నేటి సమాజ స్థితి
నేటి సమాజం లో దుష్టులు
దుర్మాప్గులు ఎక్కువయ్యారు
వెనుకట రాక్షసులంటే కొమ్ములు
పెట్టుకుని భయంకరంగా ఉండే
వారని చదువుకున్నాం! అలానే
ఊహించుకున్నాం!
కానీ ఇప్పుడు మామూలు మనుషులు
గానే ఉంటున్నారు! కానీ మనసుల
నిండా విషమే! భూములను కబ్జాలు
చేస్తున్నారు! మనుషులను దోచుకుంటున్నారు
సాటి మనిషే కాదాని నమ్మితే సర్వం ముంచడమే!
వెనుకటికి శరీరాలు చూసి వీల్లు రాక్షసులని
గుర్తించే వాల్లం! దూరం ఉండే వాల్లం! ఇప్పుడు
గుర్తించడం చాత కావడం లేదు!
దుష్టులని తెలియకుండా మంచి ముసుగు వేసుకుని
మెాసం చేస్తున్నారు! కబ్జాసురుల నుండి జర జాగ్రత్తండి!
ఉమాదేవి ఎర్రం