవత్వం ప్రబోధాలు లేని, తాను జీవించే విధానం నేర్పే గుణపాఠాలు ఏంటయ్యా అంటే తను భార్య పిల్లలు ఉద్యోగాలు అదే లోకం ఫారన్ కోళ్లు బ్రతుకులు,,,,,,
ఇలాంటి బ్రతుకులు నిస్తేజంగా యాంత్రికంగా సాగిపోయే జీవిత పోరాటంలో ప్రతి వ్యక్తి ఒంటరే ఈ అసంబద్ధ సమాజం తెగిన సంబంధాల మధ్య పొత్తు వీకెండ్ పార్టీలలో,,,,,,,
జ్ఞానులు విజ్ఞాన గనులు మనస్సు గూళ్ళు సమాచారంతో నిండిన జ్ఞానమనే జ్ఞాపకాల ఊబి,,,,,
సెలయేటి గలగలలు గాని,సంపెంగపూవులు గాని ప్రకృతి శాస్త్రం గానీ మూర్తీభవించిన మనవ సంబంధాలు తెలియని నేటి యువతరం, నవతరం,,,,,,

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *