నేను మనిషిని కానా ??

ఏమండీ లేవండీ ప్రొద్దున్నే ఆఫీస్ కి వెళ్ళాలి లేపమని అన్నారు కదా లేవండీ అని అంటూ భర్తని లేపుతుంది మంజుల హే కాసేపు ఆగు లేస్తాలే ప్రొద్దున్నే నీ దరిద్రపు మొహాన్ని చూపించకు అవతలికి వెళ్ళు అని అటువైపు తిరిగాడు మోహన్

ఎంతో ప్రేమగా భర్తని లేపాలని వస్తే అతను అలా కసురుకోవడంతో మనస్సు చివుక్కుమంది మంజులకు అలాగే బయటకీ నడిచింది. పది నిమిషాలు అవ్వగానే ఎయి దరిద్రపు దానా ఎక్కడ చచ్చావే బ్రష్ పేస్ట్ ఎక్కడ అని అనగానే గబగబా వచ్చి అవి అందించింది

అన్ని ఎదురుగా పెట్టాలని తేలియదా అంటూ కసిరాడు మొఖాన్ని చిరాకుగా పెట్టి మర్చిపోయాను అంది మంజుల. అంత మర్చిపోయే రాచకర్యాలు ఏం చేస్తున్నావ్ అంటూ బ్రష్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు మోహన్..

అతను వచ్చేలోపు టిఫిన్ టీ రెడి చేసింది. మోహన్ అరగంటలో రెడి అయ్యి బయటకు బ్యాగ్ తో వచ్చేశాడు. అతను షూస్ వేసుకుంటూ ఉండగా టిఫిన్ అందించింది మంజుల.

ఏంటి మళ్ళీ ఉప్మా నేనా ని మొహానికి అంత కంటే ఎక్కువ ఏమి చేయడం రాదు. చీ నిన్ను అనవసరంగా కట్టుకున్న.

కాకినాడ సంబంధం చేసుకున్నా బాగుండు అని అంటూ గబగబా అదే ఉప్మాని తినేసి టీ గ్లాస్ తీసుకుని ఒక గుక్క తాగి దాన్ని విసిరి అవతల కొడుతూ చీ కనీసం చాయి అయినా వేడిగా ఇవ్వాలని తెలియదా

నువ్వు నీ వేషాలు నేను వెళ్తున్నా రాత్రికి లేట్ గా వస్తాను. ఏదోటి వండి అక్కడ పారవేయకు నేను బయటే తిని వస్తా నీ తొక్కలో వంట నాకేం అక్కర లేదు అని పాక్కుంటూ వస్తున్న ఎనిమిది నెలల కూతుర్ని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు మోహన్.

అతను వెళ్ళాక కూతుర్ని ఎత్తుకుని తలుపులు వేసేసి కూతురికి పాలు పట్టే తను ఉన్న ఉప్మా తినేసి మోహన్ బట్టలు పాప బట్టలు అన్ని బకెట్ లో వేసి పాపని ఆడిస్తూ ఉతికేసింది అవన్నీ అయ్యే వరకు మధ్యానం కావడంతో

రాత్రి మోహన్ తినకుండా వదిలేసినా అన్నం ఫ్రిడ్జ్ లో ఉందని గుర్తుకు వచ్చి దాన్ని పెట్టుకుని తిని పాప పడుకోవడంతో. తను కూడా ప్రొద్దున సర్దకుండా వదిలేసిన ఇల్లుని సర్దేసి తడి గుడ్డ వేసి తుడిచింది.

తర్వాత స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళిబట్టలు విప్పుతూ ఉండగా తన శరీరం మిద మోహన్ వేసిన తీపి గుర్తులు కనిపించాయి అవి చూసిన మంజులకు తన బాల్యం పెళ్లి తరువాత మోహన్ తో గడిపిన జీవితం అన్ని గుర్తుకు వచ్చాయి… 

మంజుల కుటుంబం చాలా పేద కుటుంబం అక్కలకు పెళ్ళిళ్ళు చేసే సరికే ఆస్థి అంతా కరిగి పోయింది. మంజుల కన్నా ముందు ఒక అన్నయ్య విక్రం ఉన్నాడు.తనకు ఎల్..సి లో ఉద్యోగం వచ్చిందని తెలిసి ఒక సంబంధం వచ్చింది

పిల్ల ఒక మోస్తరుగా ఉంది.కానీ కట్నం ఇవ్వలేము అని మా పిల్లని మీ అబ్బాయి చేసుకుంటేమీ పిల్లని మా వాడు చేసుకుంటాడు కట్నానికి బదులుగా కుండ మార్పిడి పెళ్ళిళ్ళు చేసుకుందాం అని మధ్యవర్తి ద్వారా చెప్పించారు.

