కారడవిలో భయంకర క్రూరమృగాలు సంచరిస్తున్నట్లు మనస్సు పగిలి వక్కలైన అద్దం,,,,, ,
పచ్చని ఆకుల రంగు పులుముకున్న దెయ్యం ముఖం,,,,,,,
పసిపిల్లలకు ఆకుపచ్చని భూతం అగుపిస్తున్నట్లు తెల్లగా పూసిన చేమంతులు కళ్ళు,,,,,,,
పసుపు వన్నె పూవులు నాసికలకు పొగమంచు చలి తీవ్రమైన దుర్గంధ ఘాటు వాసన,,,,,,
నోటినుండి అలా అలా దవడలాడిస్తూ జంతువుల మాంసాన్ని బయటకు అగుపడకుండా పళ్ళ కోరలు లోపలనే చీల్చుకుని మింగుతున్న రాక్షసానందం,,,,,,,,,
పచ్చని చెట్లన్నీ మమ్ము అడ్డంగా నరికి జంతువులు సంచరించే అడవి,మా సహోదరులను సంహరించి అడవినంతా ఖాండవదహణం చేస్తూ వికటాట్టహాసం చేస్తున్న మానవ క్రూరమృగాలు మీరు బాగుపడరు,,,, ,,,,
మనస్సు దొబ్బితిని కళేబరాలు కాలుతున్న స్మశాన సంగ్రామం మీ పొగచూరిన ఇళ్ళు సమాధులపై నిర్మించుకోండి భావంతుల మీద భవంతులు నా కలపతో,,,,,,,,
తినడానికి తిండి కరువు. ఉండడానికి ఇళ్ళు లేక చిరిగిన బట్టలతో శరీరాలు కప్పుకున్న దైన్యం బడిపిల్లల బ్రతుకులు వలస కూలీలు,,,,,,,
ఇలాంటి ఆకులపై బహుచక్కగా చిత్రీకరణ నా పూవులతోనే నా కర్రలతోనే నన్ను గొడ్డలితో గొడ్డులా నరికేస్తారు,,,,,,,,
అన్నం పెట్టే అడవి అందాల ప్రకృతిని ఆస్వాదించలేని మూర్ఖులు హతమారుస్తూ టీవీలు,స్మార్ట్ ఫోన్ లు, సినిమాలు గుడ్లప్పగించి అర్ధరాత్రి అపరాత్రి అనకుండా చూస్తో,,,, వెర్రితలలు వేసిన నాగరికులు రాతియుగం దాపురించింది కాబోలు మళ్ళీ,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట