నేనున్నాను

జీవితం విలువ తెలియలంటే గొప్ప గొప్ప చదువులు  చదవడం, ఉన్నత స్ధాయిలో ఉండడం , చేతినిండా డబ్బు ఉండడం కాదు , కష్టపడితే ఫలితం దానంతటా అదే వస్తుంది , ప్రేమ ఆప్యాయతలు ఉంటే  అని నమ్మి ముందుకు సాగిన 15 ఏళ్ళ యువకుడి కథే నేనున్నాను . ఇక కథలోకి వెళ్ళితే

తెల్లవారు జామునే చలికాలం కావడంతో , నీళ్ళు వేడిచేసుకుందామని కట్టేల పోయి మీదా నీటిని కస్తుంది కనకం , మొగుడు యాక్పిడేంట్ లో కాళ్ళు పోగోట్టుకొని పనికేళ్ళాక ఇంటికి అకింతం అయ్యాడు . కనకమ్మ ఇంటికి కాస్త దగ్గరల్లోనే పంకజాక్షి ఉండేది , ఇద్దరు మంచి స్నేహితులు పెళ్ళిళ్ళు అయ్యక అత్త వారింటికి కాపురానికి వచ్చాక ఇరుగు పోరుగు కలిసి మాట్లుడుకోవడం వల్ల మంచి స్నేహితులయ్యారు.

పంకజాక్షి  కాపురానికి వచ్చినప్పటి మాట ఇప్పుడు కనకం ఇళ్ళు ఎలా ఉందో వాళ్ళది అలాగే ఉండేది గుడిసె లాగే  కాని కోడలు వచ్చిన వేళా విశేషం అంటూ పంకజాక్షి  అత్త తను రాగానే రాముడికి కలిపి వచ్చిందని సంబరపడేది . (పంకజాక్షి భర్త రాముడు ) కొన్నాళ్ళకి గుడిసె నుండి ఒక రెండు చిన్న గదులు నిర్మించుకున్నారు . కాలం అలా ముందుకు సాగుతుండగా కట్టేలపోయ్యి పోయి గ్యాస్ సీలిండర్ వచ్చింది . భర్త ఎంత చెప్పిన కూడా వినకుండి యమరుపాటుగా గ్యాస్ కట్టేయడం మరిచి పోయింది పంకజాక్షి .

తన అజాగ్రత్త వల్ల తన కుటంబాన్నే కాదు , పక్కనే ఉన్న కనకం కుటుంబాన్ని కూడా మంటల్లో కాలేలా చేసింది . అదృష్టవశత్తు కనకం కోడుకు రాంబాబు ( 10 ఏళ్ళు ) పంకజాక్షి  కోడుకు సూరి (5 ఏళ్ళు  ) ఇంటికి కాస్త దూరంలో ఉన్న గ్రౌండ్ లో ఆడుకుంటు ఉండడంతో వీరి ఇద్దరు బతికుతారు . చుట్టాలంతా వచ్చి చావు అయిపోయాక ఎవరి దారిని వారు వెళ్ళిపోతుంటారు , ఇక రాంబాబు సూరిని చేరదీసి సొంత తమ్ముడిలాగే చూసుకుంటాడు .

చేతికి దోరికిన పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో చిన్న గుడిసే వేసుకుని తమ్ముడిని ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేస్తాడు మధ్యాన భోజనం స్కూల్లో తమ్ముడి ఆకలి తీరుతుంది , మరి పొద్దున్న మధ్యాహ్నం అంటూ ఒక చిన్న మెస్ లో హెల్పర్ గా జాయిన్ అవుతాడు , అక్కడ యజమాని డబ్బలు ఇవ్వను నీకు నీ తమ్ముడికి రెండు పుటాల భోజనం పెడతానంటూ ఓప్పందం కుదుర్చుకుంటాడు  

అలాగే నంటు పూట తను పస్తులున్న పర్వాలేదు తమ్ముడికి భోజనం పెడితే చాలని తమ్ముడి కోసం కష్టపడతాడు , కాలకమ్రేనా తమ్ముడు పెద్దవాడు అవుతుండడం వేసుకోవడానికి బట్టులు లేక కోనడానికి డబ్బులు లేక వారి యజమానిని భోజనాలు వద్దని తనకు నెల జీతం ఇవ్వాలంటూ మాట్లుతాడు , అయిదేళ్ళఉగా పనిచేస్తున్నావ్ కడుపు నిండా నువ్వు మేక్కి మీ తమ్ముడికి తీసుకెళ్ళతున్నావ్ డబ్బ్లులు అడుగుతావా అంటూ పని నుండి తీసేస్తాడు . ఏం చేయ్యాల్లో అర్ధం కాని పరిస్ధితుల్లో రోడ్డు మీదా ఎడుస్తు వెళ్ళుతున్న రాంబాబుని ఉరి సర్పంచ్ చూసి జరిగింది తెలుసుకోని తన బంగ్లాకూ కాపలదారుడిలా పెట్టి తనకి తన తమ తమ్ముడు ఉండడానికి చిన్న గదిని ఇచ్చి నెలకి 2500 జీతం గా ఇస్తాడు .

అయిదేళ్ళుగా కష్టపడ్డ పది రూపాయల నోటు ని కూడా చూడలేని రాంబాబు , ఒక్కసారిగా 2500 చూడాగానే తన అయిదేళ్ళ ఫలితం అంటూ తమ్ముడికి నాలుగు జతలు,తనకి రెండు జతల బట్టలు చెప్పులు కొని ఉన్న దాంట్లోనే  సర్ధుకుంటాడు . తను మేస్ యజమాని చనిపోయాడని తెలుసుకోవడంతో వెళ్ళి చూసి వస్తాడు, అక్కడ మేస్ యజమాని కోడుకు నువ్వు మళ్ళీ పనిలోకి రా నీకు 5000 జీతం ఇస్తానంటూ ఆశ పెడుతాడు .

ఇంకా కాస్త జీతం పెరిగింది తమ్మడుని ఇంకా బాగా చూసుకోవచ్చు అని ఆశతో ఇంటికి వెళ్ళిన రాంబాబు కి అక్కడి దృశ్యం చూసి కంటితడి పెట్టుకుంటాడు,దానికి కారణం సర్పంచ్ తను తినే వేండి గిన్నేలో అన్నన్ని తన తమ్ముడిని ఓడిలో పెట్టుకుని తినిపించే దృశ్యాన్ని చూసిన రాంబాబు తన తప్పు తెలుసుకోని సర్పంచ్ ఇచ్చే 2500 లకే పనిచేస్తాడు .

అలా ఏమి కాని సూరికి అన్నలా మారిన రాంబాబు నీకు నేనున్నాను అని తోడుగా వుంటే జీవితంలో ముందుకి ఎలా వెళ్ళాలో తెలియని స్ధితిలో ఉన్నప్పుడు రాంబాబు చెయ్యి పట్టుకుని నేనున్నాను రా అంటూ చెయ్యి పట్టుకుని తీసుకోచ్చిన సర్పంచ్ ని దేవుడిలా కొలిచాడు . ప్రేమ , ఆప్యాయత కన్న డబ్బు స్ధానం గొప్పేం కాదని గుర్తిస్తాడు రాంబాబు.

                                                                            …………………. ముత్యాల కీర్తన

 

 

Related Posts