దానికి మంజుల తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.మంజులకు ఏమి చెప్పలేదు అసలు చెప్పే ఉద్దేశం కూడా వారికీ లేదుఆడవాళ్లకు ఏమి తెలియదుతెలియకూడదుకావలసినవి తెచ్చి పెడితే వండి వార్చే వారె అనే ఒక రకమైన మనస్తత్వం తో ఉన్నారు మొత్తం కుటుంబసభ్యులు వాళ్ళు.

అలాంటి ఒక కుటుంబంలో ఉన్న మంజుల పెళ్లి గురించికాబోయే వాడి గురించి కలలు ఏమి కనకుండానే పెళ్లి కుదిరింది అని చెప్పాడు తండ్రికనీసం కాబోయే వాడి ఫోటో ని కూడా చూపించలేదుకానీ మంజుల చిన్నది కాబట్టి ఏమి ఆలోచించక తన తండ్రిని అతని ఫోటో ఉందా నాన్న అని అడిగింది.

మాట వినగానే పక్కనే ఉన్న అక్కలు భయంగా చూసారు తండ్రిని ఎందుకంటే వారికీ కూడా అబ్బాయిని చూపించకుండానే పెళ్ళిళ్ళు చేసాడు తండ్రిఅడగాలి అనే కోరిక కూడా వారికీ రానివ్వలేదు

పెళ్లి అయ్యాక భర్తలు ఏమి చేసినా నోరు మూసుకునే ఉన్నారు వాళ్ళు.తండ్రికి కానీ తల్లికి కానీ ఏమి చెప్పలేదుఎందుకంటే కాపురానికి వెళ్ళే ముందే తల్లి పిలిచి అక్కడ ఏమి జరిగినా

చివరికి మీరు చనిపోయే పరిస్థితి వచ్చినా అక్కడే చావండికానీ అక్కడ సమస్యలు ఉన్నాయని ఇక్కడకి రావద్దు అని హితవు చెప్పడం తో నోర్లు మూత బడ్డాయి.

ఇక మంజుల అడగడం తోఅప్పటి వరకు మౌనంగా ఉన్న తండ్రి నోరుమూసుకుని ఎవన్నో ఒకన్ని చేసుకుని వెళ్ళిపో వాడేవడు బాగున్నాడా లేదా అని చూసుకునే వీలు నీకు లేదునాకూ అంత కన్నా మంచి వాడినే తెచ్చే తాహతుఆస్థి లేదు

కాబట్టి నువ్వు నేను చూపించిన వాడిని చేసుకో నోరు మూసుకునిఆడిది నోరెత్తుతుంది.ఏమే నీ తల్లి నీకు ఇదే నేర్పిందాదొంగ ముండా నీకు రాజ కుమారుడు వస్తాడా అని అంటూ తిట్టాడు తాను అంత కానీ మాట ఏమి అందో అర్ధం కాక బిక్కచచ్చి పోయింది మంజుల.

తల్లి తనని లోపలి తీసుకుని వెళ్ళి చూడమ్మా ఆడదానిగా పుట్టాక అవమానాలు సహజంఇవన్ని ఇక్కడే నువ్వు నీ అత్తారింటికి వెళ్ళాక నీకు నచ్చిన విధంగా నీ భర్తని మార్చుకోవచ్చు

అక్కడ అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందికానీ అక్కడ ఏవో చిన్న గొడవలు రాగానే ఇక్కడికి రాకు అని హితవు చెప్పింది.కొన్ని రోజులకు పెళ్లి జరిగి పోయింది పెళ్లి కొడుకుని చూడకుండానే

మొదట్లో తన భర్త మోహన్ చాలా బాగానే ఉండే వాడు పెద్దగా బాద్యతలు కూడా లేవుఉన్న ఒక్క చెల్లిని విక్రం కె ఇచ్చి చేసారు కాబట్టిఎదో చిన్న ఉద్యోగం తో తనని పోషిస్తూ ఉండేవాడు.

మొదటి సారి గర్భవతి అని తెలిసి చాలా సంతోషించాడుఅబ్బాయి పుట్టాలని అన్నాడు కానీ తను ఎవరో ఒకరు అని అందిఅతను బాబు పుడతాడు అనే నమ్మకంగా ఉన్నాడు

కానీ పాప పుట్టేసరికి అతని కోపం రెట్టింపు గా మరి తనని మనసికంగా శారీరకంగా ఎన్ని హింసలు పెట్టినా సహిస్తూఅలాగే పడి ఉంటుంది.

తల్లి చెప్పినట్లుగా ఇప్పుడు కాస్త ఓర్చుకుంటే నా ముందున్న జీవితం బాగుంటుంది అనే ఒక చిన్న ఆశ కానీ మంజులకు ఒకటే తీరని సందేహం ఎప్పుడూ వెన్నాడుతూ ఉంటుంది.

ఒక ఆడదానికి పుట్టిఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకునిఆడపిల్లకు తండ్రి గా మరే మగవాడు వాళ్ళని ఒక మనిషిలా కూడా ఎందుకు చూడడు అంత వివక్ష ఎందుకు ఆడదాని మిద

తన కన్నతండ్రిని అడిగిందా నన్ను కనండి అని వాళ్ళే కదా కన్నారుకన్నందుకు నాకు నచ్చిన బట్టచదువు కూడా నాకు చెప్పించలేదు

నాకే కాదు అక్కలకు కూడా అంతేఎవరికీ సరిగ్గా చదువు లేదుఅన్నయ్యని మాత్రం చదివించారు.తనకు నచ్చినవి ఏమి తమకు దక్కలేదు పైగా మాకేదో తోడి పెడుతున్నట్టుగా మాటలు మీకోసమే సంబంధం చూడడం మికే అన్ని అని మరి కన్నాక చేయకుంటే ఏమి చేస్తారు

సరే పెళ్లి చేయమని మేము అడగలేదుకట్నాలు ఇయ్యమని మేము అడగలేదుపోనీ అదయ్యాక అయినావాడు అంటే కట్టుకున్న వాడు తన్నినాకొట్టిన ఇదిగో ఇలా సిగరెట్ వాతలు పెట్టినా వాడి దగ్గరే పడి ఉండాలి తప్ప తల్లిగారింటికి వెళ్ళ కూడదు

ఇక కట్టుకున్న వాడికి అన్ని పనులు పని మనిషిలా చెయ్యాలివాడి కోరిక తీర్చాలి వాడి పైశాచిక ఆనందానికి బలి కావాలి కానీ వాడి స్నేహితుల ఎదుటకు రాకూడదుఎవర్తోనూ నవ్వుతూ మాట్లాడకూడదు

వాడి పెళ్ళాం వాడికే సొంతం కాని మంది పెళ్ళాలని మాత్రం ఆబగా కోరికగా చూస్తాడువాడి కోరిక కోసం వాడి దగ్గర పడుకుoటేనే కదా పిల్లలు పుట్టేదిమగ వాడు పుడితే నా కొడుకు అని అంటాడా

ఆడపిల్ల పుడితే ఎవడికి పుట్టిందో అంటాడా వాడిని కాదని ఎవడి దగ్గర పడుకుంటాం మేముఇంట్లో నుండి బయటకు కూడా వెళ్ళనివ్వని వాడు మమల్ని అనుమానిస్తాడు కానీవాడు పక్కింటి దాంతో నవ్వుతూ మాట్లాడినా మేము నోరుముసుకోవాలి

అసలు మేము మనుషులుగా వారికీ కనిపించమా నేను నా భర్త దృష్టిలో కానీతండ్రి దృష్టిలో కాని నేను మనిషిని కానా?? ఇదిగో ఇదే ప్రశ్న నాకు ఎప్పటి నుండో మిమల్ని అడగాలని అనుకుంటున్నాఅని గట్టిగా నిట్టూర్చిపాప లేవడం తో బాత్రూం లో నుండి బయటకు వచ్చింది మంజుల..

ఇది ఒక మంజుల కథనే కాదు ప్రపంచం ఇంత ముందుకు వెళ్తున్నాఎందఱో మహిళా మణులు అభివృద్దిని సాధిస్తున్నా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు కాదు కాదు ప్రతిరోజు ప్రతి నిమిషం ఎక్కడోఎదో ఒక మూల లో మనం ఆడదానికి అన్యాయం జరిగింది అని వింటూనే ఉన్నాం

చూస్తూనే ఉన్నాంఇక హింసా ఖండా ఆగదాదయచేసి మేము మనుషులమే అని గుర్తించండిమాకు అన్ని ఫీలింగ్స్ ఉంటాయిమాకు అన్ని భావాలను వెల్లడించే హక్కు ఉందని గుర్తించండిమమల్ని మనుషులుగా చూడండిఇది నా వేదన ఆవేదన ….

Related Posts