నేను కూడా రక్షగా ఉంటాను

అక్షర కొరకు
అంశం :⁠- రాఖీ పౌర్ణమి(చిత్ర కవిత)
తేది:⁠- 31/08/2026
శీర్షిక:⁠- నేను కూడా రక్షగా ఉంటాను

                    స్వాతి తన అన్నయ్యకి రాఖీ కడుతుండగా... రమేష్ తన బాస్ ఫోన్ చేశాడని వెళ్ళిపోతాడు. 

“రేయ్! అన్నయ్య రాఖీ సరిగ్గా కట్టని ఇవ్వరా! అని స్వాతి వెనకాల నుండి అరుస్తున్నా విడిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అక్కడే గేట్ దగ్గర రాఖీ పడిపోయింది అది చూసుకోకుండా వెళ్లిపోయాడు రమేష్.
ఒక్క చెత్త ఏరుకుని అతను(కిషోర్)స్వాతి , రమేష్ అని చూశాడు.
గేట్ దగ్గర పడిపోయిన రాఖీని స్వాతి తీసుకుంటే…
“ఆ రాఖీ నాకు ఇస్తావా అమ్మ! నేను కట్టుకుంటాను” అని అడుగుతాడు కిషోర్.
“నువ్వు కట్టుకుంటావా!” అని ఆశ్చర్యంగా అడిగింది స్వాతి.
“నాకు ఎవరూ లేరు అందుకే నేను కట్టుకుంటాను. అందరి చేతికి చూసినప్పుడల్లా రాఖీ ఉంటుంది” అని బాధగా అంటే…
“నేను కడతాను” అని కిషోర్ చేయి పట్టుకుని స్వాతి కడతాను అంటే…
“అయ్యో పర్లేదు అమ్మ! నేను కట్టుకుంటా” అని కిషోర్ అంటాడు.
“చెల్లెలు రాఖీ కడతానంటే… వద్దు అనకూడదు” అని చెప్పి రాఖీ కడుతుంది స్వాతి.
స్వాతి చేత కన్నీళ్లతో కిషోర్ రాఖీ కట్టించుకుని , స్వాతికి డబ్బులు ఇవ్వడం కోసం తన సంచి మొత్తం వెతుకుతూ ఉంటే… 10 రూపాయల బిల్లలు కనిపిస్తాయి రెండు. అవి స్వాతి చేతికి ఇస్తూ ఉంటే…
“అయ్యో వద్దు…!” అని అంటే…
“అన్నయ్య ఇస్తే తీసుకోవాలమ్మా!”అని చెప్పి తన చేతిలో పెడతాడు కిషోర్.
తర్వాత తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి తలవంచితే…
“అయ్యో అన్నయ్య ఏంటిది…?”అని స్వాతి అంటే…
“వచ్చే జన్మలో అయినా నాకు అందరూ ఉండాలని ఆశీర్వదించండి” అని అంటాడు కిషోర్ కన్నీళ్ళతో.
“నీలాంటి అన్నయ్యకి నేను చెల్లెలిగా పుట్టాలని కోరుకుంటున్నా అన్నయ్య” అని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటుంది స్వాతి.
అలా ఒక అన్నయ్య చేతినుండి జారిపోయిన రాఖీ మరో అన్నయ్య చేతికి చేరింది.
తనకి ఒక చెల్లెలు ఉంది అనుకోని కిషోర్ ఆనందభాష్పాలతో వెళ్ళాడు.
అప్పుడప్పుడు కిషోర్ తనని చూడడానికి వస్తూ ఉంటే కడుపు నిండా భోజనం పెట్టి పంపించేది స్వాతి.
నేను కూడా నీకు రక్షగా ఉంటాను అని తన మనసులోనే ప్రతిజ్ఞ చేసుకుని స్వాతి.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *