నేల తల్లి
నేల తల్లినై మానవులకు
ఆహారం ఇస్తున్నా!
రక రకాల రుచులతో కనీ
వినీ ఎరుగని పండ్లు, ఫలాలను
ఇస్తున్నా!
సస్య శ్యామలమైన పంట
పొలాలలతో వరి ధాన్యం అందిస్తున్నా!
పచ్చని ఆకు కూరలు, కూరగాయలు
నిత్యం నా నుండే తీసుకుంటారు!
స్వఛ్చమైన తీయని నీటిని కూడా
ఇస్తున్నా!
కమ్మటి రుచికరమైన అన్నం తింటూ
తియ్యని నీటిని తాగుతూ…
లొట్టలు వేసుకుంటూ…
చల్లని తల్లినైన నన్ను బాధిస్తున్నారు
ఈ కృతజ్ఞత లేని మానవులు!
వెన్నుపోటు పొడుస్తున్నారు!
ఎన్నో బాధలకు నేనోర్చుకుని వారికి
అన్నీ అందిస్తుంటే నాకిచ్చే ఫలం ఇదా?
అని నేల తల్లి ఏడుస్తుంది!
ఉమాదేవి ఎర్రం