అంశం:- నాకు తెలియదు
శీర్షిక:- పంజరంలో ఉన్న చిలక
నాకే తెలియకుండా
నాకు ఉన్న హద్దులు దాటి
తప్పు చేస్తున్నాను అని తెలుసుకోలేని స్థితిలో ఉన్నా
నాకే తెలియకుండానే నా స్వేచ్చగా జీవితాన్ని
పంజరంలో ఉన్న చిలకలా బందీ అవుతానని అనుకొలేని స్థితిలో ఉన్నా
సీతాకోకచిలుక లా ఉండే నేను ఇప్పుడు పంజరంలో ఉన్నా
ఆలోచన తాకిడి ఎక్కువ అయ్యి
అసలు నా జీవితం ఏంటో అనే స్థితిలో ఉన్నా క్షణాన
ఒక సంఘటనతో నాకు నా గమ్యం ఏంటో తెలిసిన క్షణాన
దాన్ని గురించి నాకు తెలియని ఎన్నో ప్రయత్నాలు చేసి మరీ తెలుసుకుని
పంజరం నుండి స్వేచ్చగా ఎగిరిపోవాలని ప్రయత్నం చేయగా
కానీ పంజరం ఉన్న చిలకకు ప్రపంచం ఎలాంటిదో
తెలుసుకోకుండా అందరినీ అమాయకంగా నమ్మి
మోసపోయింది..
చిలక తొందర పడి నిర్ణయం తీసుకుని స్వేచ్చగా ఎగిరిపోయింది..
అందరి నమ్మి నా జీవితం నాశనం చేసుకుంది..
బందీగా ఉన్న స్వేచ్ఛగా ఉండొచ్చు అని చిలకకు ఇప్పుడు అర్థమైంది..
తొందరపడి నిర్ణయాలు తీసుకుని జీవితం నాశనం చేసుకోకండి..
మాధవి కాళ్ల